మత్స్యకారులు అలర్ట్.. 61 రోజుల పాటు చేపల వేట నిషేధం.. సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాదేశిక సముద్ర జలాల్లో చేపల వేట 61 రోజులపాటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. ఈ విషయాన్ని రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ కె. కన్నబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాదేశిక సముద్ర జలాల్లో యాంత్రిక పడవలు అనగా మెకనైజ్డ్ మరియు మోటారు బోట్ల ద్వారా నిర్వహించే అన్ని రకాల చేపల…
సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రత్యేకతలు ప్రధాన మోడీ రేపు తెలుగు రాష్ట్రాల్లో రెండో వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మధ్య నడుపనుంది దక్షిణ మధ్య రైల్వే. అయితే.. ఈ వందే భారత్ ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి. నిత్యం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఆరు సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ వెళ్తున్నాయి. అయితే.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ లో ప్రయాణం…
బాబు వెళ్లమంటేనే వారాహి బ్యాచ్ ఢిల్లీ టూర్.. బీజేపీతో విడాకులా..? టీడీపీతోనా..? ఈ మధ్యే హస్తినలో పర్యటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ అయితే, వారి పర్యటనపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.. వారాహి బ్యాచ్ ఢిల్లీ టూర్‌కు వెళ్లింది అని ఎద్దేవా చేశారు.. చంద్రబాబు వెళ్లమంటే వారు వెళ్లారని అందరికీ తెలుసన్న ఆయన.. బీజేపీతో విడాకులు తీసుకోవటానికి వెళ్లాడా? లేక టీడీపీతో విడాకులు తీసుకుంటానని చెప్పడానికి వెళ్లాడా? అని ప్రశ్నించారు..…
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్.. మరో వ్యక్తి అరెస్ట్.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌కార్పొరేషన్ స్కామ్ కేసులో మరో వ్యక్తిని అరెస్ట్ చేసింది సీఐడీ.. సిమెన్స్ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్‌ను అరెస్ట్ చేసింది.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కామ్ కేసులో సిమెన్స్ సంస్థ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్‌ను నోయిడాలో అరెస్టు చేశారు.. ఇక, జీవీఎస్ భాస్కర్‌ను ట్రాన్సిట్ వారంట్‌పై విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనుంది సీఐడీ.. సిమెన్స్ సంస్థ రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రాజెక్టు…
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ వేటు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడుకు ఏడు స్థానాల్లో అధికార వైసీపీ గెలవాల్సి ఉన్నా.. క్రాస్ ఓటింగ్‌తో ఓ స్థానాన్ని కోల్పోయింది.. దీంతో, వైసీపీకి షాక్ తగిలినట్టు అయ్యింది.. ఇక, దిద్దబాటు చర్యలకు దిగింది వైసీపీ అధిష్టానం.. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను గుర్తించింది.. తన మార్టీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి..…
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్.. టీడీపీ అభ్యర్థి విజయం మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థికి ఓటమి తప్పలేదు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు.. ఆమెకు 23 ఓట్లు వచ్చాయి.. అయితే, ఎమ్మెల్యే కోటాలోని ఏడు స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఏడుగురు…
ఏపీ రాజధాని అమరావతే.. సీఎం విశాఖకు పారిపోతున్నారు..! ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. త్వరలోనే విశాఖ నుంచి పాలన సాగిస్తామని స్పష్టం చేశారు.. అయితే, విపక్షాలు మాత్రం.. అమరావతే రాజధాని అని చెబుతున్నాయి.. మరోసారి రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఏపీ రాజధాని అమరావతేనని స్పష్టం చేసిన ఆయన.. అమరావతిలోనే రాజధాని నిర్మిస్తాం అని ప్రకటించారు.. అమరావతి రాజధాని అనే…
దక్షిణ మధ్య రైల్వే జీఎంపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టు అంటే లెక్కలేదా..? దక్షిణ మధ్య రైల్వే జీఎంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఆదేశాలు ఇచ్చినా కోర్టుకు హాజరు కాకపోవడంపై మండిపడ్డింది.. రైల్వే జనరల్ మేనేజర్ విజయవాడ డీఆర్ఎం కోర్టుకు రావాలని ఆదేశాలు ఇచ్చినా రాకపోవటంతో స్పందించిన హైకోర్టు.. ఈ వ్యాఖ్యలు చేసింది.. కోర్టు అంటే లెక్కలేని తనమా అని వ్యాఖ్యానించిన న్యాయస్థానం.. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది..…
ముగిసిన కవిత ఈడీ విచారణ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. ఇవాళ ఉదయం 11.00 గంటలకు ప్రారంభమైన కవిత ఈడీ విచారణ రాత్రి 8 గంటల వరకు సాగింది. కవిత తన సొంత వాహనంలో ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు. ఈడీ ఆఫీస్‌లోకి వెళ్లే సమయంలో ఎలాగైతే చిరునవ్వుతో వెళ్లారో బయటకు కూడా అలాగే వచ్చారు కవిత. ఇదిలా ఉంటే ఇన్ని గంటలపాటు కవితను ఏం…
రేపు కవితను అరెస్ట్ చేయొచ్చు.. రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దాం కవితకు ఈడీ నోటీసులపై సీఎం కేసీఆర్ స్పందించారు. గంగుల, రవిచంద్ర.. ఇప్పుడు కవిత వరకు వచ్చారని ఆయన అన్నారు. ఎంత మంచి పనిచేసినా బద్నాం చేస్తారని ఆయన మండిపడ్డారు. ప్రజల కోసం కడుపు కట్టుకుని పనిచేయాలని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా.. రేపు కవితను అరెస్ట్ చేయొచ్చునని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చేసుకుంటే చేసుకోని అని, అందర్నీ వేధిస్తున్నారని ఆయన ఆగ్రహం…