స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక మలుపు.. ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న భాస్కర్, ఆయన భార్య ఐఏఎస్ అధికారి అపర్ణ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.. ఆ పిటిషన్‌పై ఇవాళ బెజవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరపనుంది.. ఇప్పటికే ఈ కేసులో భాస్కర్‌ను సీఐడీ అరెస్ట్ చేసింది.. అయితే, సీఐడీ కోర్టు రిమాండ్ తిరస్కరిస్తూ ఆదేశాలు ఇవ్వటంతో భాస్కర్…
మీ గత పాలనలో రైతుల పడ్డ గోస గుర్తు చేసుకోండి రైతుల పేరిట రాజకీయం వద్దని, నాలుగేళ్లలో కాంగ్రెస్ ఎంపీలు ఎన్ని సమస్యల మీద ఎన్ని దీక్షలు చేశారన్నారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అకాలవర్షాలకు పంటనష్టంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖపై స్పందించిన మంత్రి నిరంజన్ రెడ్డి… అకాలవర్షాల గురించి నాలుగు రోజుల ముందు నుంచే ప్రభుత్వం అప్రమత్తం చేస్తున్నదని, అకాలవర్షాలు కురిసిన 24 గంటలలోపే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల…
అకాల వర్షాలపై సీఎం జగన్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు అకాల వర్షాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి.. పంట నష్టంతో రైతులు నిండా మునిగారు.. చేతికొచ్చిన పంట వర్షార్పణం అయినట్టు అయ్యింది.. అయితే, రాష్ట్రంలో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు.. సీఎంవో అధికారులతో సమీక్ష చేపట్టిన సీఎం వైఎస్ జగన్‌కు అకాల వర్షాలు, వివిధ ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టంపై అధికారులు ప్రాథమిక సమాచారాన్ని అందించారు. పంట నష్టపరిహారంపై వెంటనే…
విద్యార్థులకు శుభవార్త.. రేపే ఖాతాల్లోకి ఆ సొమ్ము.. విద్యార్ధులకు మరోసారి శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. పేద విద్యార్ధులు ఉన్నత చదువులు చదివేందుకు ఉద్దేశించిన జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి సొమ్మును రేపు అనగా.. ఈ నెల 19న విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే సభలో బటన్ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో నగదు జమచేయనున్నారు సీఎం జగన్.. ఈ రోజే విద్యా దీవెన నిధులు విడుదల చేయాల్సి…
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మరో 1,610 పోస్టుల భర్తీ..! నిరుద్యోగులకు మరోసారి శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పటికే పలు శాఖల్లో పోస్టులు భర్తీ చేస్తుండగా.. ఇప్పుడు వైద్య శాఖలోని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో 1,610 పోస్టుల భర్తీకి సిద్ధమైంది.. ఆ శాఖలో కొత్తగా 1,610 పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్.. గ్రామీణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కల్పించడం కోసం ప్రభుత్వం ఫ్యామిలి డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టింది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం..…
పారిశ్రామిక కేంద్రంగా వైజాగ్.. ప్రభుత్వం కట్టుబడి ఉంది విశాఖపట్నం నగరాన్ని రాష్ట్ర పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అసెంబ్లీలో ప్రకటించారు రాష్ట్ర గవన్నర్ అబ్దుల్ నజీర్.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. విశాఖపట్నం కేంద్రంగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు (జీఐఎస్)లో మొత్తం రూ.13.42 లక్షల కోట్ల పెట్టుబడులకు 378 ఎంవోయూలు కుదుర్చుకున్నట్టు వెల్లడించారు.. 16 కీలక రంగాలలో 6 లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయనే నమ్మకాన్ని వ్యక్తం…
పవన్, లోకేష్‌కి మాజీ మంత్రి అనిల్ సవాల్.. ఆ ధైర్యం ఉందా.? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సవాళ్ల పర్వం కొనసాగుతోంది.. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము, ధైర్యం ఉందా అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు సీఎం వైఎస్ జగన్ బహిరంగ సవాల్ విసిరితే.. ఆ సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది.. తాజాగా, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. నారా లోకేష్, పవన్ కల్యాణ్ కి సవాల్ విసిరారు.. 2024 ఎన్నికల్లో 175 స్థానాల్లో…
నాగుపాముకు శస్త్ర చికిత్స.. పాము అంటేనే పరుగులు పెడతారు.. భయంతో వణికిపోతారు.. ఇక నాగుపాము అంటే చెప్పాల్సిన అవసరమే లేదు.. ఎక్కడ పగబడుతుందో ననే భయం వెంటాడుతుంది.. అది కొందరి వరకు మాత్రమే.. పాములను ప్రేమించేవారు ఉన్నారు.. లాలించేవారు ఉన్నారు.. ఇక వైద్య వృత్తిలో ఉన్నవాళ్లు.. గాయపడిన పాముకు కూడా వైద్యసాయం అందించి తమ వృత్తి ధర్మాన్ని చాటుతున్నారు.. తాజాగా, విశాఖపట్నంలోని గాజువాక పోలీస్ స్టేషన్లో ఓ నాగపాముకు శస్త్ర చికిత్స అందించారు పశువుల ఆస్పత్రి వైద్యుడు…
ఎస్ఐ పరీక్షల ఫలితాలు విడుదల.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 411 ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 19వ తేదీన నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది (ఏపీ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు) పోలీసు నియామకమండలి.. ఈ నెల 19న జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు 1,51,288 మంది అభ్యర్థులు హాజరు కాగా.. అందులో 57,923 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.. ఇక, అర్హత సాధించిన అభ్యర్థులు మార్చి 4వ తేదీ వరకు ఒఎమ్ఆర్…
వైసీపీలో విషాదం.. క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ కన్నుమూత.. శివరాత్రి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విషాదం నెలకొంది.. ఏపీ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్, ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు గత అర్ధరాత్రి కన్నుమూశారు.. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 2004 ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.. ఇక, 2009లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసినా…