భారతదేశంలోని ఎలక్ట్రిక్ బైక్ ప్రియులకు శుభవార్త..! ఓలా ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ X ఎలక్ట్రిక్ బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ బైక్ టీజర్‌ను ఓలా తాజాగా విడుదల చేసింది. అధికారిక లాంచ్ రేపు (ఫిబ్రవరి 5, 2025)న జరగనుంది. అయితే.. ఈ ఎలక్ట్రిక్ బైక్ కు సంబంధించిన ప్రత్యేక ఫీచర్లపై ఓ నజర్ వేసేద్దాం.
Read Also: NBK 111: గోపీచంద్ తోనే బాలకృష్ణ నెక్స్ట్.. అంతా సెట్!
ఓలా రోడ్‌స్టర్ X:
భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల తన జెన్ 3 స్కూటర్ శ్రేణిని విడుదల చేసింది. ఆ సమయంలో రోడ్‌స్టర్ X టీజర్ కూడా విడుదలయ్యింది. ఇది ఓలా ఎలక్ట్రిక్ బైక్ విభాగంలో తమ దూకుడును చూపించబోతున్నదని సూచిస్తుంది. గత సంవత్సరం ఓలా ఎలక్ట్రిక్.. భారతదేశంలోని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో కొంత నష్టాన్ని చవిచూసింది. అయితే.. రోడ్‌స్టర్ Xతో కంపెనీ మళ్ళీ దాని మార్కెట్ వాటాను పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది.
ఓలా రోడ్‌స్టర్ X ధర:
గ్లోబల్ లాంచ్ సమయంలో ఓలా మూడు బ్యాటరీ ఎంపికలతో ఈ బైక్‌ను ఆవిష్కరించింది:
2.5 kWh బ్యాటరీ – ₹74,999
3.5 kWh బ్యాటరీ – ₹84,999
4.5 kWh బ్యాటరీ – ₹99,999
అయితే.. ఫిబ్రవరి 5న పూర్తి ధరలు ప్రకటించనున్నారు. గతంలో ఓలా S1X Gen 3 స్కూటర్ ₹79,999 ప్రారంభ ధరతో విడుదలైంది. కాబట్టి రోడ్‌స్టర్ X ధరలో కొంత మార్పు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
ఓలా రోడ్‌స్టర్ X శక్తివంతమైన లక్షణాలు:
శక్తి: 11 kW (14.75 bhp) శక్తి
గరిష్ట వేగం: 124 km/h
0-40 km/h వేగం: కేవలం 2.8 సెకన్లలో
డిజైన్: ఫ్యూచరిస్టిక్ డిజైన్, LED హెడ్‌లైట్లు
ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్: 4.3 అంగుళాల LCD డిజిటల్ డిస్ప్లే
వీల్ సైజు: 18 అంగుళాల అల్లాయ్ వీల్స్
బ్రేకింగ్: ఫ్రంట్ డిస్క్ బ్రేక్, RSU టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్
ఈ ఎలక్ట్రిక్ బైక్, ప్రత్యేకంగా యువ రైడర్లను ఆకర్షించడానికి రూపొందించారు.