ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన రచ్చ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది… అయితే, ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు బన్నీ.. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాను అని పేర్కొన్నారు.. కాగా, అల్లు అర్జున్‌తో ఫొటోలు దిగే అవకాశం వచ్చింది.. ఈ అవకాశాన్ని వదులుకోకండి అంటూ… సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్‌గా మారిపోవడంతో.. బన్నీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హైదరాబాద్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి తరలివచ్చారు.. క్యూలైన్‌లో అభిమాన హీరోకోసం వేచిచూశారు.. అయితే, ఫొటో సెషన్ లేదంటూ వచ్చిన సమాధానంతో అభిమానులు ఊగిపోయారు.. హీరో రావాల్సిందేనంటూ పట్టుబట్టారు.. ఇక, బన్నీ సాయంత్రం ఎన్-కన్వెన్షన్ సెంటర్ కు వస్తారని, ఫ్యాన్స్ మీట్, ఫొటో సెషన్ ఉంటుందంటూ వారికి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుండగా.. దాంతో ఫ్యాన్స్ మొత్తం గీతా ఆర్ట్స్ నుంచి ఎన్-కన్వెన్షన్‌కు వెళ్లిపోయారు.. ఫ్యాన్స్ సంఖ్య ఎక్కువగా ఉండడం.. అంచనాకు మించిన ఫ్యాన్స్ రావడంతో.. సెక్యూరిటీ సిబ్బంది ఆంక్షలు విధించారు.. కానీ, అక్కడే తీపులాట మొదలైంది.. దీంతో.. కోపంతో ఓగిపోయిన ఫ్యాన్స్ కన్వెన్షన్ సెంటర్ గేటు విరగగొట్టడం.. బారికేడ్లను తొలగించడం.. అద్దాలు పగలగొట్టడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది.. ఈ ఘటనలో కొంతమంది బన్నీ ఫ్యాన్స్ గాయపడ్డారు.
ఇక, పరిస్థితి చేయిదాటిపోవడంతో… ఎన్- కన్వెన్షన్ సెంటర్ దగ్గర కూడా ఫొటో సెషన్ రద్దు చేశారు.. ఫ్యాన్స్ మీట్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, ఈ ఘటనపై రాత్రి సోషల్ మీడియా వేదికగా స్పందించారు బన్నీ.. ఫ్యాన్స్ మీట్‌లో నా అభిమానులకు గాయలు అయినట్టు తెలిసింది.. గాయపడిన అభిమానులను నా టీమ్ దగ్గరుండి చూసుకుంటున్నారు.. అభిమానులకు సంబంధించిన ప్రతి సమాచారం నాకు తెలియజేస్తున్నారు.. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాను.. మీ ప్రేమ అభిమానం నాకు కోట్ల ఆస్తి.. దానిని ఎప్పుడు మర్చిపోను.. అంటూ ట్వీట్ చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కాగా, బన్నీ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప ది రైజ్’… డిసెండర్ 17వ తేదీన విడుదలకానుంది.. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీని.. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్.
— Allu Arjun (@alluarjun) December 13, 2021