టాలీవుడ్ నటుడు జగపతిబాబు హీరోగా ఎన్నో సినిమాలు చేసి, విలన్‌గా టర్న్ అయ్యాడు. విలన్‌గా కూడా బోర్ కొట్టిన తర్వాత, క్యారెక్టర్ రోల్స్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన జీ స్టూడియోస్ కోసం “జయంబు నిశ్చయమ్మురా” అనే ఒక టాక్ షో చేస్తున్నాడు. మొదటి ఎపిసోడ్ నాగార్జునతో చేయగా, అది సూపర్ హిట్ అయింది. తర్వాత శ్రీలీలతో ఒక ఎపిసోడ్ చేశాడు. అది కూడా బాగా వైరల్ అయింది. ఇప్పుడు నానితో చేసిన తాజా ఎపిసోడ్ జీ…
మెగా, అల్లు కాంపౌండ్స్ మధ్య దూరం పెరుగుతోంది అనే ప్రచారం ఇప్పటిది కాదు. కొన్నాళ్ల క్రితం అల్లు అర్జున్ ఈవెంట్లో “జై పవర్ స్టార్” అని అనాల్సిందిగా కోరడంతో అల్లు అర్జున్ ఇరిటేట్ అయి, “నేను చెప్పను బ్రదర్” అని అనడంతో కొంత ఈ వివాదానికి కారణమైందని చెప్పొచ్చు. ఆ తర్వాత అల్లు అర్జున్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు, చేసిన కొన్ని పనులు మెగా ఫాన్స్‌కి కోపం తెప్పించాయి. దీంతో మెగా అభిమానులు, అల్లు అభిమానులు అంటూ…
గ్లామర్ ప్రపంచంలో అర్ధశతాబ్దానికిపైగా హీరోగా కొనసాగడం అరుదైన విషయమని, ఆ ఘనత హీరో బాలక్రిష్ణకు దక్కిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.
మహోన్నతమైన వ్యక్తిత్వం, యెనలేని సేవాతత్వంతో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని పట్టణానికి చెందిన చిరంజీవి వీరాభిమాని రాజేశ్వరి, మెగాస్టార్ ని కలవాలని, ఎలాగైనా చిరు చూడాలనే కలతో సైకిల్‌పై హైదరాబాద్‌కు సాహసోపేత ప్రయాణం మొదలుపెట్టారు. ఎన్నో శారీరక, మానసిక సవాళ్లు ఎదురైనా చిరంజీవిపై వున్న అపారమైన అభిమానమే ఆమెను విజయవంతంగా ముందుకు నడిపింది. సైకిల్‌పై హైదరాబాద్ చేరుకుంది రాజేశ్వరి. Also Read…
టాలీవుడ్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా భారీ అంచనాలు నెలకొన్న, ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB 29 ‘గ్లోబ్‌ట్రాటర్’ (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్ కెన్యాలో ప్రారంభమయ్యేందుకు అంతా సిద్ధమైంది. ఈ చిత్రంలో నటిస్తున్న ప్రియాంక చోప్రా కెన్యాకు బయలుదేరిన ఫొటోలను తన సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ వార్త ఖరారైంది. ప్రయాణంలో ఆమె కెన్యాలో లభించే ‘కెన్యాన్ చెవ్డా’ అనే ప్రముఖ ఇండియన్ స్నాక్‌ను చూసి ఆశ్చర్యపోయినట్లు ఓ ఫొటోను షేర్ చేసింది. దీని ద్వారా ‘గ్లోబ్‌ట్రాటర్’…
నటనలో తనదైన ముద్ర వేసుకున్న టాలీవుడ్ వెటరన్ నటుడు మోహన్ బాబు, పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకున్నాడు. ఇటీవల ఆయన మంచు విష్ణు హీరోగా నటించిన ‘కన్నప్ప’లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించారు. అంతకు ముందు ‘శాకుంతలం’, ‘సూరారై పోట్రు’ వంటి చిత్రాలలో కూడా కీలక పాత్రలు పోషించారు. ఇక ఇప్పుడు ఆయన నాని హీరోగా నటిస్తున్న ప్యారడైజ్ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, ఘట్టమనేని జయకృష్ణ తొలి…
ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తన 43వ సినిమా “వేదవ్యాస్”తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా ప్రారంభమైంది. హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు పేరుగాంచిన కృష్ణారెడ్డి, మరోసారి అలాంటి కథతోనే వస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకులు వి.వి. వినాయక్, అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. Also Read:Anushka Shetty : ఘాటి ప్రమోషన్స్‌కి దూరంగా…
ఐటంసాంగ్ ఎవరైనా చేసేయొచ్చు. కానీ, ఆ ఛాన్స్ ఈమధ్య స్టార్స్‌ను మాత్రమే వరిస్తోంది. క్రేజీ భామలే చేయాలంటే, కోట్లలో రెమ్యునరేషన్ చెల్లించాలి. అదే ఫ్లాప్ హీరోయిన్ అయితే, లక్షల్లో ఇచ్చి, బడ్జెట్ సేవ్ చేయొచ్చు. ఈ స్ట్రాటజీతో ఐటంగర్ల్స్గా మారిన ఫ్లాప్ హీరోయిన్స్ ఐటమ్‌సాంగ్స్‌ను కబ్జా చేస్తున్నారు. హరిహర వీరమల్లులో నిధి హీరోయిన్ అంటూనే, ఐటంసాంగ్ చేస్తోందని చెప్పడంతో కన్ఫ్యూజ్ అయ్యారు ఆడియన్స్. సినిమా చూస్తే కానీ అర్థం కాలేదు, నిధి అగర్వాల్‌ది నెగెటివ్ రోల్ కావడంతో…
హీరో నారా రోహిత్ ల్యాండ్‌మార్క్ 20వ మూవీ ‘సుందరకాండ’. డెబ్యుటెంట్ వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. నారా రోహిత్ ఇందులో సిద్ధార్థ్ అనే సింగిల్ మ్యాన్ పాత్రలో కనిపించారు. తను మ్యారేజ్ ఏజ్ దాటినప్పటికీ, ఐదు క్యాలిటీస్ కలిగి ఉన్న పార్ట్నర్ కోసం సెర్చ్ చేయడం, తన మ్యాచస్ కోసం పేరెంట్స్ కూడా విసిగిపోవడం వంటి కథాంశంతో ఈ…
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన రాజాసాబ్ ఫస్ట్ గ్లిమ్స్ కు భారీ స్పందన వచ్చింది.…