అందగాడు వారం వెనక్కి వెళ్ళాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటుడిగా, దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుకుంటోన్న అవసరాల శ్రీనివాస్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం 101 జిల్లాల అందగాడు. బట్టతల ఉండే యువకుడు గొత్తి సత్యనారాయణగా అవసరాల శ్రీనివాస్ నటించిన ఈ చిత్రంలో, ఆయన ప్రేయసి పాత్రలో రుహానీ శర్మ నటించారు. హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌వీసీ-ఎఫ్ఈఈ బ్యానర్స్‌పై దిల్‌రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 3న విడుదల చేయబోతున్నారు.
నిజానికి 101 జిల్లాల అందగాడు చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయాలని నిర్మాతలు తొలుత భావించారు. ఆ విధంగా ప్రకటన కూడా ఇచ్చారు. కానీ అదే తేదీన సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్, సుశాంత్ ఇచ్చట వాహనములు నిలుపరాదు తో పాటు మరికొన్ని సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఒకేవారం ఎక్కువ సినిమాలు విడుదలైతే నిర్మాతలే నష్టపోవాల్సి ఉంటుంది కాబట్టి, అలా జరగకుండా అందరూ బావుండాలనే సదుద్దేశంతో తమ 101 జిల్లాల అందగాడు చిత్రాన్ని సెప్టెంబర్ 3న విడుదల చేయాలని నిర్ణయించుకున్నామని నిర్మాతలు తెలిపారు.
Also Read
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- Alias Rukmini Heroine: 'అలియాస్ రుక్మిణీ'.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమాకు సంబంధించిన వీడియో ప్రోమో, టీజర్, టైటిల్ సాంగ్‌తో పాటు మనసా వినవా.. లిరికల్ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. సినిమా ఎలా ఉండబోతుందోనని ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ అయ్యింది. టాలీవుడ్‌లో డిఫరెంట్ మూవీస్‌లో నటుడిగా, సెన్సిబుల్ డైరెక్టర్‌గా, రైటర్‌గా తనదైన గుర్తింపు సంపాదించుకున్న అవసరాల శ్రీనివాస్ 101 జిల్లాల అందగాడు చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా తనదైన కామెడీ పంచులతో ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా మంచి ఎంటర్‌టైనింగ్ కథను అందించారని నిర్మాతలు తెలిపారు.
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!