Higher Pension: హయ్యర్ పింఛన్ దరఖాస్తుకు రేపటితో గడువు ముగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Higher Pension: ఉద్యోగులు, కార్మికులకు సంబంధించిన హయ్యర్ పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి రేపటితో గడువు ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈపీఎఫ్‌వోపరిధిలోకి వచ్చే ఉద్యోగులకు, కార్మికులకు అధిక పింఛన్ దరఖాస్తులకు మరొక రోజు మాత్రమే మిగిలి ఉన్నది. ఇప్పటికే మూడుసార్లు పొండిగించిన తుది గడువు రేపటితో ముగియనుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా అధిక పింఛన్‌కు కోసం 18 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా అప్లయ్ చేసుకోనివారు ఇవ్వాళ, రేపు రెండు రోజుల్లో దరఖాస్తులను పూర్తిచేయాలని అధికారులు సూచించారు. 2014 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు సర్వీసులో చేరి.. గరిష్ఠ వేతన పరిమితికి మించి వేతనం పొందుతూ ఆ మేరకు చందా చెల్లిస్తున్న ఉద్యోగుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఈపీఎఫ్‌వో స్వీకరిస్తున్న విషయం తెలిసిందే.
Read also: Metro Jobs: బీటెక్ స్టూడెంట్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. మెట్రోలో ఉద్యోగాలు..
Also Read
అధిక పెన్షన్ గడువు జూన్ 26తో ముగియాల్సి ఉన్నది. అయితే ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో జూలై 11 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అంతకు ముందు మార్చి 3 నుంచి మే 3 వరకు, ఆ తరువాత జూన్ 26 వరకు తుది గడువును పొడిగించుకుంటూ వచ్చింది. వివిధ నిబంధనలపై స్పష్టత లేకపోవడం, ఈపీఎఫ్‌వో వివరణలు జాప్యంకావడం వంటి కారణాలతో ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ నుంచి వచ్చే అధిక పెన్షన్ కోసం మెజారిటీ ఉద్యోగులు ఇంకా దరఖాస్తులు సమర్పించలేదు. 2014 సెప్టెంబర్ 1 కంటే ముందు నుంచే ఈపీఎఫ్, ఈపీఎస్‌లలో సభ్యులుగా కొనసాగుతున్నవారు అధిక పెన్షన్ పొందేందుకు అర్హులు. అలాగే 2014 సెప్టెంబర్ 1 కంటే ముందు రిటైరైన ఉద్యోగులు అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుని, వాటిని ఈపీఎఫ్‌వో అధికారులు తిరస్కరించి ఉంటే వారు కూడా అర్హులే.
అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేవారు యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), పెన్షనర్లకు సంబంధించి పెన్షన్ చెల్లింపు ఆర్డర్ (PPO), వేతన పరిమితి కంటే ఎక్కువగా ఈపీఎఫ్ ఖాతాకు చెల్లించినట్లుగా రుజువు పత్రాలు చూపించాల్సి ఉంటుంది.
Read also: Fire in Balanagar: బాలానగర్ లో భారీ అగ్నిప్రమాదం.. లైఫ్ స్పేస్ అపార్ట్‌మెంట్‌లో మంటలు
అధిక పెన్షన్ అర్హత గల ఉద్యోగుల పెన్షన్ అర్హత వేతనంపై వారం క్రితం ఈపీఎఫ్‌ఓ క్లారిటీ ఇచ్చింది. దీని ప్రకారం 2014 సెప్టెంబర్ కంటే ముందు రిటైరైన వ్యక్తికి చివరి 12 నెలల వేతన సగటును పెన్షన్ అర్హమైన వేతనం గానూ, తర్వాత రిటైరైతే ఐదేండ్ల వేతన సగటును ప్రామాణికంగా తీసుకుంటామని తెలిపింది. ఇప్పుడు పెన్షన్ అర్హత వేతనం x సర్వీస్ కాలం / 70గా పెన్షన్ లెక్క గడుతున్నారు. గరిష్ట వేతన పరిమితి దాటి అధిక పెన్షన్‌కు అర్హత పొందే వారికి స్పెషల్ ఫార్ములా అమలు చేయాలన్న అభిప్రాయం కూడా ఉంది. అధిక పెన్షన్‌కు ఉమ్మడి ఆప్షన్ తీసుకున్నప్పుడే తాము నిర్ణయించే పెన్షన్ లెక్కింపు సూత్రానికి కట్టుబడి ఉండాలని ఈపీఎఫ్‌ఓ షరతు విధించింది. దాని ఆధారంగానే దరఖాస్తులు స్వీకరించింది. ఈ నేపధ్యంలో రేపటితో దరఖాస్తు గడువు ముగియనుండటంతో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా దరఖాస్తు గడువు పొడిగించిన నేపథ్యంలో మరోసారి పొడిగించే అవకాశం ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!