Adivi Sesh : టాలీవుడ్ లో తమకంటూ ఓ మార్కెట్ ను క్రియేట్ చేసుకుని ముందుకు సాగుతున్న మీడియమ్ రేంజ్ హీరోల్లో అడివి శేష్, నిఖిల్ ముందు వరుసలో ఉన్నారు. వరుస సక్సెస్ లతో స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్న అడవి శేష్ ప్యాన్ ఇండియా సినిమా ‘మేజర్’ తో భారీ హిట్ కొట్టాడు. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ తో పాటు క్రిటికల్ గా కూడా ప్రశంసలు అందుకుంది. అయితే తను కోరుకున్న మాస్ ఇమేజ్ మాత్రం తెచ్చిపెట్టలేకపోయింది. అయితే ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన ‘హిట్2’ సినిమా శేష్ స్టామినాను నిరూపించింది. ఈ సినిమాకు దక్కిన ఓపెనింగ్స్ తో పాటు సినిమా హిట్ అనే టాక్ టాలీవుడ్ లో అడవి శేష్ స్థానాన్ని సుస్థిరం చేసిందనే చెప్పాలి. ఈ సినిమా విజయం తనపై అటు ప్రేక్షకులతో పాటు చిత్రపరిశ్రమ వర్గాలు కూడా భరోసా పెంచుకునేలా చేశాయి.
Read Also: Trivikram: భార్యకు ప్రేమతో.. లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన మాటల మాంత్రికుడు
ఇక మరో డిపెండబుల్ హీరో నిఖిల్ విషయానికి వస్తే ‘స్వామిరారా, కార్తికేయ’ సినిమాలతో చక్కటి బేస్ ఏర్పరచుకున్నాడు. అయితే ఆ తర్వాత ‘సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం’ నిరాశపరిచాయి. ఆ తర్వాత ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ పర్వాలేదనిపించినా ఆ తర్వాత ‘కేశవ, కిరాక్ పార్టీ’ తన కెరీర్ గ్రాఫ్ ను పాతాళానికి తీసుకు వెళ్ళాయి. నిఖిల్ పని అయిపోయిందనుకున్న తరుణంలో ‘అర్జున్ సురవరం’ మళ్ళీ లైఫ్ ఇచ్చింది. ఇక ఇటీవల విడుదలైన ‘కార్తికేయ2′ సంచలన విజయం తనను ఊహించని ఎత్తుకు తీసుకువెళ్ళింది. అయితే ఈ సక్సెస్ లో ఎక్కువ భాగం హిందూత్వ ఎజెండాదే అని చెప్పవచ్చు. దీంతో డిసెంబరు 23న రానున్న ’18 పేజెస్’ నిఖిల్ కి లిట్మస్ టెస్ట్ లాంటిది. అందులో పాస్ అయితే ఇక తనకి తిరుగుండదు. ఈ విషయంలో అడవిశేష్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోయాడు. ఇప్పడు నిఖిల్ వంతు. మరి నిఖిల్ కూడా తనని తాను నిరూపించుకుంటాడా? లేక మళ్ళీ అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తాడా? అన్నది తేలాల్సి ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.