ఆనంద్ దేవరకొండ నటించిన చిత్రం ‘పుష్పక విమానం’. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు చక్కని ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ కోసం మంచి డిమాండ్ ఏర్పడిందని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని తెలిపారు. బాలీవుడ్ నుంచి మూడు ప్రముఖ నిర్మాణ సంస్థలు తమ సినిమా రీమేక్ హక్కుల కోసం పోటీ పడుతున్నాయని అన్నారు. కొత్త తరహా కథలో కామెడీ, మిస్టరీ కలిసి ఉండటం ఈ మూవీని యూనిక్ గా మార్చాయని, సినిమాలోని ఈ క్వాలిటీనే బాలీవుడ్ మేకర్స్ ను రీమేక్ కు పోటీ పడేలా చేస్తున్నాయని అనురాగ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం థియేటర్లలో స్టడీ కలెక్షన్స్ సాధిస్తూ సూపర్ హిట్ దిశగా ‘పుష్పక విమానం’ దూసుకెళుతోందని అన్నారు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారని, బాలీవుడ్ నుండి వస్తున్న రీమేక్ ఆఫర్స్ గురించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియచేస్తామని అనురాగ్ చెప్పారు.