ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చల దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు టాలీవుడ్ పెద్దలు.. మంత్రి పేర్నినానిని కలిసి చర్చలు జరపాలని భావిస్తున్నారు. రేపు సినీ ప్రముఖుల బృందం.. మంత్రి పేర్నినానితో సమావేశం అయ్యే అవకాశం ఉంది.. కాగా, గత కొన్ని రోజులుగా ఏపీలో సినిమా థియేటర్లపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కొన్ని థియేటర్లను ఇప్పటికే మూసివేశారు. టికెట్ రేట్లు తక్కువగా ఉంటే.. సినిమా థియేటర్లను నడపలేమంటూ.. మరికొందరు స్వచ్ఛందంగా సినిమా థియేటర్లను మూసివేస్తున్నారు. దాంతో..…
‘అమ్మ’ అన్న పదంలో ఉన్నవి రెండక్షరాలే- ఆ రెండు అక్షరాల్లోనే అమృతం మించిన మధురం దాగుంది. ఈ సత్యాన్ని చాటుతూ ఎన్నో చిత్రాలు తెలుగువారిని అలరించాయి. అయినా, కన్నతల్లిని గౌరవించే సంతానం ఎంతమంది ఉన్నారో కానీ, ప్రతీసారి అమ్మ ప్రాధాన్యం చెప్పవలసి వస్తూనే ఉంది. అమృతమయమైన అమ్మను కీర్తిస్తూ పాటలూ పలికించవలసి వస్తోంది. దర్శకరత్న దాసరి నారాయణ రావు తన తొలి చిత్రం ‘తాత-మనవడు’లోనే తల్లి గొప్పతనాన్ని చక్కగా తెరకెక్కించారు. ‘అమ్మ రాజీనామా’కు 30 ఏళ్ళు అదే…
2021లో దాదాపు 270 తెలుగు సినిమాలు విడుదలైతే అందులో స్ట్రయిట్ మూవీస్ సుమారు 200. థియేటర్లలో కాకుండా ఇందులో ఇరవైకు పైగా సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యాయి. విశేషం ఏమంటే యంగ్ హీరోస్ తో పాటు స్టార్ హీరోలనూ డైరెక్ట్ చేసే ఛాన్స్ కొత్త దర్శకులకు ఈ యేడాది లభించింది. మరి ఈ నయా దర్శకులలో ఎవరెవరు తమ సత్తా చాటారో తెలుసుకుందాం. అక్కినేని నాగార్జున నటించిన ఒకే ఒక్క చిత్రం ‘వైల్డ్ డాగ్’…
ఏపీలో టికెట్ రేట్ల ఇష్యూ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. మరోవైపు థియేటర్ల మూత పర్వం కొనసాగుతోంది. సినిమా థియేటర్లలో తనిఖీలు ఇంకా పూర్తవ్వలేదు. ఆంధ్రాలో శుక్రవారం 30 హాళ్లు సీజ్ అయినట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లలో రెవెన్యూ, పోలీసు అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో ఇప్పటికే పలు పలుచోట్ల థియేటర్లను సీజ్ చేశారు. మరోవైపు టికెట్ల ధరలు అతి తక్కువగా ఉన్నందున థియేటర్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు కొన్ని చోట్ల…
నటి కరాటే కళ్యాణి పై కేసు నమోదైంది. జగద్గిరిగుట్ట పీఎస్ లో కరాటే కళ్యాణి పై కేసు నమోదు అయింది. గతంలో సైదాబాద్ సింగరేణి కాలనీలో ఓ బాలిక పై జరిగిన హత్యాచార వివరాలను కరాటే కళ్యాణి.. తన సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేసింది. అయితే.. ఈ సంఘటన పై రంగారెడ్డి జిల్లా జగద్గిరిగుట్ట కు చెందిన నితేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో కరాటే కళ్యాణి పై… కోర్టు ఆదేశాలతో జగద్గిరిగుట్ట పోలీసులు…
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి. వాస్తవానికి ఇది క్రిష్టియన్స్ పండగ. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అన్ని పండగలను అందరూ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. డిసెంబర్ నెల వచ్చిందంటే పండగల కాలం అని చెప్పొచ్చు. ఎందుకంటే క్రిస్మస్ మొదలుకొని వరుసగా న్యూఇయర్, సంక్రాంతి సెలెబ్రేషన్స్ కూడా అతి తక్కువ గ్యాప్ తో సెలెబ్రేట్ చేసుకుంటాం. ప్రస్తుతం అందరూ క్రిస్మస్ సంబరాల్లో మునిగిపోయారు. సెలెబ్రిటీలు సైతం తమ ఇంటికి లైట్స్ తో, క్రిస్మస్ ట్రీతో, శాంటా బొమ్మలతో అలంకరించి…
తెలంగాణాలో టికెట్ రేట్లను పెంచేందుకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం కొత్త జీవోను జారీ చేసింది. ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ సినిమా ఇండస్ట్రీకి మేలు కలిగేలా తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి. ఈ మేరకు “తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్…
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వ్యవహారంపై తాజాగా టాలీవుడ్ హీరో నాని చేసిన వ్యాఖ్యలు హాట్టాపిక్గా మారిపోయాయి.. వరుసగా నానిపై ఎదురు దాడికి దిగుతున్నారు ఏపీ మంత్రులు… ఇక, నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. సినీ హీరోలు పారితోషకం తగ్గించుకుంటే.. టికెట్ల ధరలు మరింత తగ్గుతాయని తెలిపారు. మరోవైపు.. హీరో నాని ఎవరో నాకు తెలియదంటూ ఎద్దేవా చేసిన మంత్రి అనిల్.. నాకు తెలిసింది కొడాలి నాని మాత్రమే నంటూ చమత్కరించారు.. ఇక,…
ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్లపై…రెవెన్యూ అధికారుల దాడులు కొనసాగుతున్నాయ్. చిత్తూరు పలు థియేటర్లకు…అధికారులు నోటీసులు జారీ చేశారు. మరికొన్నింటికి మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అనంతపురం జిల్లా నాలుగు థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేశారు. ఏపీలో నిబంధనలు పాటించని థియేటర్లపై అధికారులు కొరడా ఝులిపించారు. చిత్తూరు జిల్లాలో 11 థియేటర్లను సీజ్ చేశారు. మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలోని 37 సినిమా హాళ్లకు నోటీసులు ఇచ్చారు. వీటిలో 16 సినిమా థియేటర్లు మూసివేశారు. మదనపల్లిలో ఏడు, కుప్పంలో నాలుగు…
ఏపీలో టికెట్ రేట్ల విషయంపై వివాదం కొనసాగుతోంది. డిస్ట్రిబ్యూటర్ల ఆవేదనను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజలకు టికెట్ ధరలు అందుబాటులో ఉండాలని పట్టుబట్టింది. దీంతో ఇప్పటికే పలువురు థియేటర్ యాజమాన్యాలు నష్టాల్లో సినిమాలను ప్రదర్శించలేక స్వచ్చందంగా థియేటర్లను క్లోజ్ చేసేసుకున్నారు. మరోవైపు థియేటర్లపై అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ తనిఖీల్లో చిత్తూరు జిల్లాలో 17 సినిమా థియేటర్లు మూత పడ్డట్లు సమాచారం. మదనపల్లి, కుప్పం, పలమనేరు పుంగనూరులలో నిన్న మధ్యాహ్నం నుంచే షో లు రద్దు…