పవన్‌పై మంత్రి కొట్టు సంచలన వ్యాఖ్యలు.. కాపుల భావన అదే.! జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. పవన్ కాపు కులాన్ని మళ్లీ ముంచేందుకు ప్రయత్నం చేస్తున్నారని కాపు సామాజిక వర్గం భావిస్తోందన్నారు. పవన్ కల్యాణ్ అందలం ఎక్కితే బాగుంటుందని కాపు కులంలోని యువత, పెద్దలు అభిప్రాయ పడుతున్నారు… కానీ, పొత్తు నిర్ణయాలతో పార్టీని అధః పాతాళంలోకి తొక్కేసారని అంతా భావిస్తున్నారని పేర్కొన్నారు.. గోదావరి జిల్లాలలో 14 తేదీ నుంచి…
ఏపీలో ఉధృతంగా పిడుగులు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త..! ఓవైపు వర్షాలు, మరోవైపు ఎండలు, వడగాల్పులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.. అయితే, ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో ఉధృతంగా పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.. ముఖ్యంగా శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శ్రీకాకుళంలోని ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస మండలాల్లోని ప్రజలు.. మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, సాలూరు, మక్కువ, పాచిపెంట ప్రాంతాల ప్రజలు..…
విద్యార్థులకు శుభవార్త.. రేపే ఆ మొత్తం ఖాతాల్లో జమ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థులకు శుభవార్త చెప్పారు.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్న సీఎం.. రేపు జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి నగదు జమచేయనున్నారు.. అయితే, ఇప్పుటికే రెండో సార్లు సీఎం జగన్ కొవ్వూరు పర్యటన వాయిదా పడింది.. గత నెల 14న తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ‘వలంటీర్లకు వందనం’ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం రోడ్ షో,…
మంత్రి మల్లారెడ్డికి ఏపీ మంత్రి కౌంటర్.. ఇక్కడికి వచ్చి చూడండి..! తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఏపీ వచ్చి చూడాలని సూచించారు.. పోలవరం ప్రాజెక్టు గురించి, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి తెలంగాణ మంత్రులు మాట్లాడకపోవడం బెటర్ అని హితవుపలికిన ఆయన.. ఏపీలో సామాజిక న్యాయం అమలు అవుతుందన్నారు.. పోలవరం ప్రాజెక్టును అడ్డుకున్నది వారి నాయకత్వమే…
అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ జూన్ 5కి వాయిదా.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.. మరోవైపు ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు.. ఆయన ముందస్తు బెయిల్‌పై విచారణ సమయంలో హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ ఇవాళ సాధ్యం కాదని తెలిపింది తెలంగాణ హైకోర్టు.. వాదనలు…
సిట్టింగ్‌లకు సీఎం కేసీఆర్ వార్నింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్లో గురువారం బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. కాగా, ఎన్నికలపై నేతలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పని చేయాలి. లేకుంటే ఓడిపోతామని,…
తిరుమలలో హెలికాప్టర్లు చక్కర్లు తిరుమల కొండలపై హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడంతో కలకలం రేగింది.. నో ప్లై జోన్ అయిన తిరుమల కొండల మీదుగా ఓకేసారి మూడు హెలికాప్టర్లు వెళ్లడం చర్చగా మారింది.. తిరుమలలోని శ్రీవారి ఆలయానికి సమీప ప్రాంతం మీదుగా హెలికాప్టర్లు వెళ్లడాన్ని అధికారులు గుర్తించారు.. ఈ దృశ్యాలను తిరుమలలోని భక్తులు కూడా వీక్షించారు.. నో ప్లై జోన్లో.. అది కూడా ఒకేసారి మూడు హెలికాప్టర్లు వెళ్లడంపై ఆందోళన వ్యక్తం చేశారు.. అయితే, ఆ మూడు హెలికాప్టర్లు…