ఎస్‌ఐ పరీక్షల ఫలితాలు విడుదల..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 411 ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 19వ తేదీన నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది (ఏపీ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు) పోలీసు నియామకమండలి.. ఈ నెల 19న జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు 1,51,288 మంది అభ్యర్థులు హాజరు కాగా.. అందులో 57,923 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.. ఇక, అర్హత సాధించిన అభ్యర్థులు మార్చి 4వ తేదీ వరకు ఒఎమ్ఆర్ షీట్లను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉన్నట్లు పోలీసు నియామక మండలి తన ప్రకటనలో పేర్కొంది.. ఈ ఫలితాలను slprb.ap.gov.inలో చెక్ చేసుకోవచ్చు. 411 పోస్టల కోసం ఈ నెల 19వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 291 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.. ఈ పరీక్షకు 1,51,288 మంది అభ్యర్థులు హాజరుకాగా.. ఇవాళ విడుదల చేసిన ఫలితాల్లో 57,923 మంది అర్హత సాధించారు.. అందులో పురుష అభ్యర్థులు 49,386 మంది ఉండగా.. మహిళా అభ్యర్థులు 8.537 మంది ఉన్నారు.. మరోవైపు.. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీపై కొన్ని అభ్యంతరాలు వచ్చినా.. వాటిని పరిశీలించిన నిపుణుల కమిటీ.. కీలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు..
బీజేపీలో అభిప్రాయ బేధాలే.. విభేదాలు లేవు..
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్‌లో విభేదాలు ఉన్నాయని తరచూ ప్రచారం సాగుతోంది.. బీజేపీ రాష్ట్ర మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా వ్యవహారం తర్వాత.. దీనిపై మరింత చర్చ సాగింది.. ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహారం నచ్చని రాష్ట్ర నేతలు.. అధిష్టానానికి ఫిర్యాదు చేశారని.. సోము వీర్రాజును పదవి నుంచి తప్పిస్తే తప్ప.. పార్టీలో కొనసాగలేమని తేల్చిచెప్పినట్టు కూడా ప్రచారం సాగుతూ వచ్చింది.. అయితే, అలాంటి పరిస్థితి లేదంటున్నారు కొందరు రాష్ట్ర బీజేపీ నేతలు.. ఈ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్.. రాష్ట్ర బీజేపీలో అభిప్రాయం బేధాలు ఉన్నాయి.. తప్పితే విభేదాలు లేవన్నారు.. బీజేపీలో వర్గ రాజకీయాలకు ఆస్కారం లేదని స్పష్టం చేసిన ఆయన.. ప్రెసిడెంట్ ప్రిసైడ్స్.. టీమ్ డిసైడ్స్ అనే విధానానికి కట్టుబడి పని చేస్తామన్నారు.. ఇక, పార్టీ నాయకులు ఎవరూ పదవులు వాడుకోవడానికి సిద్ధంగా లేరన్నారు.. అభిప్రాయ బేధాలతో పార్టీ వీడాల్సిన నాయకులు ఇప్పటికే వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్.. కాగా, కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన తర్వాత.. మరికొంత మంది నేతలు కూడా రాజీనామా చేసిన విషయం విదితమే.. ఇంకా కొంత మంది సోము వీర్రాజును మార్చాల్సిందే నంటూ డిమాండ్ చేయడంతో.. ఏపీ బీజేపీలో పొలిటికల్ హీట్ పెరిగింది.
విశాఖలో విషాదం.. స్కూల్ ప్రిన్సిపాల్ అలేఖ్య ఆత్మహత్య..! కారణం అదేనా..?
విశాఖపట్నంలో ఓ ప్లే స్కూల్ ప్రిన్సిపాల్ ఆత్మహత్య కలకలం రేపుతోంది.. సిటీ పోలీసు కమిషనర్ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మువ్వల అలేఖ్య ఆత్మహత్య చేసుకున్నారు.. ఆమె వయస్సు 29 ఏళ్లు.. ఆమె భర్త నరేష్, వారి ఇద్దరు పిల్లలు, కుటుంబ సభ్యులతో కలసి ఎంవీపీకాలనీలో నివాసం ఉంటున్నారు.. నరేష్ ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.. ప్రస్తుతం సీబీఐ విభాగంలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నట్టుగా చెబుతున్నారు.. అయితే, దంపతుల మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది.. రెండేళ్ల కిందట అలేఖ్య తన ఇద్దరు పిల్లలతో కలసి ఆరిలోవ ప్రాంతం మయూరినగర్‌కు వెళ్లిపోయింది.. అక్కడే ఓ ఇల్లు అద్దెకు తీసుకొని అందులోనే ప్లే స్కూల్ నడుపుతూ జీవనం సాగిస్తోంది.. కానీ, ఆదివారం అర్ధరాత్రి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.. ఇంట్లో ఉరిపోసుకుని బలవన్మరణం చెందింది.. ఇక, అలేఖ్య ఆత్మహత్య చేసుకున్న గదిలోకి వెళ్లి చూసి షాక్ తిన్న కూతరు.. బంధువులకు సమాచారం ఇచ్చింది.. ఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసిన ఆరిలోవ పోలీసులు. దర్యాప్తు ప్రారంభించారు.. ఈ ఘటనలో భర్త ప్రమేయంపై విచారణ సాగిస్తున్నట్టు తెలుస్తోంది.. భార్యాభర్తలు కొంత కాలంగా కలిసి ఉండకపోవడంతో.. అదే కోణంలో వారు విచారణ సాగిస్తున్నట్టుగా సమాచారం. మరోవైపు.. అలేఖ్య తన 11 ఏళ్ల వయసు గల కుమారుడిని విజయవాడలో ఓ హాస్టల్‌లో చేర్చించింది.. తొమ్మిదేళ్ల కుమార్తెతో కలసి ఆరిలోవలో ఉంటున్న ఆమె మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అలేఖ్య మృతికి భర్త వేధింపులు కారణమని ఆమె తల్లి ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు…
గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. వైఎస్సార్ రైతు భరోసా నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు.. ఇక, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.. కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అంటూ విమర్శలు గుప్పించారు.. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కరువు కచ్చితంగా వస్తుందన్న ఆయన.. గతంలో వైఎస్సార్ పాలనలో కూడా సమృద్ధిగా వర్షాలు పడేవి.. రైతులు సుభిక్షంగా ఉన్నారు.. మంచి మనసుతో పరిపాలన చేస్తే దేవుడు కూడా కరుణిస్తాడు.. ఈ సమయంలో కుప్ తో సహా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయన్నారు.. అయితే, 2014 నుండి 19 వరకు కరువు తాండవించేది అని గుర్తుచేశారు.. గడిచిన నాలుగేళ్లుగా రాష్ట్రంలో కరువు జాడ లేదన్న సీఎం.. ఒక్క మండలం కూడా కరువు మండలంగా మారలేదన్నారు. ఇక, రాష్ట్రంలో ఆహార ధాన్యాలు దిగుబడి పెరిగింది.. రికార్డ్ స్థాయిలో ధాన్యం సేకరణ చేస్తున్నాం అన్నారు సీఎం జగన్.. నాలుగేళ్లలో 2.94 కోట్ల టన్నుల ధాన్యం సేకరించామని వెల్లడించారు.. ఇప్పటి వరకు రైతు భరోసా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు కుటుంబానికి వేలు 67 వేలు అందించాం… రాష్ట్ర వ్యాప్తంగా రైతు కుటుంబాలకు 27 ,062 కోట్ల రూపాయల నిధులు జమ చేశామని తెలిపారు. మరోవైపు.. మాందుస్ తుఫాన్ తో నష్టపోయిన రైతులకు 77 కోట్ల రూపాయల నిధులు ఇచ్చామన్నారు.. గడిచిన నాలుగేళ్లలో 1,911 కోట్ల రూపాయలు ఇన్‌ఫుట్ సబ్సిడీగా నిధులు మంజూరు చేశామని.. ఆర్బీకేల ద్వారా రైతుల చేయి పట్టుకుని నడిపిస్తున్న ప్రభుత్వం మనది.. దేశంలోని అన్ని రాష్ట్రాలు మన ఆర్బీకేలను ఆదర్శం గా తీసుకున్నాయన్నారు. ఇక, 27,800 కోట్లతో రైతు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అని వెల్లడించారు ఏపీ సీఎం..
చంద్రబాబు, పవన్‌కు జగన్ ఓపెన్ ఛాలెంజ్.. ఆ దమ్ముందా..?
ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే కాకరేపుతున్నాయి.. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు బహిరంగ సవాల్ విసిరారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో పోటీ చేయాలి.. 175 స్థానాల్లో పోటీచేసి గెలిచే ధైర్యం ఉందా? అంటూ చాలెంజ్ విసిరారు.. గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించిన సీఎం జగన్.. వరుసగా నాల్గో ఏడాది రైతు భరోసా నిధులు విడుదల చేశారు. .పంట నష్టపోయిన రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ కూడా పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. రైతులను వంచించిన చంద్రబాబుకు రైతుల కోసం పని చేస్తున్న మీ బిడ్డకి మధ్య యుద్దం జరుగుతుంది.. కరువు తో ఫ్రెండ్ షిప్ చేసే చంద్రబాబుకు, వరుణిడి ఆశీస్సులు ఉన్న మీ బిడ్డ జగన్ ప్రభుత్వానికి మధ్య వార్ నడుస్తోందని వ్యాఖ్యానించారు.. గతంలో ఖజానాలో డబ్బులన్నీ జన్మభూమి కమిటీలకు, కొన్ని మీడియా సంస్థలకు, దత్త పుత్రుడిని వెళ్లేవి.. మన ప్రభుత్వం లో నేరుగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి వేస్తున్నాం అన్నారు.. ఎస్సీలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా? అనే చంద్రబాబుకు ఎస్సీలను మైనార్టీలను నా వాళ్ళు అనుకునే మీ బిడ్డ జగన్ కు యుద్ధం జరుగుతుంది.. రాబోయే ఎన్నికలలో ఏదైనా పొరపాటు జరిగింది అంటే మాట మీద నిలబడే వ్యక్తి రాజకీయాల్లో ఉండే పరిస్థితి ఉండబోదన్నారు.. మంచి చేశాం, మీకు మంచి జరిగితే నాకు తోడు ఉండండి.. మీ బిడ్డకు భయం లేదు.. మీ ఆశీస్సులు ఉన్నాయి.. చంద్రబాబుకు గానీ, దత్త పుత్రుడికి గానీ 175 ‘స్థానాలకి 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా? అని సవాల్ చేశారు.. 175 స్థానాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం ఉందా అంటూ సభా వేదికగా చాలెంజ్ విసిరారు సీఎం వైఎస్ జగన్.. దీంతో.. సభలో ఒక్కసారిగా ప్రజలు చప్పట్లు, ఈలలు, గోలతో జగన్‌కు మద్దతు తెలిపారు.. సీఎం వైఎస్ జగన్ కసితో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు విసిరిన ఆ సవాల్‌ను వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
బీజేపీ అధికార దుర్వినియోగానికి మనీష్ సిసోడియాను అరెస్టు నిదర్శనం
80 శాతం మంది ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను ఆదివారం నుంచి ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారని ఆప్ ఆరోపించింది. ఆ తర్వాత ఎక్సైజ్ పాలసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఐదు రోజుల పాటు సీబీఐ కస్టడీలోకి తీసుకున్నారు. ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు సోమవారం సిసోడియాను మార్చి 4 వరకు సీబీఐ కస్టడీకి అప్పగించింది. మనీష్ సిసోడియాను ఆదివారం విచారణకు పిలిచిన సీబీఐ.. అర్థరాత్రి అరెస్టు చేసింది. సీబీఐ కార్యాలయం దగ్గర ఆందోళన చేస్తున్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, మంత్రి గోపాల్ రాయ్ సహా దాదాపు 50 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయగా.. వారిని సోమవారం విడిచిపెట్టారు. అయితే.. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ గురించి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ.. ‘ప్రత్యర్థి పార్టీని భయపెట్టేందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఎలా దుర్వినియోగం చేస్తుందో చెప్పడానికి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడమే ఉదాహరణ. ఇది అధికార దుర్వినియోగం, ప్రజాస్వామ్యంపై దాడి. ఇటువంటి అణచివేత చర్య దేశం యొక్క అతి ముఖ్యమైన పునాదిని బలహీనపరుస్తుంది. దానిని ఆపాలి, ”అని ఆయన అన్నారు.
ఉత్కంఠ రేపిన టెస్ట్ మ్యాచ్.. చరిత్ర సృష్టించారు..
క్రికెట్ స్వరూపమే మారిపోయింది.. అసలైన ఆటగాడిని వెలికితీసే టెస్ట్‌లకు ఆదరణ తగ్గిందని.. ఆ తర్వాత వన్డే మ్యాచ్‌లకు కూడా గతంలో ఉన్న స్పందన లేదని.. ఇప్పుడంతా.. టీ-20 ఫార్మాట్ మ్యాచ్‌లదే హవా అంటున్నారు.. కానీ, కొన్ని ఘటనలు అనూహ్యంగా.. ఆ మ్యాచ్‌వైపు మళ్లేలా చేస్తుంటాయి.. అలాంటి ఉత్కంఠబరితమైన ఘటన ఇప్పుడు టెస్ట్ మ్యాచ్‌లో చోటు చేసుకుంది.. ఇదంతా ఎందకంటే.. టెస్ట్ మ్యాచ్‌లో సంచలనం నమోదైంది.. వెల్లింగ్టన్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో న్యూజిలాండ్ కేవలం ఒక్క పరుగు తేడాతో ఇంగ్లండ్‌పై సంచలన విక్టరీని కొట్టింది.. ఫాలో ఆన్‌ను అదిగమించి చరిత్ర సృష్టించింది.. వెల్లింగ్టన్‌లో ఫాలో-ఆన్ చేయవలసి వచ్చినప్పటికీ సిరీస్‌ని డ్రా చేసుకోవడానికి న్యూజిలాండ్ మంగళవారం జరిగిన రెండవ-టెస్ట్ థ్రిల్లరన్‌లో కేవలం ఒక పరుగుతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 435 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇక, ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టు 209 పరుగులకే ఆలౌటైంది. దీంతో కివీస్‌ను ఇంగ్లండ్ ఫాలోఆన్ ఆడించింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో 483 పరుగులకు ఆలౌటైంది. ఇక, దీంతో ఇంగ్లండ్ ముందు 258 పరుగుల టార్గెట్‌ను ఉంచగలిగింది.. న్యూజిలాండ్ నిర్దేశించిన 258 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 256 పరుగు దగ్గర పెవిలియన్ చేరింది.. ఈ మ్యాచ్ ఉత్కంఠబరితంగా సాగింది.. ఒకసారి మ్యాచ్ ఇంగ్లండ్‌వైపు మొగ్గితే.. మరోసారి కివీస్ చేతిలోకి వచ్చినట్టు అనిపించింది.. చిట్ట చివరకు ఒకే ఒక్క పరుగుతో ఇంగ్లండ్ ఓటమిని తన ఖాతాలో వేసుకుంది.. ఈ విక్టరీతో కివీస్ రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో డ్రా చేసి పరువు కాపాడుకుంది. ఒకే ఒక్క పరుగుతో విక్టరీ కొట్టి సంచలనం సృష్టించి.. కొత్త రికార్డునే సృష్టించారు.. న్యూజిలాండ్ కేవలం ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం సాధించింది. అతి తక్కువ మార్జిన్‌తో టెస్టు క్రికెట్‌లో విజయం సాధించిన రెండో జట్టుగా నిలిచింది న్యూజిలాండ్.. గతంలో 1993లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ ఒక్క పరుగు తేడాతో విజయాన్ని నమోదు చేసింది.. మళ్లీ ఇప్పుడు అంటే.. 30 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కివీస్ ఒక్క పరుగు తేడాతో విజయాన్ని అందుకుంది..
వివాదంలో ఇరుక్కున్న ప్రముఖ నటుడు.. మహిళ ఫోటోకు రిప్లై ఇవ్వడంతో..
మరిముత్తు తమిళ చిత్రసీమలో దర్శకుడు కావాలనే కలతో వచ్చాడు. అతను ప్రసన్న కన్నుమ్ కన్నుమ్ సినిమా సహా కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించాడు. కానీ దర్శకుడిగా పెద్దగా గుర్తింపు పొందకపోవడంతో, అతను ఇప్పుడు పూర్తి స్థాయి నటుడిగా రంగంలోకి దిగాడు. జీవా, పరియేరుమ్ పెరుమాళ్, కొంబన్ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించిన ఆయన ప్రస్తుతం సీరియల్స్‌లోనూ మాస్‌ని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా తిరుచెల్వం దర్శకత్వం వహించిన కౌంటర్-స్విమ్మింగ్ సీరియల్‌లో, అతని పాత్ర వేరే స్థాయిలో హిట్ అయ్యింది. అలా పాపులర్ నటుడిగా దూసుకుపోతున్న మరిముత్తు ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నాడు. ట్విట్టర్‌లోని ఆరాధ్యా సిన్హా అనే ఖాతా నుండి, “నేను మీకు కాల్ చేయవచ్చా” అనే క్యాప్షన్‌తో ఓ మహిళ ఫోటో పోస్ట్ చేయబడింది. దీనికి, మరిముత్తు పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతా నుండి వెంటనే సమాధానం రావడంతో నటుడి అభిమానులు షాక్ అయ్యారు. ఆ సమాధానంలో, అతను అవును అని సమాధానమిచ్చాడు. అంతేకాకుండా.. మొబైల్ నంబర్‌ను కూడా పెట్టాడు. ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే.. అది సాక్షాత్తూ నటుడు మరిముత్తు మొబైల్ నంబర్ అవడం. ట్రూ కాలర్‌లో నంబర్‌ను సెర్చ్ చేసి అది తన నంబర్ అని ధృవీకరించినందున ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారగా.. మరిముత్తు తనయుడు అఖిలన్ ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు. అది మరిముత్తు ట్విట్టర్ ఖాతా కాదని, ఆయన మొబైల్ నంబర్‌ను ఎవరో దుర్వినియోగం చేశారని తెలిపారు. అతని వివరణ తర్వాత, ఫేక్ ట్విట్టర్ ఐడీ తొలగించబడింది. దీంతో చాలా చర్చనీయాంశమైన మరిముత్తు ట్విట్టర్ పోస్ట్‌కు తెరపడింది.
‘మంగళవారం’ ఏం జరిగింది?
ఆర్ ఎక్స్ 100 సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు డెబ్యు డైరెక్టర్ అజయ్ భూపతి. ప్రమోషన్స్ లో ఈ సినిమాని అడల్ట్ కంటెంట్ లా ప్రాజెక్ట్ చేసిన అజయ్ భూపతి, థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ ని ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. ప్రేమకథలో ఇలాంటి విలన్స్ కూడా ఉంటారా అనే అనుమానం వచ్చే రేంజులో చూపించిన అజయ్ భూపతి, ఆర్ ఎక్స్ 100 హిట్ అవ్వడంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ కి మరో రామ్ గోపాల్ వర్మ అవుతాడని అందరూ అనుకుంటున్న సమయంలో అజయ్ భూపతి ‘మహా సముద్రం’ సినిమా చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇదేంటి ఇలాంటి సినిమా చేశాడు? శర్వానంద్, సిద్దార్థ్ లాంటి హీరోలని పెట్టుకోని మహా సముద్రం సినిమాని ఫ్లాప్ ఇవ్వడంతో అజయ్ భూపతి క్రెడిబిలిటీ పూర్తిగా దెబ్బతినింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎక్కువ మాట్లాడాడు, మాటలు తగ్గించి సినిమా బాగా తెరకెక్కిస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరూ సలహా ఇచ్చారు. నెగటివ్ కామెంట్స్ ఎక్కువ అవ్వడంతో అజయ్ భూపతి కాస్త గ్యాప్ తీసుకోని ‘మంగళవారం’ అనే సినిమా చేస్తున్నాడు. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఎవరు నటిస్తున్నారు అనే విషయంలో క్లారిటీ రాలేదు కానీ కాన్సెప్ట్ పోస్టర్ మాత్రం బయటకి వచ్చింది. బటర్ఫ్లై ని తలపించేలా డిజైన్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ లో ఒక అమ్మాయి నిలబడి ఉంది, ఆ అమ్మాయిని చాలా కళ్ళు చూస్తున్నాయి. ఈ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తుంటే అజయ్ భూపతి లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నట్లు ఉన్నాడనిపిస్తోంది. కాంతార సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసిన అజ్నీష్ లోకనాథ్, మంగళవారం సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి ఈ మూవీలో ఎవరు నటిస్తున్నారు? ఎలాంటి కథతో అజయ్ భూపతి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు? అనే విషయాలని సమాధానం తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.