వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా నిధులను విడుదల చేసిన సీఎం జగన్
పేద పిల్లల చదువును ప్రొత్సహించే క్రమంలోనే.. వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా నిధులను విడుదల చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఇవాళ వైఎస్సార్ కల్యాణమస్తు.. వైఎస్సార్ షాదీ తోఫా ఐదో విడత నిధుల్ని బటన్ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. అంతకు ముందు వర్చువల్ గా మాట్లాడుతూ.. రాష్ట్రంలో అర్హులైన 10,132 జంటలకు 78.53 కోట్ల రూపాయల సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. వధూవరులకు పదవ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరిగా చేశాం.. వధువు కనీస వయసు 18 ఏళ్లు, వరుడికి 21 ఏళ్లుగా నిర్దేశించామని చెప్పారు.. వయసు పరిమితి పెట్టడం వల్లే రాష్ట్రంలో బాల్య వివాహాలు తగ్గిపోయాయి.. దీంతో పేద పిల్లల చదువుల్ని ప్రోత్సహించినట్లు అవుతుంది అని సీఎం జగన్ వెల్లడించారు.
సొంతగూటికి మంగళగిరి సీనియర్ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి
అయితే, ఆయన వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో సీటు కోల్పోయారు. దీంతో అధికార పార్టీకి గుడ్ బై చెప్పి ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల హాయంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అంతే కాదు కాంగ్రెస్ లో చేరిన తొలి వైసీపీ ఎమ్మెల్యేగా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఇంత వరకూ అంతా బాగానే ఉంది.. కానీ, కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డికి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. అప్పటి వరకూ మంగళగిరి ఎమ్మెల్యేగా, అధికార పార్టీ నేతగా ఉన్న పలుకుబడి అంతా పోవడంతో పాటు సొంత నియోజకవర్గంలో ప్రోటోకాల్ దగ్గరి నుంచి అన్నీ వదిలి పెట్టాల్సిన పరిస్థితి ఆళ్లకు ఎదురైంది. దీంతో ఆయనతో పాటు ఉండి గెలిపించిన అనుచరులంతా ఆత్మరక్షణలో పడ్డారు. అంతే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఒత్తిడి పెంచారు. దీంతో గత రెండు రోజుల క్రితం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో చర్చించారు. ఈ చర్చల్లో తిరిగి వైసీపీలోకి వచ్చేందుకు ఆళ్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక, ఇవాళ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి సీఎం జగన్ ను ఆళ్ల రామకృష్ణారెడ్డి కలవనున్నారు. ఇక, అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీలో చేరే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికే ఆర్కే స్ధానంలో వైసీపీ ఎంపిక చేసిన బీసీ అభ్యర్ధి గంజి చిరంజీవికి నియోజకవర్గంలో అంతగా ఆదరణ లేకపోవడంతో తిరిగి మంగళగిరి ఇంఛార్జ్ ను కూడా మార్చే అవకాశం కూడా ఉంది. అదే సమయంలో ఆర్కే కూడా వైసీపీలోకి తిరిగి వస్తే జగన్ రిస్క్ ఎందుకని తిరిగి ఆయనకే టికెట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు అని వైసీపీలో అనుకుంటున్నారు.
మోడీ ఆర్ధిక ఉగ్రవాది.. కేంద్రంలో ఉన్నది క్రిమినల్ గవర్నమెంట్
విజయవాడలో నిర్వహిస్తున్న పొలిటికల్ సెమినార్ లో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. .. పవన్ కళ్యాణ్ కి ఏమీ లేకపోయినా బీజేపీతో ఉన్నాడు.. ఏపీలో ముగ్గురు నేతలు ఉత్సవ విగ్రహాలే అని ఆయన విమర్శించారు. మోడీ కలలు కంటున్నాడు.. ఆ కలలు నిజం అయ్యే అవకాశాల్లేవు.. రాజకీయ సదస్సు నిర్వహించడం సంతోషకరం.. విజయ్ మాల్యా తప్ప మిగిలిన 28 మందీ గుజరాతీలే.. కాంగ్రెస్ పార్టీది రీటైల్ కరప్షన్.. మోడీది హోల్ సేల్ కరప్షన్ అని ఎద్దేవా చేశారు.. రాజ్యాంగానికి మోడీ వల్ల ప్రమాదం పొంచి ఉందని సీపీఐ నారాయణ విమర్శలు గుప్పించారు. ఇక, ప్రధాని మోడీ నాలుగు వందల సీట్లు గెలుస్తామనడం హాస్యాస్పదం అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీ మోతలా ఉంది మోడీకి.. పాకిస్తాన్ బార్డర్ కంటే ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఢిల్లీ బార్డర్ లో అని పేర్కొన్నారు. భారత దేశ అధ్యక్షురాలికి అవామానం జరిగింది.. సీబీఐని కూడా మోడీ ఆక్యుపై చేసాడు.. ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీంకోర్టు తీర్పు అద్భుతం.. నాలుగో స్ధానంలో ఉన్న అధికారిని ఈసీగా తెచ్చిపెట్టారు.. భారతదేశంలో వ్యవస్థీకృత రాజకీయాలు ధ్వంసం చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. బీజేపీ శనక్కాయలు అమ్మినట్టు పబ్లిక్ సెక్టార్లను అమ్ముతోంది.. బలహీనమైన ప్రధాని వీపీ సింగ్.. రోజుకు నాలుగు డ్రెస్ లు మార్చే బలమైన ప్రధాని మోడీ అంటూ నారాయణ ఎద్దేవా చేశారు. ప్రపంచ సుందరుల పోటీ పెడితే ప్రథమ స్ధానం మోడీదేనంటూ సీపీఐ నారాయణ ఆరోపించారు. అమిత్ షా హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి 12 మందిని చంపి నిర్దోషి అయ్యాడు.. ఇక, ప్రధాని మోడీ ఆర్ధిక ఉగ్రవాది.. అత్యంత క్రిమినల్ గవర్నమెంట్ మన కేంద్రంలో ఉంది అని ఆయన విమర్శించారు. రాజకీయాల్లో విబేధిస్తాం.. శతృత్వం ఉండదు.. చంద్రబాబు, జగన్ ఒకేలా అనేది నా ఉద్దేశం కాదు అన్నారు. మోడీతో కలిసిన వారు కూడా మాకు శతృవులే.. ఏపీలో బలమైన పార్టీ వైసీపీ, ఎందుకు బీజేపీ ముందు మోకరిల్లుతుంది.. ఇండియా కూటమిలోకి ఎవరు వచ్చినా కలుపుకుందాం అని నారాయణ వెల్లడించారు.
గవర్నర్ ‘ఎక్స్’ ఖాతా హ్యాక్ షాకింగ్ విషయాలు.. ముంబై నుంచే..
గవర్నర్ తమిళి సై ‘ఎక్స్’ ఖాతా హ్యాక్ విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. ముంబై నుంచే గవర్నర్ తమిళి సై ‘ఎక్స్’ ఖాతా హ్యాక్ అయినట్లు గుర్తించారు. అక్కడి ఓ బొటెక్ వైఫై నెట్‌వర్క్‌ను దుండగుడు వినియోగించినట్లు అధికారులు కనుగొన్నారు. ఈ హ్యాక్ పై సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించారు. ఆ సంస్థ నిర్వాహకురాలిని ప్రశ్నించినా వివరాలు బయటకు రావడంతో షాక్ తిన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల దర్వారా అన్వేషిస్తున్నట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా బోటిక్ మూసి వేసినట్లు గమనించారు. అయితే.. గవర్నర్ ఎక్స్ అకౌంట్ ఎందుకు హ్యాక్ చేశారు? పర్యటన వివరాలు తెలుసుకునేందుకు ఇలా చేశారా? లేక ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 14న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ X ఖాతా హ్యాక్ అయినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మూడు కొత్త IP చిరునామాలు గుర్తించారు.
అన్నం పెట్టే రైతులను కేంద్రం ఆదుకోవాలి.. లేదంటే మీకే నష్టం..
గత కొద్దీ రోజులగా దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న నిరసనను కేంద్ర ప్రభుత్వం త్వరగా అర్థం చేసుకోవాలి అని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అందరికీ అన్నం పెట్టే రైతును ఆదుకోవాలని కేంద్రాన్ని ఏపీ- తెలంగాణ రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. హర్యానా, పంజాబ్ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రైతాంగం ఢిల్లీ పొలిమేరలో చేస్తున్న నిరసన ఉద్యమం ప్రశాంతంగా జరగాలి అని ఆయన కోరారు. రైతుల నిరసనలో అసాంఘిక శక్తులు చొరబడకుండా రైతులు సమయమనం పాటించాలి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ఖర్చులకు ఒకటిన్నర రెట్లు గిట్టుబాట ధర ఇవ్వాలని స్వామినాథన్ కమిషన్ రిపోర్టు అమలు పరచాలి అని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. భారత రైతాంగానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఎగుమతులు, దిగుమతులు ఉండాలి అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక, మంత్రి తుమ్మల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రైతుల నిరసనపై స్పందించారు.
మేడారం వెళ్లే ప్రయాణికులకు విజ్ఞప్తి.. సజ్జనార్ సూచనలు
తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడుపుతోందని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 51 క్యాంపులను ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి ఈ ప్రత్యేక బస్సులను మేడారానికి నడుపుతున్నాం. రెండేళ్లకో సారి జరిగే ఈ మహాజాతరలో భక్తుల రద్దీకి అనుగుణంగానే ఈ 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడపుతోంది. జాతరకు మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటోంది. భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇంత పెద్దమొత్తంలో బస్సులను మేడారం జాతరకు తిప్పుతున్నదున.. రెగ్యూలర్ సర్వీసులను తగ్గించడం జరిగింది. దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. కావున జాతర సమయంలో భక్తులకు, ఆర్టీసీ సిబ్బందికి పెద్ద మనుసుతో సహకరించాలని సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాను. జాతర పూర్తయ్యేవరకు తగు ఏర్పాట్లు చేసుకోవాలని వారిని కోరుతున్నాను. తెలంగాణకే తలమానికమైన ఈ జాతరను విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక మేడారం మహా జాతరలో 15 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని, వారికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
250శాతానికి చేరిన ద్రవ్యోల్బణం.. దివాళా అంచున దేశాల ఆర్థిక పరిస్థితి
ఊహకు అందని విధంగా ద్రవ్యోల్బణం రేటు చాలా ఎక్కువగా ఉన్న దేశాలు ప్రపంచంలో చాలాఉన్నాయి. భారతదేశంలో ద్రవ్యోల్బణం రేటు ప్రస్తుతం 5 శాతానికి పైగా ఉంది. అయితే ప్రపంచంలో చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం రేటు 250 శాతానికి చేరుకుంది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ తాజా డేటా ప్రకారం, ప్రపంచంలోని మూడు అత్యంత ఖరీదైన దేశాలలో ద్రవ్యోల్బణం స్థాయి 100 శాతం నుండి 250 శాతానికి పైగా ఉంటుంది. భారత్ పొరుగు దేశం పాకిస్థాన్ ఈ జాబితాలో టాప్ 10 ఖరీదైన దేశాలలో చేర్చబడింది. బంగ్లాదేశ్ పరిస్థితి కూడా దీని కంటే కొంచెం మెరుగ్గా ఉంది. ద్రవ్యోల్బణం పరంగా అర్జెంటీనా ప్రపంచంలోని అగ్ర దేశాలలో మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ ద్రవ్యోల్బణం రేటు 254 శాతంగా భారీ స్థాయిలో ఉంది. ఈ దేశంలో ద్రవ్యోల్బణం జనవరిలో 254.20 శాతంగా ఉండగా, డిసెంబర్ 2023లో ద్రవ్యోల్బణం రేటు 211.40 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం 192 శాతానికి చేరిన లెబనాన్ రెండో స్థానంలో ఉంది. వెనిజులా మూడవ స్థానంలో ఉంది. ఇక్కడ ద్రవ్యోల్బణం రేటు 107 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం రేటు టర్కీలో 64 శాతం కంటే ఎక్కువ. ఇరాన్‌లో 38 శాతానికి పైగా ఉంది. అధిక ద్రవ్యోల్బణం రేటు ఉన్న దేశాల జాబితాలో పాకిస్థాన్ 9వ స్థానంలో ఉంది. ఇక్కడ ద్రవ్యోల్బణం రేటు 28.3 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం అత్యధికంగా 9.86 శాతానికి చేరిన భారత్‌కు మరో పొరుగు దేశమైన బంగ్లాదేశ్ 10వ స్థానంలో ఉంది. మధ్య ఆసియాలో ఉన్న కజకిస్తాన్, ఈ జాబితాలో 11వ స్థానంలో ఉంది. ఇక్కడ ద్రవ్యోల్బణం రేటు 9.5 శాతంగా ఉంది. అధిక ద్రవ్యోల్బణం రేటు ఉన్న దేశాల జాబితాలో భారతదేశం 17వ స్థానంలో ఉంది. ఇక్కడ ద్రవ్యోల్బణం రేటు 5.1 శాతంగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం, టోకు ద్రవ్యోల్బణం ఇటీవలి డేటాలో గణాంకాలు వరుసగా 5.10 శాతం, 0.27 శాతంగా ఉన్నాయి. ఈ 60 దేశాల జాబితాలో, ద్రవ్యోల్బణం రేటు మైనస్ కంటే తక్కువగా ఉన్న దేశాలు చైనా, థాయ్‌లాండ్. 59వ స్థానంలో ఉన్న చైనాలో ద్రవ్యోల్బణం -0.8 శాతం, థాయ్‌లాండ్‌లో -1.11 శాతంగా ఉంది.
భూటాన్ సరిహద్దులో 235 ఇళ్లను నిర్మించనున్న చైనా
చైనా కుట్రలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు పక్క దేశాలపై వ్యూహాలు పన్నుతోనే ఉంటుంది. తన పొరుగు దేశాలపై నిరంతరం కన్ను వేస్తూనే ఉంది. ఈసారి డ్రాగన్ వలలో చిక్కుకున్న పొరుగు దేశం పేరు భూటాన్. అవును, భూటాన్ సరిహద్దులో చైనా గ్రామాలను నిర్మిస్తోంది. ఆ దేశం ఇక్కడ 200లకు పైగా ఇళ్లను నిర్మించారు. పేదరిక నిర్మూలన కార్యక్రమం పేరుతో చైనా దీన్ని విస్తరిస్తోంది. శాటిలైట్ చిత్రాల ద్వారా చైనా ఈ కుట్ర బయటపడింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వార్తల ప్రకారం.. భూటాన్ సరిహద్దులో చైనా క్రమంగా విస్తరిస్తోంది. భూటాన్ సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతంలోని ఓ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఈ గ్రామాల్లో టిబెట్‌కు చెందిన వారు స్థిరపడుతున్నారు. 18 మంది టిబెటన్ ప్రజలు 28 డిసెంబర్ 2023న పునరావాసం పొందారు. ఇంతకుముందు 235 మందిని మాత్రమే సెటిల్ చేసే యోచనలో ఉన్నారు. 235 మంది స్థిరపడాల్సిన చోట ఇప్పటికే 70 ఇళ్లలో 200 మంది నివసిస్తున్నారు. పేదరిక నిర్మూలన కార్యక్రమం కింద చైనా గ్రామాలు, ఇళ్లను నిర్మించడం ప్రారంభించింది. దీని తరువాత చైనా కుట్రలో భాగంగా క్రమంగా దానిని జాతీయ భద్రతలో భాగం చేసింది. మాక్సర్ టెక్నాలజీ ఉపగ్రహ చిత్రాలు మూడు గ్రామాలను వెల్లడించాయి. గ్యాల్‌ఫుగ్, తమ్‌లుంగ్ రెండింటిలోనూ చైనా అదే ప్రణాళికతో పనిచేస్తోంది. తమ్‌లుంగ్‌లోని గ్యాల్‌ఫుగ్‌లోని గ్రామాన్ని చైనా వేగంగా అభివృద్ధి చేస్తోంది. 2007లో గ్యాల్‌ఫుగ్‌లో రెండు ఇళ్లు ఉండగా 2016-18 నాటికి వందలాది ఇళ్లు నిర్మించబడ్డాయి. వేగవంతమైన విస్తరణ పేదరిక నిర్మూలన ప్రణాళికగా ప్రారంభమైంది. అయితే ఇది ద్వంద్వ జాతీయ భద్రతా పాత్రను పోషిస్తుందని పాలక చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అధికారులను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. రెండు దేశాలను విడదీసే పర్వత ప్రాంతంలో కనీసం మూడు గ్రామాలను నిర్మించినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఆదివారం నివేదించింది.
ఎందుకు జట్టు నుంచి తప్పించారో ధోనీని అడగాలనుకున్నా.. కోహ్లీ, రోహిత్‌లా హీరో అయ్యేవాడిని!
టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. మిగతా వారితో పోల్చితే.. భారత జట్టులో తనకు తగినన్ని అవకాశాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. సెంచరీ చేసినా తర్వాతి మ్యాచ్‌లోనే తనను ఎందుకు తొలగించారని అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనీని అడగాలనుకున్నా అని మనోజ్ తివారి తెలిపాడు. తనకు అవకాశాలు లభిస్తే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మాదిరి హీరో అయ్యేవాడిని (ఉన్నత శిఖరాలు) అని చెప్పుకొచ్చాడు. రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో భాగంగా బిహార్‌తో మ్యాచ్ అనంతరం 19 ఏళ్ల ఫస్ట్‌క్లాస్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు మనోజ్ తివారి తెలిపాడు. మంగళవారం కోల్‌కతా స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ క్లబ్‌లో మనోజ్ తివారికి సన్మానం జరిగింది. ఈ సందర్భంగా తివారీ విలేకరులతో మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించాడు. ‘2011లో సెంచరీ చేశాను. తర్వాతి మ్యాచ్‌లోనే నన్ను తుది జట్టు నుంచి తప్పించారు. నాపై ఎందుకు వేటు వేశారని ఎంఎస్ ధోనీని అడగాలనుకున్నా. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలా రాణించగల సత్తా నాకుంది. కానీ నాకు అవకాశాలు రాలేదు. ఈరోజుల్లో యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. యువకులకు అవకాశాలు రావడం చూసినప్పుడు నా విషయంలో బాధగా అనిపిస్తుంది’ అని మనోజ్ తివారి చెప్పాడు. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలోనే మనోజ్ తివారి అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2008-2015 మధ్య టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన అతడు 12 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. వన్డే ఫార్మాట్‌లో 287, టీ20 ఫార్మాట్‌లో 15 పరుగులు చేశాడు. 2011లో వెస్టిండీస్‌పై చెన్నైలో ఏకైక సెంచరీ చేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 148 మ్యాచ్‌లు ఆడిన తివారి.. 10195 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 45 అర్ధ శతకాలు ఉన్నాయి. లిస్ట్-ఏ క్రికెట్‌లో 169 మ్యాచ్‌లలో 5581 రన్స్ చేశాడు. ఇందులో 6 సెంచరీలు , 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
రవితేజ డైరక్టర్ తో సందీప్ కిషన్ కొత్త సినిమా?
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఖాతాలో హిట్ సినిమాలు పెద్దగా లేవని తెలిసిందే.. సరైన హిట్ పడి చాలా కాలం అయ్యింది. వరస పెట్టి ప్రయోగాలు లాంటి సినిమాలు డిఫరెంట్ కాన్సెప్టు లతో చేస్తున్నా కలిసి రావటం లేదు.. అయినా సందీప్ అదే ప్రయోగాలు చేస్తున్నారు.. తాజాగా సందీప్ కిషన్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊరు పేరు భైరవకోన. ఈ చిత్రం ఫిబ్రవరి 16న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయ్యింది. సూపర్ నేచురల్, ఫాంటసీ ఎలిమెంట్స్ తో పాటు హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ఉన్న ఈ సినిమా మంచి టాక్ ను అందుకుంది.. ఈ సినిమా మంచి కలెక్షన్స్ ను అందుకుంది.. దాంతో సందీప్ కిషన్ అదే బ్యానర్ లో మరో సినిమా చెయ్యనున్నట్లు తెలుస్తుంది.. రవితేజ కెరీర్ లో రీసెంట్ గా సూపర్ హిట్ గా నిలిచిన థమాకా దర్శకుడు నక్కిన త్రినాధరావు ఈ చిత్రానికి దర్శకుడు అని తెలుస్తోంది. ఓ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రెడీ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ , హస్య మూవీస్ పతాకం పై రాజేష్ దండా కలిసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం ఈ సినిమా కథను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్.. ఫైనల్ అయితే త్వరలో ఎనౌన్సమెంట్ వస్తుందని అంటున్నారు.. కొత్త డైరెక్టర్లు, ప్లాపుల్లో ఉన్న దర్శకులు మాత్రమే సందీప్ కిషన్ తో సినిమా చేస్తూ వస్తున్నారు. ఈ ప్రాజెక్టు సెట్ అయితే కనుక సందీప్ కిషన్ కమర్షియల్ జానర్ లో సినిమా అవుతుందని, మళ్లీ సందీప్ కిషన్ ఫామ్ లోకి వస్తాడని వినిపిస్తోంది. వెంకటాద్రి ఎక్సప్రెస్ సినిమా తరహాలో ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది.. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారక ప్రకటన రాబోతుందని తెలుస్తుంది..