Hari Pirya: నాని హీరోయిన్ తో ‘కేజీఎఫ్’ విలన్ పెళ్ళి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vasishta N Simha: హరిప్రియ… కన్నడలో స్టార్ హీరోయిన్. అంతేకాదు అటు తమిళ, మలయాళ సినిమాలతో పాటు ఇటు తెలుగులోనూ నటించి మంచి పేరు తెచ్చుకుంది. మూడు పదుల ఈ ముద్దమందారం చిన్నప్పుడే భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించుకుంది. ఆ తర్వాత మోడలింగ్ మీదుగా చిత్రసీమలోకి అడుగుపెట్టింది. 2008లో కన్నడ చిత్రంలో హీరోయిన్ గా నటించిన హరిప్రియ… ప్రముఖ నటి భూమిక భర్త భరత్ ఠాకూర్ నిర్మించిన ‘తకిట తకిట’మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని సరసన ‘పిల్ల జమిందార్’లో యాక్ట్ చేసింది. అలానే వరుణ్ సందేశ్ కు ‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’ మూవీలో జోడీ కట్టింది. ఇందులో ఆమెది కాల్ గర్ల్ క్యారెక్టర్ కావడం విశేషం. కాస్తంత గ్యాప్ తర్వాత బాలకృష్ణ ‘జైసింహా’తో టాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇచ్చింది.

విశేషం ఏమంటే ఈ అందాల ముద్దుగుమ్మ ఇప్పుడు కన్నడ నటుడితో ఏడు అడుగులు వేయడానికి రెడీ అయ్యింది. అతను మరెవరో కాదు… సూపర్ డూపర్ హిట్ మూవీ ‘కేజీఎఫ్’లో వన్ ఆఫ్ ది విలన్స్ గా నటించిన వశిష్ఠ ఎన్. సింహా. కన్నడంలో పలు చిత్రాలలో నటించిన వశిష్ఠ ‘కేజీఎఫ్’ పుణ్యమా అని ఇప్పుడు ఇతర భాషల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు. తెలుగులోనూ ‘నయీమ్ డైరీస్, నారప్ప, ఓదెల రైల్వే స్టేషన్’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు. వీరిద్దరికీ మధ్య ప్రేమ ఎప్పుడు, ఎలా చిగురించిందో తెలియదు. కానీ… శుక్రవారం నిరాడంబరంగా వీరి వివాహ నిశ్చితార్థం జరిగింది. ఈ ఫోటోలను వీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, తమ మధ్య ఉన్న ప్రేమబంధాన్ని బహిర్గతం చేశారు. మరి వీరిరువురూ పెళ్ళి పీటలు ఎప్పుడు ఎక్కుతారో చూడాలి.
Also Read
- The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
- Chiru Leaks: 'కాకా'లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
తాజావార్తలు
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!