స్కూల్లో సంక్రాంతి సంబరాలు.. భోగి మంటల్లో అపశృతి సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది.. అంతకంటే ముందే.. సంక్రాంతి సెలవులు వస్తాయి.. దీంతో.. ముందుగానే స్కూల్స్, కాలేజీలు, విద్యాసంస్థల్లో సంక్రాంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.. అయితే, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది.. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలోని ప్రైవేటు పాఠశాలలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి మంటలు వేశారు.. అయితే, ఆ మంటలు అంటుకుని ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి.. బాధిత విద్యార్థులను…
పవన్ కల్యాణ్ అంటే నాకు అభిమానం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. పవన్ కల్యాణ్ మా వాడు.. అభిమానం ఉందన్న ఆయన.. మా సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ మీద మాకు అభిమానం ఉండదా..? అని ఎదురు ప్రశ్నించారు.. అయితే, పవన్ చేష్టల వల్ల కాపుల పరువు తీస్తున్నాడనే బాధ మాకుందన్నారు.. ఇక, సీఎం.. సీఎం.. అంటూ పవన్ కల్యాణ్‌ను చూసి నినాదాలు చేస్తున్నవారికి ఆయన అన్యాయం చేస్తున్నారని…
పాడి రైతులకు రూ.7.20 కోట్ల బోనస్ కర్నూలు మిల్క్ యూనియన్ (విజయ డైరీ) పాడి రైతులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా కర్నూలు మిల్క్ యూనియన్ (విజయ డైరీ) పాడి రైతులకు బోనస్ పంపిణీ చేశారు.. రూ. 7.20 కోట్ల రూపాయల బోనస్ చెక్‌ను సీఎంకి అందజేశారు కర్నూలు మిల్క్ యూనియన్ చైర్మన్ ఎస్.వి. జగన్ మోహన్ రెడ్డి… పాడి రైతుల విషయంలో…
మరో మూడు నోటిఫికేషన్లు విడుదల చేసిన TSPSC న్యూ ఇయర్ వేళ టీఎస్పీఎస్సీ మరో మూడు నోటిఫికేషన్ లు విడుదల చేసింది. పురపాలక శాఖలో 78 అకౌంట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. జనవరి 20 నుండి ఫిబ్రవరి 11 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే.. దీంతో పాటు.. కళాశాల విద్యాశాఖలో 544 పోస్ట్ లు(491 డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ లు) భర్తీకి మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది TSPSC.…
శ్రీవారిపై కాసుల వర్షం.. వరుసగా పదో నెల 100 కోట్లు దాటిన హుండీ ఆదాయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిపై కనకవర్గం, కాసుల వర్షం కురుస్తూనే ఉంది.. శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి వంద కోట్ల మార్క్‌ను దాటింది.. శ్రీనివాసుడి హుండీ ఆదాయం 100 కోట్ల రూపాయలను దాటడం ఇది వరుసగా 10వ నెల కావడం విశేషం.. డిసెంబర్ నెలలో హుండీ ద్వారా ఇప్పటికే శ్రీవారికి 120.3 కోట్ల రూపాయలను కానుకగా సమర్పించారు భక్తులు.. ఈ నెలలో…
ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హస్తినకు చేరుకున్నారు. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. పోలవరం నిధులు, విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా తదితర అంశాలపై ప్రధానికి వినతిపత్రం ఇవ్వనున్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణ…
ఏపీ ఇంటర్ పరీక్షల టైం టేబుల్ విడుదల ఇంటర్ విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న పరీక్షల తేదీలు రానేవచ్చాయి.. ఏపీ ఇంటర్ 2023 పరీక్షలకు సంబంధించిన టైంటేబుల్‌ను విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు.. 2023 మార్చి 15వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు.. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న పరీక్ష.. మధ్యాహ్నం 12 గంటలకు ముగియనుంది.…
కాంగ్రెస్ సీనియర్లకు మల్లు రవి కౌంటర్.. కాంగ్రెస్ సీనియర్లకు కౌంటర్ ఇచ్చారు మరో సీనియర్ నేత మల్లు రవి.. ఏ కమిటీల్లో ఎవరి సంఖ్య ఏ స్థాయిలో ఉందే చెప్పుకొచ్చారు మల్లు రవి.. 22 మందితో ఉన్న పీఏసీ కమిటీలో రేవంత్‌రెడ్డి మినహా టీడీపీ నుండి వచ్చినవాళ్లు ఎవరూ లేరని స్పష్టం చేసిన ఆయన.. ఇక, 40 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఇద్దరే టీడీపీ నుండి వచ్చినవాళ్లు ఉన్నారు.. ఉపాధ్యక్ష పదవిలో 24 మందిలో ఐదుగురు టీడీపీ…
హైదరాబాద్‌లో పేలుడు కలకలం.. హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్ బండ్ వద్దనున్న జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో కాగితాలు ఏరుకునే తండ్రీకొడుకులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం వారికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుండగా.. కొడుకు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రతి డంపింగ్ యార్డులో తండ్రి చంద్రన్న(45), సురేశ్(14) చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్నారు. యథావిధిగా గురువారం చెత్త ఏరుతుండగా.. పెయింట్…
నేను ఫెయిల్డ్ పొలిటీషియన్.. ఫెయిల్యూర్ అనేది సక్సెస్ కి సగం అడుగు దూరం.. తన రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తానొక ఫెయిల్యూర్ పొలిటీషియన్ని అని వ్యాఖ్యానించారు.. అయితే, పవన్ ఆ వ్యాఖ్యలు చేయగానే అక్కడున్న సీఏ స్టూడెంట్స్ ఒక్కసారిగా సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. కానీ, దీనిని నేను అంగీకరించాలని, రాజకీయాల్లో ఫెయిల్ అయినందుకు తానేమీ బాధపడడం లేదన్నారు.. అంతేకాదు, ఫెయిల్యూర్ అనేది సక్సెస్ కి సగం…