బుల్లితెర కామెడీ షో ‘జబర్దస్త్’తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి ఫేమ్ సంపాదించుకున్నారు చాలా మంది ఆర్టిస్టులు. ఎంతో మందికి మంచి గుర్తింపును తీసుకువచ్చిన ఈ షో ద్వారా పాపులర్ అయిన ఆర్టిస్టుల్లో హైపర్ ఆది కూడా ఒకరు. షోతో పాటు హైపర్ ఆది క్రేజ్ కూడా పెరుగుతూ వచ్చింది. ఆయన వేసే పంచులు, కామెడీ టైమింగ్ తెలుగు బుల్లితెర ప్రియులకు బాగా నచ్చుతాయి. ప్రస్తుతం ఆది “ధమాకా” అనే సినిమాతో పాటు పలు టీవీ కార్యక్రమాలతో బిజీగా…
యంగ్ హీరో కార్తికేయ శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ లో నటిస్తున్న తాజా చిత్రం “రాజా విక్రమార్క”. “రాజా విక్రమార్క” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో కార్తికేయ ఎన్ఐఏ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. వి. వి. వినాయక్ శిష్యుడైన శ్రీసరిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని డబుల్ ఎయిట్ రామరెడ్డి నిర్మిస్తున్నారు. సీనియర్ కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ యాక్షన్…
జగపతి బాబు చేతుల మీదుగా ఛలో ప్రేమిద్దాం ఫస్ట్ సింగిల్ లాంచ్హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై సాయి రోనక్, నేహ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ నిర్మిస్తోన్న చిత్రం ఛలో ప్రేమిద్దాం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ఈ రోజు విభిన్న నటుడు జగపతి…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తనకెంతో ఇష్టమైన వ్యక్తులతో దీపావళీని సెలబ్రేట్ చేసుకున్నారు. నాగ చైతన్యతో విడాకుల అనంతరం మొదటి పండగ కావడంతో ఆమె ఎవరితో సెలబ్రేట్ చేసుకున్నారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ఆమె దీపావళీని తనకెంతో ఇష్టమైన తన స్నేహితురాలు శిల్పా రెడ్డి కుటుంబంతో కలిసి చేసుకున్నారు. ఈ వేడుకల్లో మెగా కోడలు ఉపాసన మెరవడం గమనార్హం. ఉపాసనకు టాలీవుడ్ హీరోయిన్లందరితో ప్రత్యేక అనుభందం ఉంది. కొద్దిరోజుల క్రితం సామ్, ఉపాసన…
సూపర్ హీరోస్ చిత్రాలను అభిమానించే వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. మార్వెల్ కామిక్ బుక్స్ లోని సూపర్ హీరో క్యారెక్టర్స్ ను బేస్ చేసుకుని ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’తో కొందరు సూపర్ హీరోస్ కు ఫుల్ స్టాప్ పెట్టేసిన ఆ సంస్థ, ఇప్పుడు సరికొత్త సీరిస్ తో జనం ముందుకు వచ్చింది. అదే ‘ఇటర్నల్స్’. మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సినిమా దీపావళి కానుకగా శుక్రవారం జనం ముందుకు వచ్చింది. 2డీతో…
దక్షిణాదిన నటిగా పేరు తెచ్చుకుని ఆ తర్వాత బాలీవుడ్ లో పేరు తెచ్చుకుంది తాప్సీ. అక్కడ ‘పింక్, జుడ్వా 2, తప్పడ్’ వంటి సినిమాలతో తనకంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది. ఇటీవల ‘రష్మీ రాకెట్’తో ఆడియన్స్ ముందుకు వచ్చిన తాప్సీ గ్లోబల్ యంగ్ లీడర్స్ సమ్మిట్ 2021లో పాల్గొంది. వారితో జరిపిన చాట్‌లో స్టార్స్ కొందరు తనతో సినిమాలు చేయడానికి వెనుకాడుతున్నారని వెల్లడించింది. టాప్ లో ఉన్న నటీనటులే కాదు కొత్తవాళ్లు సైతం తనతో కలసి నటించటానికి…
దీపావళి పండగ పర్వదినం రోజు టాలీవుడ్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దీపావళి పండుగను పురస్కరించుకుని సూపర్ స్టార్ మహేష్ బాబుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బహుమతులు పంపాడు. ఇందులో పర్యావరణహిత పటాసులతో పాటు స్వీట్లు ఉన్నాయి. పవన్, అన్నా లెజినోవా దంపతులు తమకు గిఫ్టులు పంపిన విషయాన్ని స్వయంగా మహేష్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు వెల్లడించింది. దీంతో థాంక్యూ అన్నా అండ్ పవన్, హ్యాపీ దివాళి అంటూ నమ్రత కామెంట్…
(నవంబర్ 5న మెహ్రీన్ పుట్టినరోజు)తెలుగు సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో తొలిసారి నాయికగా తెరపై వెలిగింది మెహ్రీన్ పిర్జాదా. ఈ పంజాబీ ముద్దుగుమ్మ వచ్చీ రాగానే తెలుగువారిని ఆకట్టుకుంది. తెలుగు సినిమాలతోనే ఓ వెలుగు చూసింది. ఇప్పటికీ తెలుగు చిత్రాలపైనే ఫోకస్ పెట్టింది. ఆ మధ్య ‘ఎఫ్ -2’లో వరుణ్ తేజ్ జోడీగా అలరించిన మెహ్రీన్, ఆ సినిమా సీక్వెల్ గా వస్తోన్న ‘ఎఫ్-3’ లోనూ నటిస్తోంది. దీపావళి కానుకగా విడుదలవుతోన్న ‘మంచి రోజులు వచ్చాయి’ చిత్రంలో…
దాదాపు పదేళ్ళ క్రితం విశాల్, ఆర్య హీరోలుగా దర్శకుడు బాలా ‘అవన్ – ఇవన్’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు నటుడిగా విశాల్ ను మరో మెట్టు పైకి తీసుకెళ్ళింది. ఇంతకాలానికి మళ్ళీ వీరిద్దరూ ప్రధాన పాత్రధారులుగా ఆనంద్ శంకర్ ‘ఎనిమి’ చిత్రాన్ని రూపొందించాడు. ఎస్. వినోద్ కుమార్ నిర్మించిన ఈ సినిమా దీపావళి కానుకగా వచ్చిన రజనీకాంత్ ‘పెద్దన్న’తో పోటీ పడింది. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పారి రాజన్ (ప్రకాశ్…
నటసింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ‘అన్ స్టాపబుల్ యన్.బి.కె.’ టాక్ షో దీపావళి రోజున ‘ఆహా’ ఓటీటీలో ఆరంభమయింది. మొదటి రోజునే బాలకృష్ణ ప్రోగ్రామ్ లో గెస్ట్స్ గా ప్రముఖ నటుడు మోహన్ బాబు, ఆయన కూతురు మంచు లక్ష్మి, తనయుడు మంచు విష్ణు రావడం విశేషమనే చెప్పాలి. ఈ ఎపిసోడ్ యాభై నిమిషాలు ఉంది. ఎవడాపుతాడో చూద్దాం… ఆరంభంలో బాలకృష్ణ ఏకపాత్రాభినయం చేస్తున్నట్టుగా తన గురించి జనం ఏమనుకుంటున్నారో వివరిస్తూ తెరపై కనిపించడం ఆకట్టుకుంటుంది.…