ఏపీకి ప్రత్యేక హోదా.. కట్టుబడి ఉన్నామని ప్రకటన రాజకీయ తీర్మానంలో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించింది కాంగ్రెస్ పార్టీ.. రాయపూర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి.. ప్లీనరీ వేదికగా చేసిన రాజకీయ తీర్మానంలో ఏపీకి “ప్రత్యేక హోదా” అంశం ప్రస్తావించారు.. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చే అంశానికి కట్టుబడి ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.. ఇక, కొండ ప్రాంతాలున్న రాష్ట్రాలకు ప్రత్యేక తోడ్పాటు, సహాయం లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని తీర్మానంలో…
జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర తిరుపతి నియోజకవర్గంలో కొనసాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు లోకేష్… అభివృద్ధిలో ఏపీ అగ్రస్థానంలో ఉండాలని ఎవరెవరు కోరుకుంటారో వారందరూ రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో మొదట కావాల్సింది మంచి మనసు అని, 2014లోనే తాను పవన్ కల్యాణ్ లో మంచి మనసును చూశానని లోకేష్ చెప్పుకొచ్చారు.. కాగా, నారా…
అప్పటి వరకు బండి సంజయే అధ్యక్షుడు.. స్పష్టం చేసిన తరుణ్ చుగ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ), తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై పార్టీ అధిష్టానం గట్టి నమ్మకాన్ని పెట్టుకున్నట్టుందే.. సంజయ్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. దానికి కారణం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.. ఎందుకంటే.. 2024 వరకు బండి సంజయ్‌నే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉంటారని స్పష్టం చేశారు తరుణ్ చుగ్.. పార్టీ సంస్థాగత…
ఏపీకి చేరుకున్న కొత్త గవర్నర్.. స్వాగతం పలికిన సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్ రాష్ట్రానికి చేరుకున్నారు.. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయనకు స్వాగతం పలికారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. నూతన గవర్నర్ కు ఎయిర్‌పోర్ట్‌లో సీఎం జగన్‌తో పాటు సీఎస్ జవహార్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్, మంత్రి జోగి రమేష్, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు ఐఏఎస్, ఐపీఎస్…
నూతన పారిశ్రామిక విధానంపై భేటీ.. సీఎం జగన్ కీలక ఆదేశాలు నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. నూతన పారిశ్రామిక విధానంపై ఉన్నతాధికారులతో ప్రాథమిక సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ సందర్భంగా పారిశ్రామిక విధానంపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.. పరిశ్రమల స్థాపన మొదలు మార్కెటింగ్ వరకు పరిశ్రమలను చేయిపట్టుకుని నడిపించే విధంగా పాలసీ ఉండాలని ఆదేశించిన ఆయన.. మార్కెటింగ్ టై అప్ విధానంపై దృష్టి సారించాలన్నారు. అంతర్జాతీయంగా…
లోకేష్ పాదయాత్రలో అపశృతి.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది.. లోకేష్ పాదయాత్ర బందోబస్తులో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమేష్ గుండెపోటుతో మృతి చెందారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో సాగుతున్న పాదయాత్రలో రమేష్ కుప్పకూలాడు.. వెంటనే అప్రమత్తమైన సహచర పోలీసులు.. అతన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే, రమేష్.. ఐరాల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పని…
లోకేష్ పాదయాత్ర… టీడీపీకి పాడే యాత్రే..! టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై సెటైర్లు వేశారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి.. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన ప్రజా సంక్షేమ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు రాస్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి.. ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్ర వెల వెల పోతుంటే ఎమ్మెల్యే పెద్దారెడ్డి యాత్ర గ్రాండ్ సక్సెస్…
మళ్లీ హైదరాబాద్ రోడ్డు ఎక్కనున్న డబుల్ డెక్కర్ బస్సులు హైదరాబాద్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు తిరుగనున్నాయి. మంగళవారం చేవెళ్ల ఎంపీ జి రంజిత్ రెడ్డి, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సమక్షంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్, సీఎస్ శాంతికుమారి మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో షెడ్యూల్ చేయబడిన ఫార్ములా ఇ-ప్రిక్స్‌తో, ఈ బస్సులు ప్రధానంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ప్యారడైజ్…
వైఎస్సార్ సెంటిమెంట్ లాగానే.. సీతక్క నియోజకవర్గం నుంచే యాత్ర ప్రారంభించా.. రాహుల్ గాంధీ సందేశాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చానని, హాత్ సే హాత్ జోడో యాత్రలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. 20 శాతం మైనార్టీలు, 80శాతం మెజార్టీలను విభజించి పాలించిన విధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. విభజించు పాలించు విధానంతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీ ప్రయత్నాన్ని.. ప్రజలకు చాటి చెప్పేలాగా రాహుల్ గాంధీ యాత్ర చేశారన్నారు. రాహుల్ గాంధీ…
పొంగులేటి సంచలన వ్యాఖ్యలు.. దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి.. ! ఓవైపు అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఫైర్ అవుతూనే.. మరోవైపు రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. నన్ను నమ్ముకున్న వారి మనస్సులో ఏ పార్టీ ఉందో .. వారి అభీష్టానికి మేరకే పార్టీ మారుతాను. ఎవరో ఉరికిస్తే తొందరపడి ఏ పార్టీలో చేరను అన్నారు. తెలంగాణ వస్తే నీళ్లొస్తాయని, గిరిజనుల సమస్యలు తీరుతాయని భావించారు.. కానీ, అవేమి నెరవేరలేదు.. యావత్తు…