‘తను నేను’, ‘పేపర్ బాయ్’ సినిమాలతో గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ రీసెంట్గా ‘ఏక్ మినీ కథ’తో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. దీంతో ఆయనకు పలు సినీ అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఈ యంగ్ హీరోతో దర్శకురాలు నందినీ రెడ్డి సినిమా ఉండనుందని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం. బేబీతో హిట్ కొట్టిన నందినీ రెడ్డి ఆ తర్వాత ఇంతవరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేయలేదు. అయితే నాగచైతన్యతో ఓ…
మహమ్మారి వల్ల ప్రస్తుతం హీరోలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే, పవన్ కళ్యాణ్ మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది. ఆయనకు కరోనా సోకటంతో ఇప్పుడు స్లోగా రికవర్ అవుతున్నారు. డాక్టర్స్ ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత మంచిది అనటంతో పీకే పూర్తిగా తన ఫామ్ హౌజ్ కే పరిమితం అయ్యారు. కాకపోతే, మళ్లీ షూటింగ్స్ మొదలైతే ఆయన నటిస్తోన్న రెండు చిత్రాలు కూడా సెట్స్ మీదకి వెళతాయి. అంతలోగా పవన్ ఫిజికల్ గా ఫిట్ గా మారాల్సి…
తెలుగు సినిమా చరిత్రలో తన కంటూ ఓ పేజీకి లిఖించుకున్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. దాదాపు 40కి పైగా చిత్రాలను రూపొందించిన ఆయన తన చిత్రాలకు తానే సెన్సార్ ఆఫీసర్. అందుకే ఆయన చిత్రాలంటే సెన్సార్ సభ్యుల కత్తెరకు పని ఉండదనే ప్రచారం బాగా జరిగిపోయింది. సకుటుంబ సపరివార సమేతంగా సినిమాలను చూసే అదృష్టాన్ని ఎస్వీ కృష్ణారెడ్డి తెలుగు వారికి కలిగించారంటే అతిశయోక్తి కాదు. అయితే ఆయన సినిమాల్లో యాక్షన్ పార్ట్ ఉండదా అంటే ఉంటుంది. రొమాంటిక్…
ప్రస్తుతం కేరెక్టర్ రోల్స్ లో కనిపిస్తోన్న భానుచందర్ ఒకప్పుడు కరాటే ఫైట్స్ తో కదం తొక్కారు. కొన్ని చిత్రాలలో హీరోగానూ అలరించారు. భానుచందర్ పూర్తి పేరు మద్దూరి వేంకటత్స సుబ్రహ్మణ్యేశ్వర భానుచందర్ ప్రసాద. ఆయన తండ్రి తెలుగులో విశేషమైన పేరు సంపాదించిన సంగీత దర్శకులు మాస్టర్ వేణు. తండ్రిలాగే ఆరంభంలో భానుచందర్ సైతం సరిగమలతో సావాసం చేశారు. పదనిసలో పయనం సాగించాలనీ ప్రయత్నించారు. గిటారిస్ట్ గా పేరు సంపాదించారు. ప్రఖ్యాత హిందీ సంగీత దర్శకులు నౌషాద్ వద్ద…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. జనతా గ్యారేజ్ సినిమాతో ఐదేళ్ళ కింద సంచలన విజయం సాధించిన వీరిద్దరు.. ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ దగ్గర రిపేర్లు చేయడానికి వచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తిచేసుకొనే పనిలో పడ్డారు. త్వరలోనే కొరటాల-ఎన్టీఆర్ మూవీ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాపై ఉన్న అంచనాలకు ఏ మాత్రం తీసిపోని రేంజ్లో సినిమా ఉంటుందని కొరటాల గ్యారెంటీ ఇస్తున్నారు.…
టాలీవుడ్ హీరో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా కరోనా కారణంగా ఆశించినంతగా వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇదిలావుంటే, ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. జూన్ 12 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ప్రస్తుతం నితిన్ ‘మాస్ట్రో’ సినిమా చేస్తున్నాడు. ఇందులో నభా నటేష్ హీరోయిన్ కాగా తమన్నా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.…
మనోరమ పేరు వింటే ఈ తరం వారికి ఆమె నటించిన ముసలి వేషాలే ముందుగా గుర్తుకు వస్తాయి. 1958 నుండి 2015 దాకా అంటే 57 సంవత్సరాలు చిత్రసీమలో తనదైన బాణీ పలికిస్తూ, దాదాపు 1500 చిత్రాలలో నటించారు మనోరమ. అన్ని చిత్రాలలో నటించిన నటి మరొకరు మనకు కానరారు. తెలుగు, తమిళ భాషల్లో అత్యధిక చిత్రాలలో తల్లి పాత్రలు పోషించి మెప్పించారు. కొన్ని చిత్రాలలో కథానాయికగానూ నటించారు. హాస్య పాత్రల్లో తనకు తానే సాటి అనిపించారు.…
నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య ఇస్తున్న నాటు మందును ఆయుర్వేదం ఖాతాలో వేయాలా వద్దా అని ప్రభుత్వ, వైద్య అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అది ఒక కొలిక్కి రాకపోయినా… లక్షలాది మంది ఆ మందు మీద నమ్మకంతో కరోనా బారిని నుండి బయట పడటానికి అదే కరెక్ట్ అని నమ్ముతున్నారు. పర్యవసానం ఎలా ఉన్నా ఆ మందును వేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఈ సందిగ్థ సమయంలో ప్రముఖ నటుడు జగపతిబాబు మాత్రం ఆనందయ్య పక్షాన నిలిచారు. ఆయన తన…
ఈ రోజు ఉదయం నుండీ చంద్రమోహన్ ఆరోగ్యంపై రకరకాల ఫేక్ న్యూస్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే ఎనభైవ జన్మదినోత్సవాన్ని సైతం చంద్రమోహన్ జరుపుకున్నారు. ఆ సందర్భంగా ఇకపై తాను సినిమాలలో నటించనంటూ ఆయన ప్రకటించారు. అయితే… దానిని తప్పుగా అర్థంచేసుకున్న కొందరు ఆయన ఫోటోలను పెట్టి రెస్ట్ ఇన్ పీస్ అంటూ వార్తలను స్ప్రెడ్ చేశారు. ఇది చంద్రమోహన్ దృష్టికి సైతం వెళ్ళింది. దాంతో ఆయన వెంటనే ఓ వీడియోను మీడియాకు విడుదల…
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ ప్లే బ్యాక్ సింగర్ ఏవీఎన్ మూర్తి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం కన్నుమూశారు. ప్లేబ్యాక్ సింగర్గా అనేక సినిమాలకు పాటలు పాడిన ఆయన తనదైన గాత్రంతో శ్రోతలను మెప్పించారు. ఏవీఎన్ మూర్తి కుమారుడు శ్రీనివాస మూర్తి ప్రస్తుతం డబ్బింగ్ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. ఏవీఎన్ మూర్తి మృతిపై సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాగా వరుస మరణాలతో టాలీవుడ్ లో తీవ్ర…