రేపు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. అందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. అందుకోసం.. ఉదయం 8.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరుతారు. రిపబ్లిక్ డే వేడుకలలో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో కలిసి సీఎం పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుంచి తాడేపల్లికి తిరుగు పయనం కానున్నారు. సాయంత్రం 4.15 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆథిద్యం ఇచ్చే హై టీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు.
Read Also: CM Jagan: గిరిజన ప్రాంత వాసులకు గుడ్ న్యూస్.. 300 సెల్ టవర్స్ ప్రారంభం
ఇదిలా ఉంటే.. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉ.8 గం.లకు ఏపీ అసెంబ్లీ భవనం ప్రాంగణంలో శాసన మండలి అధ్యక్షుడు కె.మోషేన్ రాజు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఉ.8.15 గం.లకు రాష్ట్ర అసెంబ్లీ భవనం వద్ద అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.