Prathibimbalu: మహానటుడు అక్కినేని 40 సంవత్సరాల క్రితం నటించిన 'ప్రతిబింబాలు' సినిమా ఇప్పుడు రిలీజ్ కి సిద్ధం అయింది. విష్ణు ప్రియ సినీ కంబైన్స్ పతాకంపై కె.యస్. ప్రకాశరావు, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి నిర్మించిన ఈ సినిమాను రాజేశ్వర్ రాచర్ల సమర్పణలో 2కె హెడి రిజల్యూషన్ తో విడుదల చేయబోతున్నారు.
మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మీడియా ప్రత్యేక లేఖను రిలీజ్ చేశారు. తాను ఎప్పుడైనా ఎవరినైనా మోసం చేస్తే, దగా చేస్తే అది నన్ను నమ్మి టికెట్ కొన్ని ప్రేక్షకులను తప్ప తానెవరిని మోసం చేయలేదని పూరి జగన్నాథ్ లేఖలో తెలిపారు.
Myositis: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తనకు మయోసైటిస్ అనే వ్యాధి సోకిందని చెప్పడంతో ప్రస్తుతం ఈ అంశం గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. చాలా మంది ఈ వ్యాధి అంటే ఏంటో తెలియదని కామెంట్ చేస్తున్నారు. దీంతో దీని లక్షణాల గురించి కూడా తెలియదని చెప్తున్నారు. అయితే కొందరు వైద్యులు చెప్తున్న సమాచారం ప్రకారం మయోసైటిస్ అంటే చర్మ వ్యాధి అని తెలుస్తోంది. ఈ వ్యాధిని దీర్ఘకాలిక కండరాల వాపు అని కూడా…
October Progress Report: అక్టోబర్ మాసంలో తెలుగులో మొత్తం 29 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో 7 అనువాద చిత్రాలు ఉన్నాయి. విశేషం ఏమంటే దసరా, దీపావళి సందర్భంగా పలు చిత్రాలు ఆయా వారాలలో విడుదలయ్యాయి. అయితే తెలుగు స్ట్రయిట్ చిత్రాలకంటే అనువాద చిత్రమైన ‘కాంతార’నే ఈ నెలలో విజయకేతనం ఎగరేసి అగ్రస్థానంలో నిలిచింది. ఈ నెల ఒకటవ తేదీన ‘బలమెవ్వడు’ మూవీ విడుదలైంది. ఆ తర్వాత దసరా కానుకగా చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ది…
Telugu Movie Sequels : తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం సీక్వెల్స్ హవా నడుస్తోంది. ఫస్ట్ రిలీజ్ చేసిన సినిమాలు భారీ హిట్ సాధించడంతో వాటికి కొనసాగింపుగా మరో సీక్వెల్ తెచ్చేందుకు చిత్రబృందాలు ప్రయత్నిస్తున్నాయి.
Gargeyi Yellapragada: ఆసక్తికర కథ, కథనంతో ప్రేక్షకులను థ్రిల్ చేసేలా సింగిల్ క్యారెక్టర్ తో ‘హలో మీరా’ చిత్రాన్ని రూపొందించారు ప్రముఖ దర్శకుడు స్వర్గీయ బాపు శిష్యులు కాకర్ల శ్రీనివాసు. ‘తెల్లవారితే పెళ్ళి, అంతలోనే ఊహించని అవాంతరం. దాంతో విజయవాడ నుంచి హైద్రాబాద్ కు హుటాహుటిన కారులో ప్రయాణం, ఆ నాలుగు గంటలలో ఉత్కంఠ రేపే పరిణామాలు… ఈ నేపథ్యంలో ‘హలో మీరా’ చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించాన’ని దర్శకులు కాకర్ల శ్రీనివాసు చెబుతున్నారు. Read Also: Kida:…
Golden Jubilee: డైలాగ్ కింగ్, అజాత శత్రువు సాయికుమార్ కు యాభై యేళ్ళు! అదేమిటీ ఆయన పుట్టింది 1960లో కదా అని కొందరికి అనుమానం రావచ్చు. బట్.... నటుడిగా ఆయనకు ఇది 50వ సంవత్సరం. పన్నెండేళ్ళ చిరు ప్రాయంలో తొలిసారి మయసభలోని దుర్యోధనుడి పాత్ర కోసం ముఖానికి రంగు వేసుకున్నారు సాయికుమార్. ఆ తర్వాత బాలనటుడిగా, యువ నటుడిగా, కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా యాభై సంవత్సరాల పాటు వివిధ భాషల్లో వందలాది చిత్రాలలో నటించారు.
అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన భారతీయ సినిమాలలో RRR అత్యుత్తమమైనది. విజయేంద్ర ప్రసాద్ రచించిన మరియు SS రాజమౌళి దర్శకత్వం వహించిన ఎపిక్ యాక్షన్ డ్రామా ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర అగ్ర చిత్ర పరిశ్రమలలో చర్చనీయాంశంగా ఉంది.