బోయపాటి శ్రీనుకు మళ్లీ మంచిరోజులొచ్చాయి అని అంటున్నారు టాలీవుడ్ వర్గాలవారు. వినయ విధేయ రామ చిత్రంతో డిజాస్టర్ ని అందుకున్న బోయపాటి ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకొని తనకు విజయాలను తెచ్చిపెట్టిన బాలయ్యతో మూడో హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తన కసిని అంతా మాస్ యాక్షన్ గా మలిచి అఖండ లో చూపించాడు. అఖండ విడుదలై అఖండమైన విజయాన్ని అందుకుంది.. దీంతో బోయపాటి కల ఫలించి మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చాడు.…
నవతరం దర్శకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకొని సక్సెస్ రూటులో సాగిపోతున్నారు సురేందర్ రెడ్డి. తొలి చిత్రం ‘అతనొక్కడే’ మొదలు మొన్నటి ‘సైరా…నరసింహారెడ్డి’ దాకా తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వైవిధ్యం చూపించే ప్రయత్నం చేశారు సురేందర్ రెడ్డి. కరీంనగర్ జిల్లా మాచంపల్లి సురేందర్ రెడ్డి స్వగ్రామం. 1975 డిసెంబర్ 7న సురేందర్ రెడ్డి జన్మించారు. ఆయన తండ్రి వీరారెడ్డి వారి గ్రామానికి సర్పంచ్ గా ఉండేవారు. సురేందర్ రెడ్డికి చిన్నప్పటి నుంచీ సినిమాలంటే…
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ పెళ్లి కూతురుగా మారుతున్న సంగతి తెల్సిందే.. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ని ప్రేమించిన అమ్మడు ఎట్టకేలకు వివాహంతో అతడి చెంతకు చేరనుంది. వీరి పెళ్లి అతికొద్ది బంధువులు.. ఇంకొంతమంది ప్రముఖల మధ్య ఈ నెలలో జరగనుంది. ఇప్పటికే రాజస్థాన్ లో క్యాట్- విక్కీల పెళ్ళికి అంతా సిద్ధమవుతున్నాయి. ఇక తాజగా ఈ జంట పెళ్లి పత్రికలను పంచే పనిలో పడ్డారంట .. చాలా ముఖ్యమైన గెస్టులను మాత్రమే కత్రినా పిలవనున్నదట..…
మెగాస్టార్ చిరంజీవి జోరు మాములుగా లేదు.. కుర్ర హీరోలతో సమానంగా కాదు కుర్ర హీరోల కంటే ముందే మెగాస్టార్ జోరుమీద ఉన్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలను ఏకకాలంలో పూర్తి చేస్తూ రికార్డ్ సృష్టించారు. ఇప్పటికే ‘ఆచార్య’ షూటింగ్ ని పూర్తీ చేసుకొని విడుదలకు సిద్దమవుతుంది.. ఈ సినిమా తరువాత మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ ని పట్టాలెక్కించారు.. ఈ షూటింగ్ మొదలుపెట్టిన కొద్దిరోజులకే యంగ్ డైరెక్టర్ బాబీ…
అల్లు అర్జున్ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. ‘పుష్ప’ ట్రైలర్ ని మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. కొన్ని సాంకేతిక కారణాలవలన ఆలస్యం అయ్యిందని చెప్పినా ఎట్టకేలకు అభిమానుల కోరిక మేరకు ట్రైలర్ ని విడుదల చేశారు. బన్నీ- సుకుమార్ కాంబోలో వస్తున్నా మూడో చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక ట్రైలర్ విషయానికొస్తే ఆద్యంతం ఉత్కంఠను…
నాగబాబు కుమార్తె నిహారిక భర్త చైతన్యతో కలసి ప్రస్తుతం స్పెయిన్‌లో విహరిస్తోంది. తన హాలీడే ట్రిప్ కి సంబంధించి ప్రతి రోజూ అప్ డేట్స్ ను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ వస్తోంది నీహారిక. స్పెయిన్ లోని అద్భుతమైన లొకేషన్స్, ప్రసిద్ధమైన కోస్టాస్ బీచ్‌తో పాటు రోమన్ శిధిలాలను సందర్శించిన నిహారిక ఆ ఇమేజెస్ ను షేర్ చేసింది. ఇక తను స్పెయిన్ లో స్కైడైవింగ్ను ఎలా పూర్తి చేసిందో వీడియో ద్వారా తెలియచేసింది. తను స్కై…
నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘అఖండ’ ఆన్ స్టాపబుల్ సక్సెస్ తో దూసుకుపోతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 2న ఆడియన్స్ ముందుకు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. తాజాగా ఆహాలో బాలకృష్ణ చేస్తున్న అన్‌స్టాపబుల్ షోకి అఖండ బృందం హాజరైంది. ఈ షో నాలుగో ఎపిసోడ్‌కు బోయపాటి శ్రీను, ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, సంగీత దర్శకుడు థమన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ఎపిసోడ్…
గత ఏడాది ఆరంభంలో ‘అల వైకుంఠపురములో’తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఈ ఏడాది ‘పుష్ప’తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సంవత్సరం ఆఖరులో రాబోతున్న అతి పెద్ద భారీ చిత్రమే కాదు… మోస్ట్ ఎవెయిటింగ్ ఫిల్మ్ ‘పుష్ప’. ఈ నెల 17న విడుదల కాబోతున్న బన్నీ, సుక్కు కాంబో ప్రీ-రిలీజ్ ఈవెంట్ 12 వ తేదీన జరగనుంది. ఇప్పటికే ఈ వేడుకకు ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడనే ప్రచారం జరిగింది. అయితే వినవస్తున్న…
సుప్రీమ్ హీరో సాయి తేజ్, విలక్షణ దర్శకుడు దేవ్ కట్టా కలయికలో రూపొందిన సినిమా ‘రిపబ్లిక్’. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారుల పాత్ర ఏమిటి? రాజకీయ నాయకులు ఎలా ఉండాలి? ప్రజలు ఏం చేయాలి? ఏం తెలుసుకోవాలి? అనే వాటిని గురించి తెలియచెప్పిన సినిమా ‘రిపబ్లిక్’. దీనికి థియేటర్లలో మంచి స్పందన లభించింది. అప్పట్లో కరోనా భయాలతో వెళ్లని ప్రేక్షకులు, జీ 5 ఓటీటీ వేదికలో విడుదలైన తర్వాత సినిమాను ఓ ఉద్యమంలా చూస్తున్నారు. ”రిపబ్లిక్’ ఓ మూవీ…
ప్రస్తుతం చిత్రపరిశ్రమలో సినీఅభిమానులందరు ఎదురుచూస్తున్న చిత్రాల్లో రాధేశ్యామ్ ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కు సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ స్టార్ చేసిన మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ అంచనాలను పెంచుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా హిందీలో రెండో సింగిల్…