హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై సాయి రోనక్, నేహా సోలంకీ జంటగా నటించిన ఛలో ప్రేమిద్దాం సినిమా ఈనెల 19 వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు. తమ బేనర్‌లో వస్తున్న మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నట్టు నిర్మాత ఉదయ్ కిరణ్ పేర్కొన్నారు. ఈనెల 19 వ తేదీన ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఎక్కడా రాజీపడకుండా సినిమాను తెరకెక్కించడంలో నిర్మాత పూర్తిగా సహకరించారని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని దర్శకుడు సురేష్ శేఖర్ తెలిపారు. ట్రైలర్‌కు, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోందని, సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని దర్శకుడు సురేష్ శేఖర్ తెలిపారు. సినిమాకు అన్నీ బాగా కుదిరాయని, ఇది లవ్ అండ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని, ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని దర్శకుడు తెలిపారు. సరదాగా జాలీగా ఉండే అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడిన తరువాత వారి ప్రేమ ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నది. ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి, వాటిని ఎలా ఎదుర్కొని నిలబడ్డారు అనే అంశాలను ట్రైలర్‌లో చూపించారు.