ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షల మాస్ కాపీయింగ్ కలకలం సృష్టిస్తోంది.. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు జగ్గయ్యపేటలో పరీక్షలకు హాజరవుతున్నారు.. ముడు సెంటర్లలో దాదాపు 700 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.. జగ్గయ్యపేట ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం ఆధ్వర్యంలో ఓపెన్ ఇంటర్ స్కూల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.. అయితే, ఓపెన్ ఇంటర్ పరీక్షల లో జవాబు పత్రాలు అందిస్తామంటూ విద్యార్థికి రూ.15 వేల నుంచి 25 వేల…
చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్.. ఇవే సజీవ సాక్ష్యం..! సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. నెల్లూరులో గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను సందర్శించిన టీడీపీ అధినేత.. టిడ్కో ఇళ్ల ముందు సెల్ఫీ దిగి సీఎం జగన్కు ఛాలెంజ్ విసురుతూ ట్వీట్ చేశారు.. ”చూడు.. జగన్! ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు నాడు నెల్లూరులో కట్టిన వేలాది టిడ్కో ఇళ్లు అంటూ ట్వీట్ చేశారు.. రాష్ట్రంలో నాడు…
రేపటి నుంచి ‘జగనన్నే మా భవిష్యత్తు’ క్యాంపెయిన్.. టార్గెట్ ఇదే..! ఆంధ్రప్రదేశ్ మరోసారి అధికారమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు సీఎం వైఎస్ జగన్.. అందులో భాగంగా ఇప్పటికే గడపగడపకు ప్రభుత్వం పేరుతో ప్రతీ ఇంటికి ప్రజాప్రతినిధులు వెళ్లి తమ ప్రభుత్వ హయాంలో చేకూర్చిన లబ్ధిని తెలియజేస్తున్నారు. ఇక, మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యారు. రేపటి నుంచి ‘జగనన్నే మా భవిష్యత్తు’ క్యాంపెయిన్ ప్రారంభం కానుంది.. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని…
విద్యుత్ వినియోగదారులకు గుడ్న్యూస్.. ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ వినియోగదారులు గుడ్న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ).. ఇప్పట్లో వినియోగదారులపై విద్యుత్ బిల్లుల భారం ఉండబోదని స్పష్టం చేసింది.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ టారిఫ్ వివరాలను ప్రకటించారు ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి.. ఆ వివరాల ప్రకారం ఈ ఏడాది విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి భారం ఉండబోదన్న మాట.. ఇక, ఈ సందర్భంగా జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు ఉచిత…
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన.. ప్రస్తుతానికి ఎత్తు అంతే..! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం.. పోలవరం నీటి నిల్వపై లోకసభలో సమాధానం ఇచ్చారు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్.. పోలవరం ఎత్తు ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితం అని తేల్చిచెప్పారు.. తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వ చేయనున్నట్లు స్పష్టం చేసింది కేంద్రం.. తొలిదశ సహాయ, పునరావాసం అంతవరకే…
రేపు కరీంనగర్ జిల్లాకు సీఎం కేసీఆర్.. రైతులకు సాయం ప్రకటిస్తారా? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. రామడుగు మండలంలోని రైతులకు చెందిన పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించి సహాయానికి సంబంధించి అధికారులకు సూచనలు అందించనున్నారు. రామడుగు మండలంలోని రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఇటీవల కురిసిన వడగళ్ల వానతో కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలంలోని ధర్మాజిపేట, చిప్పకుర్తి, లక్ష్మీ పూర్ గ్రామాల్లో…
ప్రజలు జగనన్న వన్స్ మోర్ అంటున్నారు.. టీడీపీది పగటి కలే..! జగనన్న వన్స్మోర్ అని ప్రజలు అంటున్నారు.. అధికారంలోకి వస్తామనేది టీడీపీ పగలి కలే అని వ్యాఖ్యానించారు మంత్రి ఆర్కే రోజా.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. 2019 నుండి ఎక్కడా గెలవకపోవడంతో టీడీపీ నాయకులు పిచ్చెక్కిపోయారు.. శవాల నోట్లో తులసి తీర్థం పోసిన విధంగా టీడీపీకి అనుకోకుండా మూడు ఎమ్మెల్సీలు వచ్చాయి.. ఆ ఎమ్మెల్సీలు సొంత ఓట్లు, సింబల్తో గెలవలేదు.. అయినా పెద్ద ఘనకార్యం సాధించినట్లు…
సంక్షేమం, విద్యా, వైద్యానికి సర్కార్ పెద్ద పీట.. బడ్జెట్లో సంక్షేమం, విద్యా, వైద్యానికి పెద్ద పీట వేసింది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. మొత్తం బడ్జెట్ లో ఆర్ధిక సేవలకు వ్యయం 69, 306 కోట్లుగా ఉంది.. బడ్జెట్ కేటాయింపుల్లో సంక్షేమ రంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది.. 51,345 కోట్ల రూపాయలు సంక్షేమానికి కేటాయించారు.. మొత్తం కేటాయింపుల్లో ఇది 27 శాతం.. సాధారణ విద్యకు రెండో ప్రాధాన్యత కేటాయింపులు లభించాయి.. మాధ్యమిక, ఉన్నత విద్యకు 32,198 కోట్లు…
మేం బీసీల ఐక్యత కోరుకుంటున్నాం.. వారికి అండగా ఉంటాం.. జనసేన బీసీ కులాల ఐక్యత కోరుకుంటోంది.. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రకటించారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంక్షేమంపై నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్పొరేషన్ల పేరుతో వైసీపీ బీసీ కులాలను విడదీస్తోందని విమర్శించారు.. కార్పొరేషన్ల ద్వారా బీసీలకు స్టిక్కర్ అతికించుకోవడం తప్ప బీసీలకు ఎలాంటి న్యాయం జరగలేదన్న ఆయన.. స్టిక్కర్లు…
సీఎం జగన్కు సోము వీర్రాజు లేఖ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు మరో లేఖ రాశారు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు.. అగ్రి గోల్డ్ బాధితుల సమస్య పరిష్కారంపై తన లేఖలో పేర్కొన్నారు.. అగ్రి గోల్డు బాధితుల పరిష్కారంపై శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు.. అధికారంలోకి వచ్చిన 6 మాసాల్లో అగ్రిగోల్డు బాధితుల సమస్యలను న్యాయస్థానాల పరిధి నుండి దాటి పరిష్కరిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అయితే, అధికారం వచ్చి మూడున్నరేళ్లు దాటినా…