రేపట్నుంచి ఏపీలో కర్ఫ్యూ సడలింపు వేళల్లో మార్పులు చోటుచేసుకొనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు వర్తించనున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు కానుంది. ఈ నెల 30వ తేదీ వరకు మారిన సడలింపు నిబంధనలు అమలు కానున్నాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. కాగా ఏపీలో కొత్తగా 5674 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,42,022 కు చేరింది. ఇందులో 17,64,509 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 65,244 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 45 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 12,269 మంది మృతి చెందారు.