సీఎం వైఎస్ జగన్ రేపు విజయవాడలో పర్యటించనున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రేపు ఉదయం 10.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకుంటారు. అజాద్ జయంతి సందర్భంగా మైనారిటీస్ వెల్పేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలలో పాల్గొననున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు మరోసారి వాయిదా పడింది. రేపు (శుక్రవారం) ఉదయం గం.10.30 సమయానికి ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించనుంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును విచారించేందుకు కస్టడీకి అనుమతించాలని ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రోజు సాయంత్రమే దీనిపై తీర్పు వస్తుందని అంతా భావించారు. మొదట ఈ కేసు తీర్పును 10 నిమిషాలు వాయిదా వేసిన న్యాయమూర్తి.. ఆ తరువాత రేపు తీర్పు వెల్లడిస్తానని తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై రేపు పార్లమెంటులో చర్చ జరగనుంది. చర్చను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి.
మణిపూర్ అంశంపై మాట్లాడటానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విపక్ష ఎంపీలకు సమయమిచ్చారు. రేపు ఉదయం 11.30 గంటలకు ఇండియా ఎంపీలకు రాష్ట్రపతి సమయం కేటాయించారు.
తెలంగాణ వ్యాప్తంగా గత ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఐదు రోజుల నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పనుల మీద బయటకు వెళ్లేవారు నానా అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. అయితే వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడం.. చాలా వరకు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉండటంతో రేపు (శనివారం) కూడా…
ఉద్యోగులు, కార్మికులకు సంబంధించిన హయ్యర్ పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి రేపటితో గడువు ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
బండి సంజయ్ ఐదో విడుత ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా పడిందని కరీంనగర్ ఎంపీ బీజేపీ ప్రజా సంగ్రామ పాదయాత్ర ఇన్ చార్జి మనోహర్ రెడ్డి తెలిపారు. బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభ సభ రేపు ఉంటుందని స్పష్టం చేశారు.
హైదరాబాద్ లో రేపు (5)న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. నిన్న (ఆదివారం) వివిధ శాఖల అధికారులతో కలిసి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. రేపు (5)న కల్యాణం.. ఎల్లుండి (6)న రథోత్సవం జరగనుంది. ఈనేపథ్యంలో.. మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అమ్మవారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మూడు రోజుల పాటు ఎల్లమ్మ కల్యాణ వేడుకలు జరుగుతాయని పేర్కొన్నారు. అమ్మవారి కల్యాణానికి హాజరయ్యే భక్తులకు…
రేపట్నుంచి ఏపీలో కర్ఫ్యూ సడలింపు వేళల్లో మార్పులు చోటుచేసుకొనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు వర్తించనున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు కానుంది. ఈ నెల 30వ తేదీ వరకు మారిన సడలింపు నిబంధనలు అమలు కానున్నాయి. దీంతో రేపట్నుంచి యధావిధిగా ప్రభుత్వ కార్యాలయాలు పని చేయనున్నాయి. ఉదయం 09:30 గంటల నుంచి పని చేయనున్నాయి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు.…
రేపట్నుంచి ఏపీలో కర్ఫ్యూ సడలింపు వేళల్లో మార్పులు చోటుచేసుకొనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు వర్తించనున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు కానుంది. ఈ నెల 30వ తేదీ వరకు మారిన సడలింపు నిబంధనలు అమలు కానున్నాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. కాగా ఏపీలో కొత్తగా 5674 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో…