అర్థం చేసుకోండి.. ఏపీ సర్కారుకు అల్లు అరవింద్ స్పెషల్ రిక్వెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని అఖిల్-పూజా హెగ్డే కలిసిన నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమా అక్టోబర్ 15న విడుదల కానుంది. ఈ సందర్బంగా తాజాగా ట్రైలర్ ఈవెంట్ ను నిర్వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ రూపొందిస్తున్న ఈ మూవీని బన్నీ వాసు, మరో నిర్మాత వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
కాగా ఈ ఈవెంట్ కు హాజరైన నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘కరోనా వేవ్ తరువాత తెలుగు ప్రేక్షకులు థియేటర్స్ వచ్చి.. ప్రపంచానికి లెస్సన్ నేర్పించారని కొనియాడారు. తెలుగు ప్రేక్షకుల రెస్పాన్స్ చూసే ఈరోజు అన్ని చోట్ల థియేటర్లు తెరవగలుగుతున్నారు.. మనం ప్రేమించినంతగా సినిమాను ఎవరు ప్రేమించలేరు అని ప్రూవ్ చేశారని అల్లు అరవింద్ ఆనందం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో ఏపీ సీఎంకు ఆయన విజ్ఞప్తిని తెలియచేశారు. కరోనా నుంచి ప్రజలను ఎలా రక్షించారో, సినీ పరిశ్రమను రక్షించాలని అభ్యర్ధించారు. రాజు తలుచుకుంటే వరాలకు కొదువ లేదని వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమ సమస్యలను దయచేసి అర్థం చేసుకోవాలని కోరారు. ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు మీపై ఆధారపడి వుంటాయని వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమ విజయవంతంగా కొనసాగేందుకు సహకరించాలని అల్లు అరవింద్ ముఖ్యమంత్రిని కోరారు.
Also Read
- Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
- Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
- SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?
- Nana Patekar: కార్గిల్ వార్లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
అయితే, నిన్న పలువురు నిర్మాతలు ఏపీ మంత్రి పేర్ని నాని కలిసి ఆన్ లైన్ సినిమా టికెటింగ్ పద్ధతికి మద్దతు పలికిన సంగతి తెలిసిందే.. బెనిఫిట్ షో ల గురించి ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేసారు. మరోవైపు పవన్ కళ్యాణ్ దూకుడు, ‘మా’ ఎన్నికల వివాదాలతో సినీ ఇండస్ట్రీ వార్తలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!