కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా రేపు (శుక్రవారం) విజయవాడ, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీ నుండి విజయవాడ చేరుకుని.. రాత్రికి విజయవాడలో బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం 9.15 కు విజయవాడలో పాత ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్, BSL-3 ల్యాబ్ నిర్మాణానికి కేంద్రమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ కొత్తగా నిర్మించిన IPHL ల్యాబ్స్ ను ప్రారంభించనున్నారు.
Read Also: Pendem Dora Babu: సీఎం వీడియో కాన్ఫరెన్స్కు దూరంగా పిఠాపురం ఎమ్మెల్యే
అనంతరం అక్కడి నుండి బయల్దేరి గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామంలో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను మన్సుఖ్ మాండవియా సందర్శించనున్నారు. అక్కడ అమలవుతున్న ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని పరిశీలించనున్నారు. తరువాత జరిగే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం అక్కడి నుండి బయల్దేరి మంగళగిరి ఏపీఐఐసీ భవన సముదాయాన్ని చేరుకుంటారు. రాష్ట్రంలో అమలవుతున్న PM-ABHIM & NHM మౌలికవసతుల కార్యక్రమం NHA CARD ఏర్పాటు కార్యక్రమాలపై అధికారులతో చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.15 గంటలకు మంగళగిరి ఎయిమ్స్ అధికారులు, సిబ్బందితో భేటీ కానున్నారు. రేపు సాయంత్రం 5.15కు ఆయన తాడేపల్లిలో సీఎం జగన్ తో భేటీ కానున్నారు.
Read Also: Pendem Dora Babu: సీఎం వీడియో కాన్ఫరెన్స్కు దూరంగా పిఠాపురం ఎమ్మెల్యే