విజయసాయిరెడ్డి వీడియో బయటపెట్టిన వైసీపీ: విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడనడానికి పక్కా ఆధారాలు అంటూ ఎక్స్లో వైసీపీ పార్టీ ఓ వీడియో రిలీజ్ చేసింది. టీడీపీ నేతలతో విజయసాయిరెడ్డి రహస్య మంతనాలు చేశారని పేర్కొంది. మద్యం కుంభకోణంలో విచారణకు ముందు మీటింగ్ జరిగిందని వైసీపీ తెలిపింది. తాడేపల్లి పార్క్ విల్లాలోని విల్లా నంబర్ 27కు విజయసాయిరెడ్డి వెళ్లారని, 13 నిమిషాల తర్వాత అక్కడికి టీడీ జనార్దన్ రెడ్డి చేరుకున్నారని, ఇరువురి మధ్య 45 నిమిషాల పాటు చర్చలు జరిగిందని…
మహిళలకు ఉచిత బస్సు డేట్ ఫిక్స్: ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలను కూటమిప్రభుత్వం ఒక్కటిగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో ‘తల్లికి వందనం’, ‘మహిళలకు ఉచిత బస్సు’ పథకాలకు డేట్స్ ఫిక్స్ చేశారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా జూన్ నుంచి తల్లికి వందనం, ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తాం అని మంత్రి నారాయణ చెప్పారు. మరోవైపు పాఠశాలలు మొదలుపెట్టే రోజున తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి…
భోగాపురం ఎయిర్పోర్ట్కు 500 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏవియేషన్ హబ్ నిర్మాణంలో భాగంగా సిటీ సైడ్ డెవలప్మెంట్ కోసం 500 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. జీవీఐఎఎల్ సంస్థకు 500 ఎకరాల భూ కేటాయింపునకు రెండు రోజుల క్రితం రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రుల కమిటీ సిఫార్సుల మేరకు భోగాపురం విమానాశ్రయానికి ఈ భూ కేటాయింపునకు ఆమోదం తెలిపింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం.. ఎయిర్పోర్ట్ అభివృద్ధి కోసం…
కూటమి ప్రభుత్వ అరాచకాలను ధీటుగా ఎదుర్కొందాం: కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను ధీటుగా ఎదుర్కొందాం అని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలకు చట్టపరంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ జరుగుతోందని మండిపడ్డారు. స్ధానిక సంస్ధల ఉప ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా బరితెగించి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత జగన్ను…
జగన్ పథకాల్ని నిలిపేసి ప్రజలపై కక్ష కట్టొద్దు: మాజీ సీఎం వైఎస్ జగన్ పథకాల్ని నిలిపేసి ప్రజలపై కక్ష కట్టొద్దని వైసీపీ మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వాన్ని కోరారు. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థల్ని కుప్పకూలుస్తున్నారని, గత ప్రభుత్వ హయాంలో జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలను తుంగలో తొక్కుతున్నారని ఫైర్ అయ్యారు. రేషన్ వ్యాన్ల ద్వారా సరఫరా చేసే ఎండీయూ ఆపరేటర్స్…