హైదరాబాద్‌ను మరో 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచండి: హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా పేర్కొంటూ చట్టం తెచ్చేలా కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఏపీ విభజన చట్టం 2014 ప్రకారం.. తెలంగాణ, ఏపీల మధ్య ఆస్తులు, అప్పులు, తొమ్మిదో షెడ్యూల్లో పేర్కొన్న వివిధ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన ప్రక్రియ పూర్తికాలేదని పేర్కొంటూ…
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సవాల్-ప్రతి సవాల్: ఎన్నికల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సవాల్-ప్రతి సవాల్‌తో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అవినీతిపరుడు అంటూ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కరపత్రాలు పంచారు. నువ్వు నిరూపించూ అంటూ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి సవాల్ విసిరారు. దాంతో ఇరువురు నేతలు బహిరంగ చర్చకు సిద్ధం అయ్యారు. దాంతో అనపర్తిలో ఏమి జరుగుతుందంటూ ప్రజల్లో ఉత్కంఠ…
నేటితో ముగియనున్న కాంగ్రెస్ ధరఖాస్తుల పరశీలన: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యాయి. వైసీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల జాబితాపై కసరత్తులు చేస్తున్నాయి. ఈ క్రమంలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ.. విజయవాడ ఆంధ్ర భవన్లో దరఖాస్తులను స్వీకరిచింది. నేటితో కాంగ్రెస్ ధరఖాస్తుల పరశీలన ముగియనుంది. బుధవారం అర్ధరాత్రి వరకూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే అభ్యర్ధులు…