అందుకే బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం.. బరితెగిస్తాం అంటే చర్యలు తప్పవు.. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీవోపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.. విపక్షాలను కట్టడి చేయాలన్న ఉద్దేశంతోనే దురుద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు.. అయితే, ఆ జీవో వెనుక రాజకీయ ఉద్దేశాలు లేవు.. విపక్షాలే రాజకీయం చేయాలని చూస్తున్నాయని వ్యాఖ్యానించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. దానిని చీకటి…
చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి.. ప్రజల ప్రాణాలు తీస్తోంది..! టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న మరో కార్యక్రమంలోనూ ప్రాణ నష్టం జరిగింది.. గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం వైఎస్ జగన్.. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.. మరోవైపు.. గుంటూరు తొక్కిసలాట ఘటనకు సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు హోంమంత్రి తానేటి వనిత.. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న హోం…
45 నిమిషాల్లోనే అయిపోయిన శ్రీవారి టికెట్లు.. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పరితపిస్తుంటారు.. రోజులతో సంబంధం లేకుండా వేలాది మంది శ్రీవారిని దర్శించుకుంటారు.. అయితే, ప్రత్యేక రోజుల్లో మరింత రద్దీగా ఉంటాయి తిరుమల గిరులు.. ఇక, వైకుంఠ ఏకాదశి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలని భక్తులు లక్షలాదిగా తరలివస్తారు.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కూడా ఏర్పాట్లు చేస్తూ వస్తుంది.. ఇక ఈ ఏడాది వైకుంఠ…
సెక్స్ వర్కర్లలో ఏపీ టాప్.. సెక్స్ వర్కర్ల విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా గణాకాంలు ఆందోళన కలిగిస్తున్నాయి.. సెక్స్ వర్కర్లను రెండు కేటగిరీలుగా విభజించి గణాంకాలు విడుదల చేసింది కేంద్రం.. అయితే, ఓ జాబితాలో ఆంధ్రప్రదేశ్ అనూహ్యకంగా టాప్ స్పాట్కు దూసుకొచ్చింది.. ఇంకో జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది.. ఇక, ఆ జాబితాల విషానికి వస్తే.. సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను, స్థానిక సెక్స్ వర్కర్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు అంటూ.. రెండు…
రేపే వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల విడుదల తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీరోజూ వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.. ఇక, వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే.. తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతుంటాయి.. అయితే, భక్తుల రద్దీ దృష్ట్యా.. వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేకంగా టికెట్లు తీసుకొచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోటాను రేపు ఉదయం…
రేపు బాపట్లలో సీఎం జగన్ పర్యటన.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు.. వివిధ వర్గాలకు శుభవార్త చెబుతూ.. సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూనే ఉన్నారు.. ఇక, ఇప్పుడు విద్యార్థులకు శుభవార్త చెప్పారు సీఎం జగన్.. 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్లు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు.. రేపు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో పర్యటించనున్న ఆయన.. విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీని ప్రారంభిస్తారు.. ఇక, ఈ నెల 22వ తేదీ…
నాకు కుప్పంతో ప్రత్యేక అనుబంధం ఉంది.. చెన్నైలో ఆదివారం జరిగిన ‘లత్తి’ (తెలుగులో లాఠీ) చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు హీరో విశాల్.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.. తనకు అక్కడ పోటీ చేసే ఉద్దేశమే లేదని స్పష్టం చేశారు. కుప్పం ప్రాంత ప్రజలతో తనకు అనుబంధం ఉన్న సంగతి నిజమే.. కానీ, తాను అక్కడినుంచి పోటీ చేస్తానన్న వార్తల్లో మాత్రం నిజం లేదని కుండబద్దలు కొట్టారు.. అయితే, తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమేనన్నారు విశాల్.. సామాజిక…
హైదరాబాద్ వేదికగా మరో అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్ సిటీ వేదికగా ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సదస్సులు జరిగాయి.. ఇప్పుడు విశ్వనగరం వేదికగా మరో అంతర్జాతీయ సదస్సు జరగనుంది.. ఈ నెల 12వ తేదీ నుంచి నోవాటెల్ హెచ్ఐసీసీలో ది ఇండస్ ఆంత్రప్రెన్యూర్స్ (టీఐఈ) గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.. 12వ తేదీ నుంచి 3 రోజుల పాటు జరగనున్న ఈ గ్లోబల్ సమ్మిట్ను తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించబోతున్నారు.. ఇక, ఈ కార్యక్రమానికి…