Balkampet Yellamma Temple: నేటి నుంచి బల్కం అమ్మవారి కల్యాణ మహోత్సవాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో రేపు (5)న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. నిన్న (ఆదివారం) వివిధ శాఖల అధికారులతో కలిసి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. రేపు (5)న కల్యాణం.. ఎల్లుండి (6)న రథోత్సవం జరగనుంది. ఈనేపథ్యంలో.. మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అమ్మవారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మూడు రోజుల పాటు ఎల్లమ్మ కల్యాణ వేడుకలు జరుగుతాయని పేర్కొన్నారు. అమ్మవారి కల్యాణానికి హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.
read also: Pawan Kalyan: ప్రధాని మోదీ పర్యటనకు పవన్ కళ్యాణ్ దూరం
Also Read
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
ఎల్లమ్మ కల్యాణాన్ని తిలకించేందుకు ఎల్‌ఈడీ స్ర్కీన్‌లను ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అమ్మవారి కల్యాణాన్ని చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కాగా.. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో వ్యర్థాలను తొలగించేందుకు ప్రత్యేక కవర్లు అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎల్లమ్మ అమ్మవారి కల్యాణానికి జోనల్ కమిషనర్ రవికిరణ్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, జిల్లా వైద్యాధికారి వెంకటి, వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్, జీఎం హరిశంకర్, ఐఅండ్‌పీఆర్ సీఐఈవో రాధాకృష్ణ, సీఐ సైదులు, ఈవో అన్నపూర్ణ, చైర్మన్ సాయిబాబాగౌడ్, ధర్మకర్తలు పాల్గొననున్నారని తెలిపారు.
ఎల్లమ్మ ఆలయాన్ని విద్యుత్తు కాంతులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులు క్యూలైన్ల కోసం బారికేడ్లను ఏర్పాటు చేశారు. బందోబస్తు నిమిత్తం 500 మంది సిబ్బందిని కేటాయించినట్లు చెప్పారు. కాగా.. అమీర్‌పేట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రూ.5 లక్షలు వెచ్చించి ప్రత్యేకంగా తయారు చేయించారు.
Talasani Srinivas: లా అండ్ ఆర్డర్ లేకపోతే.. మీ వాళ్ళు తిరిగే వాళ్ళా?
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!