Gandhi Jayanthi : అహింసామూర్తితో ‘చిత్ర’బంధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“రఘుపతి రాఘవ రాజారామ్… పతిత పావన సీతారామ్… ఈశ్వర్ అల్లా తేరో నామ్… సబ్ కో సన్మతి దే భగవాన్…” అనే గీతం ఈ నాటికీ ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంటుంది. తులసీదాస్ రాసిన ఈ పాట అంటే మహాత్మ గాంధీకి అత్యంత ప్రీతి. ఆయన సబర్మతి ఆశ్రమంలో సదా ఈ గీతం వినిపిస్తూ ఉంటుంది. ఈ నాటికీ ఏ సినిమాలోనైనా గాంధీ బొమ్మ కనిపించినా, ఆయన విజువల్ దర్శనమిచ్చినా జనం చప్పట్లు కొడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో గాంధీయిజమ్ ను ప్రదర్శించే సమయంలోనూ ‘రఘుపతి రాఘవ రాజారామ్…’ పాట నేపథ్యంగా వినిపిస్తూనే ఉంటుంది.
‘మహాత్మ’ తెలుగు చిత్రం చూసిన వారెవరికైనా “కొంతమంది సొంతపేరు కాదుర గాంధీ… ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ…” అంటూ సాగే పాట గుర్తుండే ఉంటుంది. అందులోనూ ఆరంభంలోనే ‘రఘుపతి రాఘవ రాజారామ్…’ అన్న మకుటం దర్శనమిస్తుంది. అలా గాంధీకి ప్రియమైన గీతం పలు తెలుగు చిత్రాలలో చోటు చేసుకుంది. ఇక ‘మహాత్మ’లో ‘కొంతమంది ఇంటిపేరు కాదుర గాంధీ…’ పాటలోనే ఆ మహనీయుని గొప్పతనాన్ని చక్కగా వివరించారు సిరివెన్నెల.
భారతీయుల మదిలో అహింసామూర్తిగా గుడికట్టుకున్న మహాత్మ గాంధీతో సినిమాలకు విడదీయరాని బంధం ఉంది. మన దేశానికి సంబంధించిన తొలి డాక్యుమెంటరీస్ లో మహాత్ముడే ఎక్కువగా కనిపించారు. ఆ రోజుల్లో బ్రిటిష్ వారు మహాత్మ గాంధీ చేస్తున్న అహింసా పోరాటాలను నిక్షిప్తం చేయాలని భావించి, ఆ దిశగా డాక్యుమెంటరీలు రూపొందించారు. అలా నిక్షిప్త పరచిన మహాత్ముని దృశ్యాలనే ఈ నాటికీ చూడగలుగుతున్నాం. ముఖ్యంగా దండి వద్ద బాపూజీ చేసిన ఉప్పు సత్యాగ్రహం సమయంలో గాంధీజీపై చిత్రీకరించిన విజువల్స్ ఈ నాటికీ అందుబాటులో ఉన్నాయి. ప్రతియేటా అక్టోబర్ 2న గాంధీ జయంతిని భారతీయులందరూ ఓ పర్వదినంలా జరుపుకుంటూ ఉంటారు. అనేక పర్యాయాలు బాపూజీ జయంతిన మన సినిమాలు సైతం వెలుగు చూశాయి.
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
మన తెలుగునాట కూడా గాంధీజీ అంటే విశేషమైన భక్తి చోటు చేసుకుంది. గాంధీజీపై 1941లోనే తెలుగులో ఓ డాక్యుమెంటరీ మూవీ రూపొందింది. హేమలతా ఫిలిమ్స్ పతాకంపై ఎ.కె.చెట్టియార్ దర్శకత్వంలో ‘మహాత్మ గాంధీ’ పేరుతో ఈ డాక్యుమెంటరీ తెరకెక్కింది. ఇందులో నాటి మేటి నటగాయనీమణులు బెజవాడ రాజరత్నం, పి.కన్నాంబ, టంగుటూరి సూర్యకుమారి నటించారు. ఈ సినిమాకు ముందు 1938లో గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో రూపొందిన ‘మాలపిల్ల’ చిత్రంలో బసవరాజు అప్పారావు గాంధీజీపై రాసిన “కుల్లాయి కట్టితేయేమి మా గాంధి మాలడై తిరిగితే ఏమి…” అనే పాట ఆ రోజుల్లో విశేషాదరణ చూరగొంది.
స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత కూడా పలు చిత్రాలలో గాంధీ ప్రస్తావనతో పాటలు రూపొందాయి. 1955లో తెరకెక్కిన ‘దొంగరాముడు’లో “భలే తాత మన బాపూజీ… బాలల తాతా బాపూజీ…” పాట కూడా విశేషాదరణ చూరగొంది. ‘బడిపంతులు’లో “భారతమాతకు జేజేలు…” అంటూ సాగే పాటలోనూ “శాంతి దూతగా వెలసిన బాపూ…” అంటూ గాంధీని స్మరించుకోవడం జరిగింది. ‘పవిత్రబంధం’లో “గాంధి పుట్టిన దేశమా… ఇది… నెహ్రు కోరిన సంఘమా ఇది…” అంటూ యువరక్తం ప్రశ్నించేలా ఓ పాట రూపొందింది. ఇక ‘గాంధీ పుట్టిన దేశం’ చిత్రంలోని “గాంధీ పుట్టిన దేశం… రఘురాముడు ఏలిన రాజ్యం…” అంటూ సాగే పాట సైతం ఎంతగానో మురిపించింది. ‘మరో ప్రపంచం’ చిత్రంలో “మహాత్ముడే కలలు కన్న మరో ప్రపంచం…” పాట కూడా ఆదరణ చూరగొంది. గాంధీజీ బోధించిన “చెడు అనవద్దు…చెడు వినవద్దు… చెడు కనవద్దు… ఇది బాపూజీ పిలుపు… ఇదే మేలుకొలుపు…” అంటూ ‘మేలుకొలుపు’ చిత్రంలో మరో పాట ఆకట్టుకుంది. యన్టీఆర్ 200వ చిత్రం ‘కోడలు దిద్దిన కాపురం’లోని “నీ ధర్మం… నీ సంఘం…” పాటలో “సత్యాగ్రహమే సాధనంబుగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ…” అనీ వినిపిస్తుంది. ఇక తమిళ చిత్రం ‘చంద్రోదయం’లో రూపొందిన “బుద్ధన్ ఏసు గాంధి పిరందదు…” పాట తమిళనాట అక్కడి జనాన్ని ఎంతగానో ఉత్తేజపరుస్తూ ఉంటుంది. ఇలా పాటల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ గాంధీజీని భారతీయులు స్మరించుకుంటూనే ఉన్నారు.
ఇక బ్రిటిష్ డైరెక్టర్ రిచర్డ్ అటెన్ బరో తెరకెక్కించిన ‘గాంధీ’ చిత్రం భారతీయ భాషలన్నిటా అనువాదమై అలరించింది. తెలుగునేలపైనా ‘గాంధీ’ చిత్రం మురిపించింది. స్వాతంత్ర్య వజ్రోత్సవం సందర్భంగా ఆగస్టులో ఈ ‘గాంధీ’ చిత్రాన్ని తెలంగాణ వ్యాప్తంగా పలు థియేటర్లలో ప్రదర్శించడం గమనార్హం!
“మేకింగ్ ఆఫ్ మహాత్మ, సర్దార్, హే రామ్, గాంధీ- మై ఫాదర్, లగే రహో మున్నాభాయ్, మైనే గాంధీ కో నహీ మారా” వంటి చిత్రాలలోనూ, మన తెలుగు సినిమా ‘శంకర్ దాదా జిందాబాద్’లోనూ గాంధీ ప్రస్తావన కనిపిస్తుంది. ఈ చిత్రాలలో కొన్నిట గాంధీ చుట్టూ కథ సాగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇతర భారతీయ భాషల్లోనూ మహాత్మునిపై రూపొందిన చిత్రాలు బోలెడు కనిపిస్తాయి. భవిష్యత్ లోనూ భారతీయులు ఆ శాంతిదూతను తలచుకుంటూనే ఉంటారని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!