ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన చిత్ర పుష్ప. ఇటీవల విడుదలైన ఈ చిత్రం రికార్డుల కలెక్షన్లను రాబట్టి విజయవంతంగా కొనసాగుతోంది. ఇక ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఊ అంటావా మావా .. ఊఊ అంటావా మావా అనే పాటే వినిపిస్తోంది. ఈ సాంగ్ గురించి చెప్పగానే సమంత నాకు కరెక్ట్ కాదని రిజెక్ట్ చేసి.. మళ్ళీ తర్వాత చేయడానికి అంగీకరించిందని సుకుమార్ చెప్పారు.
ఇక తాజాగా ఈ సాంగ్ పై సామ్ తన స్పందన తెలియజేసింది. ” నేను బాగా ఆడాను, చెడుగా ఆడాను, నేను ఫన్నీగా ఉన్నాను, నేను సీరియస్‌గా ఉన్నాను, నేను చాట్ షో హోస్ట్‌ని కూడా.. నేను చేసే ప్రతిదానిలో రాణించడానికి చాలా కష్టపడుతున్నాను … కానీ సెక్సీగా ఉండడం వాటన్నింటికి మించి కష్టమైన పని. తమ్ముడూ ఊ అంటావా ఊఊ అంటావా కు మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చింది. ఈ సాంగ్ ని సామ్ తో అనుకున్నప్పుడు ఐటెం సాంగ్ కి సామ్ పనికిరాదు.. మ్మాస్ స్టెప్పులు వేయాలి.. శృంగారం కలబోసినట్లు చూడాలి.. హావభావాలు కిక్కు ఇచ్చేలా ఉండాలి అని పలువురు విమర్శించారు. ఇక పాట రిలీజ్ అయ్యాకా సామ్ ని చూసిన ప్రతి ఒక్కరు ఆ ఐటెం సాంగ్ అంటే ఇది .. సామ్ అంతకుమించి చేసింది అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు.
https://www.instagram.com/p/CXtT1ayhPkQ/