సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మూవీ ‘బుజ్జి ఇలా రా’. సైకలాజికల్ థ్రిల్లర్.. అనేది మూవీ ట్యాగ్‌లైన్. దీనిని బట్టే సినిమా జానర్ ఏమిటనేది అర్థమవుతుంది. చాందిని అయ్యంగార్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ కొద్ది రోజుల క్రితం విడుదలై, మంచి స్పందనను రాబట్టుకుంది. తాజాగా ఈ సినిమాలో సీఐ కేశవ్ నాయుడు పాత్రలో నటిస్తున్న ధన్‌రాజ్ పాత్రకు సంబంధించిన లుక్‌ను ప్రముఖ హీరో సందీప్ కిషన్ విడుదల చేశారు. ‘గరుడవేగ’ అంజి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారు. సినిమాకు ఆయనే సినిమాటోగ్రాఫర్‌గానూ వర్క్ చేశారు. ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. రూపా జగదీశ్ సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా, భాను, నందు మాటలు రాశారు.
Wishing my Dear #NageshwarReddy Garu & Darling 'CI Keshava Naidu' aka @DhanrajOffl all the very best ❤️
— Sundeep Kishan (@sundeepkishan) August 15, 2021
First look of #BujjiIlaRaa.🔥#HappyIndependenceDay 🇮🇳@Mee_Sunil @IamChandini_12 @drksi13@DopAnji @ImSaiKartheek #NagiReddy #SanjeevaReddy #RupaJagadeesh #SNSCreations pic.twitter.com/NrDAw5INPA