ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, ఏపీ ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ కోరాడు. థియేటర్ల సమస్యలపై ప్రభుత్వం నెలరోజులు సమయం ఇవ్వడం సంతోషంగానే ఉన్నా… థియేటర్ల సీజ్ అంశంపై పని ఒత్తిడిలో ఉండే జాయింట్ కలెక్టర్లను కలిస్తే ఉపయోగం ఏం ఉంటుందని ప్రశ్నించారు. కరోనాతో రెండేళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. ఓటీటీ కారణంగా ఎన్నో నష్టాలకు గురయ్యామని ఎన్వీ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.…
ఏపీలో థియేటర్ల ఓనర్లకు ఊరట కలిగింది. సీజ్ చేసిన థియేటర్లు తిరిగి ఒపెన్ చేసేందుకు ప్రభుత్వం నుంచి తాజాగా గ్రీన్ సిగ్నల్ లభించింది. థియేటర్లను తిరిగి తెరుచుకోవడానికి అనుమతినిచ్చిన ప్రభుత్వానికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ కృతజ్ఞతలు తెలిపింది. ఇటీవల ఏపీ ప్రభుత్వానికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ తరపున కొన్ని విన్నపాలు చేసుకున్నారు. అందులో మొదటగా థియేటర్స్ రీఓపెనింగ్ కి అనుమతి నిచ్చిన ఆంధ్రప్రధేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి, సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని…
గత కొన్ని రోజులుగా ఏపీలో టికెట్ దరల విషయమై రచ్చ నడుస్తోంది. మరోవైపు థియేటర్ల సీజ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా థియేటర్ యాజమాన్యాలకు ఊరటనిస్తూ థియేటర్ల రీఓపెన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ కండిషన్స్ మాత్రం అప్లై అని చెప్పడం గమనార్హం. కొన్ని రోజులుగా ఆంధ్రా థియేటర్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. థియేటర్లను నిర్వహించడానికి అనుమతులతో పాటు అవసరమైన పత్రాలు, సెక్యూరిటీ అండ్ సేఫ్టీ సరిగ్గా లేని థియేటర్లను…
ఇంకా నాగ చైతన్య సమంత మధ్య ఆ లింకేంటి RRR టార్గెట్ మామూలుగా లేదుగా రివర్స్ రిజల్ట్‌తో ఓటిటికి షాక్ ఇచ్చిన పుష్ప అక్కడ చరణ్, తారక్ పరిస్థితేంటి ‘లైగర్’ ఫస్ట్ గ్లింప్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్
గత యేడాది లాగే ఈ సారి కూడా లాక్ డౌన్ సినిమా రంగాన్ని కుదేలు చేసింది. అయినా కొన్ని సినిమాలు వెలుగులు విరజిమ్మాయి. మరికొన్ని ఓటీటీల్లో సందడి చేశాయి. ఇంకొన్ని బాక్సాఫీస్ బరిలో మిశ్రమ ఫలితాలు చూశాయి. అందరు స్టార్ హీరోస్ సినిమాలు బాక్సాఫీస్ బరిలో దూకలేకపోయాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం దాదాపు టాలీవుడ్ లో స్టార్ హీరోస్ అనిపించుకున్నవారందరూ ఏదో విధంగా వినోదం పంచారనే చెప్పాలి. టాప్ హీరోస్ లో కొందరి సినిమాలు థియేటర్లలో…
కరోనా మహమ్మారి మళ్ళీ వేగంగా వ్యాపిస్తోంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు ప్రజలు. అందుకే కరోనా తగ్గిపోయింది కదా అనే భ్రమలో ఉండకుండా మాస్క్, శానిటైజర్, సామజిక దూరం పాటించడం మంచిదని చెబుతున్నారు వైద్యులు. మరోమారు ప్రముఖ సినీ సెలెబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే కరీనా కపూర్, ప్రగ్యా జైస్వాల్ వంటి స్టార్స్ కు కరోనా సోకగా… తాజాగా టాలీవుడ్ లో మరో యంగ్ హీరోకు కరోనా పాజిటివ్ గా…
హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా ‘జాతి రత్నాలు’ చిత్రంతో చిట్టిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. సినిమా బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో ప్రేక్షకులు ఆమె పాత్రకు బాగా కనెక్ట్ అయ్యారు. ఆమెను ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్‌లలో కూడా ‘చిట్టి’ అని పిలుస్తున్నారు. కాగా ఈ చిట్టి ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ తో రొమాన్స్ చేయనుందని వార్తలు విన్పిస్తున్నాయి. సంతోష్ శోబన్ తదుపరి చిత్రం కోసం చిట్టిని ఎంపిక చేసినట్లు సమాచారం. సంతోష్, ఫరియాల రొమాన్స్‌కి మంచి…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చల దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు టాలీవుడ్ పెద్దలు.. మంత్రి పేర్నినానిని కలిసి చర్చలు జరపాలని భావిస్తున్నారు. రేపు సినీ ప్రముఖుల బృందం.. మంత్రి పేర్నినానితో సమావేశం అయ్యే అవకాశం ఉంది.. కాగా, గత కొన్ని రోజులుగా ఏపీలో సినిమా థియేటర్లపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కొన్ని థియేటర్లను ఇప్పటికే మూసివేశారు. టికెట్ రేట్లు తక్కువగా ఉంటే.. సినిమా థియేటర్లను నడపలేమంటూ.. మరికొందరు స్వచ్ఛందంగా సినిమా థియేటర్లను మూసివేస్తున్నారు. దాంతో..…
‘అమ్మ’ అన్న పదంలో ఉన్నవి రెండక్షరాలే- ఆ రెండు అక్షరాల్లోనే అమృతం మించిన మధురం దాగుంది. ఈ సత్యాన్ని చాటుతూ ఎన్నో చిత్రాలు తెలుగువారిని అలరించాయి. అయినా, కన్నతల్లిని గౌరవించే సంతానం ఎంతమంది ఉన్నారో కానీ, ప్రతీసారి అమ్మ ప్రాధాన్యం చెప్పవలసి వస్తూనే ఉంది. అమృతమయమైన అమ్మను కీర్తిస్తూ పాటలూ పలికించవలసి వస్తోంది. దర్శకరత్న దాసరి నారాయణ రావు తన తొలి చిత్రం ‘తాత-మనవడు’లోనే తల్లి గొప్పతనాన్ని చక్కగా తెరకెక్కించారు. ‘అమ్మ రాజీనామా’కు 30 ఏళ్ళు అదే…
2021లో దాదాపు 270 తెలుగు సినిమాలు విడుదలైతే అందులో స్ట్రయిట్ మూవీస్ సుమారు 200. థియేటర్లలో కాకుండా ఇందులో ఇరవైకు పైగా సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యాయి. విశేషం ఏమంటే యంగ్ హీరోస్ తో పాటు స్టార్ హీరోలనూ డైరెక్ట్ చేసే ఛాన్స్ కొత్త దర్శకులకు ఈ యేడాది లభించింది. మరి ఈ నయా దర్శకులలో ఎవరెవరు తమ సత్తా చాటారో తెలుసుకుందాం. అక్కినేని నాగార్జున నటించిన ఒకే ఒక్క చిత్రం ‘వైల్డ్ డాగ్’…