టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం, బాలీవుడ్ లో పాగా వేయడానికి గట్టిగా కష్టపడుతున్న సంగతి తెలిసిందే.. ఇటీవల ‘దేదే ప్యార్ దే’ హిట్ అందుకున్న అమ్మడు మరోసారి హిట్ కొట్టాలని చూస్తోంది. మునుపెన్నడూ చేయని ఒక కొత్త పాత్రలో రకుల్ కనిపించనుంది. తేజస్ ప్రభ విజయ్ దేవస్కర్ దర్శకత్వంలో ‘ఛత్రివాలి’ అనే చిత్రంలో రకుల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రకుల్ కండోమ్ టెస్టర్ గా కనిపించనుంది.
శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ నిరకుల్ రివీల్ చేసింది. “వాతావరణ సూచనలు లేకుండా వర్షం ఎప్పుడైనా కురుస్తుంది.. మీ గొడుగును ఎప్పుడూ సిద్థంగా ఉంచుకోండి” అంటూ కండోమ్ ని ఓపెన్ చేస్తున్నట్లు ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ ప్రాజెక్ట్ కోసం తాను చాలా ఎక్సైటింగ్ ఉందంటూ చెప్పుకొచ్చింది ముద్దుగుమ్మ. మరి ఈ సినిమాతో రకుల్ బాలీవుడ్ లో మరో హిట్ ని అందుకుంటుందేమో చూడాలి.