టాలీవుడ్ స్టార్స్ సమంత, నాగచైతన్య తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే గతంలో సమంత పేరు మార్చుకున్నప్పుడే చాలా వరకు వారి విడాకుల విషయమై తెలిసిపోయింది. సమంత అక్కినేని గా ఉన్న పేరును ఆమె ఎస్ గా మార్చారు. ఇలా కొన్నాళ్ల పాటు కొనసాగిన సమంత మరోసారి తాజాగా సోషల్ మీడియాలో తన పేరును మార్చారు. అధికారికంగా విడాకుల తీసుకున్న మరుసటి రోజే ‘ఎస్’ అక్షరాన్ని తొలగించి ‘సమంత’గా మార్చేసుకోంది. నాగ చైతన్యతో పెళ్ళికి ముందు సమంత సోషల్ మీడియా ఖాతాలకు సమంత రుతు ప్రభు అనే పేరు ఉండేది. కానీ, 2017లో నాగచైతన్యను వివాహం చేసుకున్న సమంత.. తన పేరుకు అక్కినేని చేర్చుకొని సమంత అక్కినేనిగా సోషల్ మీడియాలో పేరును మార్చేసుకుంది. మరోవైపు నెటిజన్లు వీరి విడాకుల విషయమై ఎవరికి వారు విశ్లేషణలు చేస్తూ జడ్జిమెంట్లు కూడా ఇచ్చేస్తున్నారు.