Tollywood: టాలీవుడ్లో విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు సినిమా వివాదం ముదురుతోంది. తెలుగులో వారసుడు, తమిళంలో వారిసుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు గతంలోనే చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలలో దిల్ రాజు పెద్ద ఎత్తున థియేటర్లను బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలకు థియేటర్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సంక్రాంతి లాంటి పెద్ద పండగలకు…
Dil Raju: టాలీవుడ్లో కాంతార మూవీ సంచలన విజయం నమోదు చేసింది. కన్నడ డబ్బింగ్ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టడం చూసి ట్రేడ్ విశ్లేషకులు కూడా నోరెళ్లబెట్టారు. ఈ సినిమాను విడుదల చేసిన గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ భారీగా లాభాలను చవిచూసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు తాజాగా మరో డబ్బింగ్ సినిమా కూడా కాంతార తరహాలో హిట్ అవుతుందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు గట్టి నమ్మకంతో కనిపిస్తున్నాడు. తమిళంలో ఈనెల 4న…
మిస్ ఇండియా మానుషి చిల్లర్ హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మెగా హీరోతో ఆమె జోడి కట్టబోతున్నట్లు తెలుస్తోంది. యువ కథానాయకుడు వరుణ్తేజ్తో ఆమె జట్టు కట్టనుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది.
Tollywood: సూపర్ స్టార్ కృష్ణకు ఘననివాళి ఇవ్వడానికి టాలీవుడ్ సిద్దమయ్యింది. చిత్ర పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నోసేవలు అందించిన కృష్ణ మృతికి టాలీవుడ్ ఘన నివాళి ఇవ్వడానికి సిద్దపడింది. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి(TFPC), తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్(TFCC) ఆయన మీద గౌరవంతో నవంబర్ 16 న అనగా రేపు షూటింగ్స్ ను నిలిపివేస్తూ ప్రకటన విడుదల చేసింది.