ఎక్కువ సీట్లు ఆశిస్తున్న పవన్ కళ్యాణ్: ఏపీలో రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ-జనసేన కూటమి రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల సన్నద్ధతలో టీడీపీ-జనసేన మరింత వేగం పెంచుతోంది. త్వరలోనే సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై రెండుసార్లు భేటీ కాగా.. నేడు అమరావతిలో మరోసారి సమావేశం అయ్యారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై ఇద్దరు నేతలు కీలక చర్చలు…