పదవుల్లో ఉన్నామని అహంకారంతో ఉంటే.. సాగనంపడం ఖాయం.. పదవుల్లో ఉన్నామని అహంకారంతో ఉంటే.. ఎన్నికల్లో ప్రజలు సాగనంపడం ఖాయం అని హెచ్చరించారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. జనసేన కార్యాలయంలో సత్తెనపల్లి గంగమ్మకు ఆర్ధిక సాయం అందించిన నాదెండ్ల మనోహార్.. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబుపై ధ్వజమెత్తారు.. రూ. 5 లక్షల నష్టపరిహారం చెక్ ఇవ్వకుండా మంత్రి అంబటి అడ్డుకున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి.. ఇప్పటికీ నష్టపరిహరం ఇవ్వలేదంటూ విమర్శించారు.. దీంతో, బాధితురాలు గంగమ్మకు…
సోమేష్ కుమార్ విషయంలో అనుకున్నదే జరిగిందా..? తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సోమేష్ కుమార్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేసిన విషయం విదితమే.. అయితే, సీఎస్గా ఉన్న సోమేష్ కుమార్ హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీకి వెళ్లినా.. వెంటనే వీఆర్ఎస్ తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం ఆది నుంచి జరుగుతూ వచ్చింది.. మరోవైపు.. ఈ ఏడాది చివర్లో ఆయన పదవీ కాలం ముగియనుండడంతో.. అప్పటి వరకు పదవిలో…
కొండగట్టు అంజన్న సన్నిధిలో సీఎం కేసీఆర్.. పూర్ణకుంభంతో స్వాగతం సీఎం కేసీఆర్ నేడు జగిత్యాల జిల్లాలోని కొండగట్టు పుణ్యక్షేత్రంలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన కొండగట్టుకు చేరుకున్నారు. అయితే.. 25 ఏళ్ల తరువాత తొలిసారి సీఎం హోదాలో కొండగట్టు…
ఆ మంత్రులు, ఎమ్మెల్యేలపై వైఎస్ జగన్ సీరియస్.. డెడ్ లైన్ పెట్టేశారు..! 30 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ సీరియస్ అయ్యారు. జూన్ 30లోపు పనితీరు మార్చుకోవాలని డెడ్ లైన్ విధించారు. లేదంటే ఆ నియోజకవర్గాల్లో కొత్త ఇంఛార్జ్ లను నియమించాల్సి వస్తుందంటూ సంబంధిత ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు.. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో గడప గడపకు కార్యక్రమంపై సోమవారం రోజు సీఎం వైఎస్ జగన్…
జేసీ ప్రభాకర్రెడ్డిపై అట్రాసిటీ కేసు టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై తాజాగా మరో కేసు నమోదు అయ్యింది.. ఈ సారి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు.. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు పెన్నానది సమీపంలో అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా పెన్నానది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారంటూ ఆరోపించారు జేసీ.. అయితే, ఈ క్రమంలో ఇసుక…
పార్టీ మారుతున్నారంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. ఇటీవల నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించలేదు.. సీఎం వైఎస్ జగన్ పిలిచి మాట్లాడారు ఇకపై నేను గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని తెలిపారు.. నాపై పార్టీ మారుతున్నాని ప్రచారాలు జరుగుతున్నాయి.. కానీ, నేను వైఎస్ఆర్ అభిమానిని నేను ఎప్పటికీ పార్టీ మారబోనని స్పష్టం చేశారు. ఇక, పార్టీ అంతర్గత సమావేశంలో విభేదాలపై చర్చించామని తెలిపారు ఎమ్మెల్యే…
శంషాబాద్ ఎయిర్ పోర్టు.. విమానం ల్యాండింగ్ సమయంలో గందరగోళం.. హైదరబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమాన ల్యాండింగ్ విషయంలో గందరగోళ పరస్థితి నెలకొంది. ఎయిర్ పోర్టులో ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో గమ్యం చేరుకున్నాము అనుకున్న ప్రయాణికులకు గట్టిగా షాక్ తగిలింది. క్షణాల్లో దిగే సమయంలో ఒక్కసారిగా విమానం టేకాఫ్ కావడంతో.. భయాందోళనకు గురయ్యారు ప్రయాణికులు. కాసేపు తరువాత మళ్లీ పైలట్ విమానం సేఫ్ గా లాండింగ్ చేయడంతో.. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వైజాగ్ నుండి హైదరాబాద్…
పద్మశ్రీతో నా బాధ్యత మరింత పెరిగింది… తనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చే శారు డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పద్మశ్రీ రావడం నా బాధ్యతను మరింత పెంచిందన్నారు.. ఎప్పుడూ గుర్తింపు కోసం పనిచేయలేదు, సమాజానికి నేను ఏమి ఇవ్వగలనని అని మాత్రమే ఆలోచించానని వెల్లడించారు.. నా కుటుంబాన్ని కోల్పోయినప్పుడు పేదలకు నా వంతు సాయం చేయాలని ఆలోచించాని పాత రోజులను గుర్తుచేసుకున్న ఆయన.. నా టీం…
ఏపీలో జరుగుతున్న అరాచకాలను దుర్గమ్మ చూస్తోంది విజయవాడలోని ఇంద్రకీలాద్రిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహికి పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ ప్రచార రథంపై నుంచి జనసేనాని తొలిసారి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ సుభిక్షంగా ఉండాలని.. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి ముందుండాలని అమ్మవారిని కోరుకున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఏపీలో జరుగుతున్న అరాచకాలను దుర్గమ్మ చూస్తోందని పవన్…
రేపే కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష.. ఇవి పక్కా పాటించాల్సిందే.. ఆంధ్రప్రదేశ్లో పోలీసు కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించడానికి సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఏపీఎస్ఎల్పీఆర్బీ) కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఆదివారం ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 22వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుంది. అయితే, అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచే పరీక్ష సెంటర్లోకి…