మాస్ మహరాజా కెరీర్ లో సెకండ్ ఫేజ్ షురూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహరాజా రవితేజ కెరీర్ లో సెకండ్ ఫేజ్ జూలై 1న మొదలైంది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం చిత్రసీమలోకి అడుగుపెట్టి అంచలంచెలుగా ఈ స్థాయికి ఎదిగాడు రవితేజ. కెరీర్ ప్రారంభంలో దర్శకత్వ శాఖలోనూ పనిచేసిన రవితేజ, చిన్న చిన్న పాత్రలు కొన్ని చేసి ‘సిందూరం’ మూవీతో హీరో అయ్యాడు. ఆ తర్వాత రెండేళ్ళకు ‘నీ కోసం’తో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దానికి ముందు నటుడిగా స్థిరపడటం కోసం రవితేజ గట్టి పోరాటమే చేశాడు. అయితే సహాయ దర్శకుడిగా అతనికి ఉన్న పరిచయాలు నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి కొంత మేర దోహదం చేశాయి. ‘ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం’తో సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్న తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్స్ రవితేజా ఖాతాలో పడ్డాయి.
read also : సినిమాలు తగ్గినా… సెగ తగ్గని హాట్ సీనియర్ బ్యూటీ!
Also Read
కెరీర్ ప్రారంభంలో దర్శకత్వ శాఖలో పనిచేసిన రవితేజ… హీరోగా ఎన్ని సూపర్ హిట్స్ అందుకున్నా… మెగా ఫోన్ మాత్రం పట్టుకునే ప్రయత్నం చేయలేదు. నటుడిగానే ఉండిపోయాడు. అలానే చెన్నయ్ లోని తన రూమ్మేట్స్, ఇప్పటి పాపులర్ డైరెక్టర్స్ గుణశేఖర్, వైవియస్ చౌదరి… నిర్మాతలుగా మారినా రవితేజ చిత్ర నిర్మాణం వైపు కూడా అడుగుపెట్టలేదు. తనతోటి హీరోలు చాలామంది నిర్మాతలు అయినా ఆ ఛాయలకు కూడా రవితేజ పోలేదు. చూస్తుండగానే సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు రవితేజ తన 68వ సినిమాలో నటిస్తున్నాడు. ఉన్నట్టుండి ఇప్పుడీ మాస్ మహరాజా మనసు మార్చుకున్నాడు. చిత్ర నిర్మాణానికీ సై అన్నాడు.

కొన్ని నెలలుగా రవితేజ నిర్మాతగా మారబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎవరితో సినిమా తీస్తాడు? ఏ దర్శకుడితో సినిమా నిర్మిస్తాడు? అనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. జూలై 1 గురువారం శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలైన సందర్భంలో సుధాకర్ చెరుకూరితో పాటు ఈ సినిమా నిర్మాణంలో రవితేజ సైతం భాగస్వామి కాబోతున్నాడనేది తెలిసింది. ఆర్. టి. టీమ్ వర్క్స్ పేరుతో రవితేజ సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించాడు.
ఒకసారి రంగంలోకి దిగిన తర్వాత ఇక నిర్మాతగానూ విజృంభిస్తాడనే అందరూ అంటున్నారు. ఇది డిజిటల్ యుగం కాబట్టి ఓటీటీ చిత్రాలను, వెబ్ సీరిస్ లను రవితేజ నిర్మించే ఆస్కారం లేకపోలేదు. అదే సమయంలో రవితేజ తనయుడు మహాధన్ సైతం ఆ మధ్య ‘రాజా ది గ్రేట్’లో సూపర్ క్యారెక్టర్ చేసి మెప్పించాడు. అతను రాబోయే రోజుల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చినా… రవితేజకు సొంత బ్యానర్ ఉండటం అనేది ఉపయోగపడుతుంది. సో… రవితేజ చాలా ముందు చూపుతోనే ఆర్. టి. టీమ్ వర్క్స్ ను ప్రారంభించాడని సన్నిహితులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్టెల్లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
-
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్ను దాటగలదా!
-
Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..