Puri Jagannadh: హిట్ ఫ్లాప్ లతో సంబంధంల లేకుండా వేగంగా సినిమాలు నిర్మించే అతికొద్ది మంది డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ పేరు ముందువరుసలో ఉంటుంది. అలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ లైగర్ సినిమా ఫ్లాప్ మూడ్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. సినిమా ఫ్లాప్ అయినా ప్రస్తుతం ఆ సినిమాను వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. దీంతో ఆ సినిమా కష్టాలు, నష్టాలనుంచి బయటపడాలంటే ఆయనకు మరి కొంత సమయం పడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న తాజాగా పూరీ జగన్నాథ్ తడ్కా అనే కాన్సెప్ట్ గురించి చెప్పారు. తడ్కా అంటే తాళింపు అనే సంగతి తెలిసిందే. అయితే పూరీ జగన్నాథ్ చెప్పింది వంటల గురించి కాదు. మధ్యవర్తుల వల్ల కలిగే నష్టాల గురించి.
Read Also: Unstoppable: సన్నీతో ‘అన్ స్టాపబుల్’ అంటున్న డైమండ్ రత్నబాబు!
మధ్యవర్తుల వల్ల కలిగే వివాదాలపై పూరీ మ్యూజింగ్స్ లో వీడియో ద్వారా చెప్పుకొచ్చారు. మనం ఒక వ్యక్తిని ఒక మరొక వ్యక్తి దగ్గరకు పంపిస్తే ఆయన నుంచి రాగానే ఆ వ్యక్తి ఏమన్నారనే విషయం వదిలిపెట్టి తన గురించి లేనిపోని మాటలు మనకు తెలియజేస్తూ ఉంటారు. ఇలా తన గురించి లేనిపోనివన్నీ మనకు చెప్పాల్సిన తరువాత మనలో వారి గురించి ఒక అభిప్రాయాన్ని కలిగించి అనంతరం నిజం చెబుతారు. పెనంలో ఉన్నదానిని ఇక్కడికి తీసుకొచ్చేలోపు మధ్యవర్తులు తాళింపు వేస్తారని లైఫ్ లో సగం గొడవలకు ఇదే కారణమని పూరీ జగన్నాథ్ వెల్లడించారు. మధ్యవర్తులు జరిగింది చెబుతున్నారో లేక వాళ్ల అభిప్రాయం చెబుతున్నారో మనం గ్రహించాలని పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు. ఇక్కడ మధ్యవర్తులు అంటే ఎవరో కాదని మనమేనని పూరీ జగన్నాథ్ కామెంట్లు చేశారు. ప్రతి ఒక్కరూ తడ్కా స్పెషలిస్ట్ అని ఆయన కామెంట్లు చేశారు. మనమంతా అలవోకగా తడ్కా వేస్తామని పూరీ జగన్నాథ్ అన్నారు. ఎప్పుడైనా జరిగింది మాత్రమే చెప్పాలని పూరీ పేర్కొన్నారు. మనం ఎంత స్మార్ట్ గా ఉన్నామో తడ్కా అలానే ఉంటుందని పూరీ వెల్లడించారు.