8వ రోజుకు చేరిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 8వ రోజుకు చేరింది.. తిరుపతి జిల్లాలో కొనసాగుతున్న మేమంతా సిద్ధం యాత్ర.. ఈ రోజు నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనుంది.. ఈ రోజు ఉదయం 9 గంటలకు గురవరాజుపల్లె రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది.. మల్లవరం, ఏర్పేడు మీదగా పనగల్లు, శ్రీకాళహస్తి బైపాస్ చిన్న సింగమలమీదగా పోయ్య గ్రామం చేరుకోనుంది యాత్ర.. ఇక, ఉదయం 11 గంటలకు డ్రైవర్స్ అసోసియేషన్స్ తో ముఖముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు సీఎం వైఎస్ జగన్. అనంతరం చావలిలో భోజన విరామం తీసుకోనున్నారు.. సాయంత్రం 3:30 గంటలకు కాళహస్తి నాయుడుపేట బైపాస్ సమీపంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.. సభ అనంతరం ఓజిలి క్రాస్, బుదనం, గూడూరు, మనుబోలు, నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డి పాలెం దగ్గర ఏర్పాటు చేసిన బస కేంద్రానికి చేరుకోనుంది బస్సు యాత్ర..
నేడు కొవ్వూరులో చంద్రబాబు పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో విడత ప్రజాగళం యాత్రలు చేపట్టిన విషయం విదితమే.. నేడు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది.. మధ్యాహ్నం 3 గంటలకు కొవ్వూరు చేరుకోనున్నారు చంద్రబాబు.. చాగల్లు రోడ్డు నుండి విజయ విహార్ సెంటర్ వరకు రోడ్ షోలో పాల్గొననున్న టీడీపీ అధినేత.. అనంతరం ప్రజాగళం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.. ఇక, సభ అనంతరం గోపాలపురం పర్యటనకు వెళ్లనున్నారు చంద్రబాబు.. మరోవైపు చంద్రబాబు కొవ్వూరు పర్యటన, ప్రజాగళం సభ విజయవంతంపై బుధవారం టీడీపీ నేతలు సమీక్ష నిర్వహించారు.. హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో సంయుక్తంగా, వేర్వేరుగా సమావేశమై సభ జయప్రదానికి ప్రత్యేక కార్యాచరణ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఇక, ఈ రోజు మధ్యాహ్నం లక్ష్మీవెంకటేశ్వర రైస్‌మిల్లు ప్రాంగణంలోని హెలిప్యాడ్‌కు చేరుకోనున్నారు చంద్రబాబు.. అక్కడి నుంచి కార్లు, బైక్ ర్యాలీ మధ్య ప్రదర్శనగా విజయవిహార్ సెంటర్‌కు వరకు చేరుకోనున్నారు చంద్రబాబు..
నేడు కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం..
శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీటి వినియోగానికి సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు త్రిమెన్ కమిటీ నేడు (గురువారం) ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ మేరకు బోర్డు ఇరు రాష్ట్రాలకు లేఖ రాసింది. కమిటీలో బోర్డు మెంబర్ సెక్రటరీ, ఇరు రాష్ర్టాలు ఈఏన్సీలు సభ్యులుగా ఉండనున్నారు. త్రిసభ్య కమిటీ గత అక్టోబర్‌లోనే భేటీ అయింది.. రెండు రిజర్వాయర్లలో దాదాపు 82కి పైగా టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. అందులో ఏపీకి 45, తెలంగాణకు 35 టీఎంసీలను కేఆర్ఎంబీ కేటాయించింది. మిగిలిన 2 టీఎంసీలను మే నెల తర్వాత భవిష్యత్ అవసరాలకు ఉపయోగించాలని చెప్పింది. అయితే, తెలంగాణ ఇప్పటికే కోటాకు మించి నీటిని వినియోగించుకుంది. కాగా, ఏపీ తన కోటాలో 42 టీఎంసీలను వినియోగించుకోగా, మరో 3 టీఎంసీలు మిగిలి ఉన్నాయని కేఆర్ఎంబీకి తెలిపింది. అయితే, ఏప్రిల్‌లో మరో 5 టీఎంసీలను విడుదల చేయాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ కేఆర్‌ఎంబీకి లేటర్ రాసింది. కోటాకు మించి 2టీఎంసీలను కోరుతుంది. ఈ నేపథ్యంలో త్రిమెన్ కమిటీ ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. ఇక, కేఆర్ఎంబీ నిర్వహించే త్రీ మెంబర్ కమిటీ సమావేశానికి హాజరుకాలేమని రెండు రాష్ట్రాలు కేఆర్ఎంబీకి లెటర్ రాసినట్టు సమాచారం. తెలంగాణ ఈఎన్సీ (జనరల్) లీవ్ లో ఉండడంతో ఈ మీటింగ్ కు రాలేకపోతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ నుంచి అధికారులు రాకపోవడంతోతాము కూడా సమావేశానికి అటెండ్ కావడం లేదని కేఆర్ఎంబీకి ఏపీ కూడా లేఖ రాసినట్టు సమాచారం. రెండు రాష్ట్రాలు రాసిన లేఖలపై కేంద్ర జలశక్తి శాఖకు కేఆర్ఎంబీ అధికారులు లెటర్ రాసే అవకాశం ఉంది.
తెలంగాణకు చల్లని కబురు.. రెండు రోజుల వానలు..
భారత వాతావరణశాఖ తెలంగాణ రాష్ర్టానికి చల్లని కబురు చెప్పింది. త్వరలో రాష్ట్రానికి వర్ష సూచన ఉందని.. కాస్త ఉష్ణతాపం నుంచి రిలీఫ్ దొరుకుతుందని తెలిపింది. రాష్ట్రంలో 6వ తేదీ వరకు వాతావరణం పొడిగా ఉంటుంది.. 7, 8 తేదీల్లో పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెదర్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా, రాష్ట్రంలో ఈ వేసవిలో తొలిసారిగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నిన్న (బుధవారం) నమోదు అయింది. కాగా, ఖమ్మంతో పాటు భద్రాద్రి కొత్తగూడెంలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నేటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఎల్‌నినో పరిస్థితులు జూన్ చివరి వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఈ వేసవిలో ఎండలు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే నమోదవుతున్నాయి. నిజామాబాద్‌లో 41.2, ఆదిలాబాద్‌లో 41.3, మెదక్, రామగుండం, నల్లగొండలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ఎండలు, వడగాడ్పులు ఎక్కువగానే ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది. ముఖ్యంగా మే నెలలో అగ్నిగుండాన్ని తలపించేలా ఎండలు, వడగాడ్పులు ఉండే ఛాన్స్ ఉందని పేర్కొనింది. సాధారణం కంటే 5-8 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ హెచ్చరించింది.
నేడు అహ్మదాబాద్ లో పరుగుల వరద పారేనా..?!
నేడు ఐపీఎల్ 2024 17వ మ్యాచ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఐపీఎల్ 2024 ప్రస్తుత సెషన్‌లో ఇరు జట్లకు ఇది నాల్గవ మ్యాచ్. మ్యాచ్ నేడు సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. గుజరాత్ టైటాన్స్ మూడు మ్యాచ్ లలో 4 పాయింట్లతో -0.738 రన్ రేట్ తో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మరోవైపు, పంజాబ్ కింగ్స్ నాలుగు మ్యాచ్ లలో రెండు పాయింట్లతో -0.337 రన్ రేట్ తో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఇప్పటి వరకు మొత్తం 3 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాయి. ఇందులో పంజాబ్ పై రెండు మ్యాచ్ లు గుజరాత్ గెలవగా., పంజాబ్ 1 మ్యాచ్ ను కైవసం చేసుకోవడంతో పంజాబ్‌పై గుజరాత్ పైచేయి సాధించింది. ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ అత్యధిక స్కోరు 190 కాగా, గుజరాత్ టైటాన్స్ పై పంజాబ్ అత్యధిక స్కోరు 189. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. GT మార్చి 24న తమ మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై 6 పరుగుల తేడాతో గెలిచింది. మార్చి 26న చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 63 పరుగుల తేడాతో ఓడిపోయింది, ఆపై మూడో మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక పంజాబ్.. మార్చి 23న ఢిల్లీ క్యాపిటల్స్ ని 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఇక రెండో మ్యాచ్ లో మార్చి 25న బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మూడో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో 21 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్.. సూర్య వచ్చేస్తున్నాడు!
ఐపీఎల్ 2024లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్. ముంబై స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ త్వరలోనే జట్టులో కలుస్తాడని తెలుస్తోంది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) వైద్యులు సూర్యకు ఫిట్‌నెస్ క్లియెరెన్స్ ఇచ్చినట్లు సమాచారం. ముంబై ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. ఏప్రిల్ 7న ఢిల్లీతో జరుగబోయే మ్యాచ్‌లో సూర్య ఆడే అవకాశాలు ఉన్నాయని ఎన్‌సీఏకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. వన్డే ప్రపంచకప్ 2023 అనంతరం మడమ, స్పోర్ట్స్ హెర్నియాతో సూర్యకుమార్ యాదవ్ బాధపడిన విషయం తెలిసిందే. సర్జరీల కారణంగా సూర్య గత నాలుగు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. సర్జరీల అనంతరం మార్చి నుంచి ఎన్‌సీఏ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు స్కైకు ఫిట్‌నెస్ పరీక్ష చేయగా.. అందులో విఫలమయ్యాడు. రెండోసారి నిర్వహించిన పరీక్షల్లో ఒకటి మినహా అన్ని ఫిట్‌నెస్ పరీక్షలను అతడు పూర్తి చేసినట్లు తెలిసింది. మిగిలిన ఆ ఒక్క పరీక్షను గురువారం నిర్వహించనున్నారు. ఇందులోనూ ఫిట్‌గా తేలితే మ్యాచ్ ఆడేందుకు ఎన్‌సీఏ నుంచి అనుమతి వస్తుంది.
శృతిహాసన్ రేంజ్ పెరిగింది గురూ..
టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇటీవల వరుస హిట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. గత ఏడాది సలార్ సినిమాతో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు.. ఈ ఏడాదిలో హాయ్ నాన్న సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది.. ఆ సినిమా హిట్ అవ్వడంతో మరో హిట్ ను తన అకౌంట్ లో వేసుకుంది.. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.. ఓ సినిమాలో డీటేక్టివ్ గా కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ అమ్మడు సినీ కేరీర్‌ను చూస్తే హీరోయిన్ గానే కాదు.. సంగీత దర్శకురాలిగా, గాయనీగా, గీత రచయితగా తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.. 14 ఏళ్ల వయస్సులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. లక్ అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. ఇలా ఒక్కో సినిమాతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. ప్రస్తుతం ఈ అమ్మడు హాలివుడ్ సినిమాల్లో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది.. చైన్నె స్టోరీ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నారు. మొదట ఈ సినిమాలో సమంతను అనుకున్నా కూడా ఆమె అనారోగ్యం కారణంగా సినిమాను రిజెక్ట్ చేసింది. దాంతో ఆ ఛాన్స్ శృతిహాసన్ కు వచ్చింది.. అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ అనే హాస్య నవల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో శృతిహాసన్ అనూ అనే లేడీ డిటెక్టీవ్‌గా నటిస్తున్నారు. కాగా ఈమె ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు.. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈమె హాలివుడ్ సినిమాలో నటించడం చాలా థ్రిల్ గా ఉందని చెప్పింది..
రెడ్ డ్రెస్సులో హాట్ లుక్ లో శ్రీలీలా స్టన్నింగ్ పోజులు..
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీలా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.. రెండు, మూడు సినిమాల్లో మెరిసిందో లేదో అమ్మడు అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు.. అందం, డ్యాన్స్ శ్రీలీలాకు ప్లస్ పాయింట్స్…ఈ ముద్దుగుమ్మ టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీలా సినిమాలకు బ్రేక్ తీసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక సోషల్ మీడియాలో మాత్రం అభిమానులను పలకరిస్తూ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది… తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.. రెడ్ డ్రెస్సులో హాట్ ఫోజులు ఇచ్చింది.. కసి చూపులతో కుర్రాళ్ల కంటిమీద కునకులేకుండా చేస్తుంది. హాట్ లుక్ లో అదిరిపోయేలా ఉన్న ఫోటోలు నెటిజన్లకు నిద్ర పట్టడం. కుర్ర భామ చూపులకు తట్టుకోలేక పోతున్నారు. రవితేజ ‘ధమాఖా’, బాలయ్య భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్ లను తన ఖాతాలో వేసుకుంది.. ఆ తర్వాత వచ్చిన ఆదికేశవ నిరాశ పరిచిన గుంటూరు కారం సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. శ్రీలీలాకు అతి తక్కువ సమయంలో బాలయ్య, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్ స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ రావడం విశేషం.