టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ఇటీవల ‘వరుడు కావలెను’ చిత్రంతో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ హిట్ తో జోష్ మీదున్న శౌర్య ఈసారి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నాగ శౌర్య, కేతిక శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘లక్ష్య’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్…
మా హీరో సింహం లాంటోడు.. చిరుత లాంటి కళ్లు.. సింహం లాంటి పొగరు అంటూ అభిమానులు తమ అభిమాన హీరోలను పొగడడం చాలాసార్లు వింటూనే ఉంటాం. ఇక స్టార్ హీరో కొత్త సినిమా పోస్టర్ రావడం ఆలస్యం.. సింహాన్నో, పులినో పక్కనపెట్టి.. అడవికి రాజు సింహం.. ఇండస్ట్రీకి రాజు మా హీరో అంటూ ట్యాగ్ లైన్ జోడించి సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తూ ఉంటారు. దీంతో సినిమాల్లో సైతం హీరోలను అదే విధంగా ఎలివేట్ చేస్తున్నారు.…
ఏ గీత రచయితకైనా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఒక్కసారైనా ఉత్తమ గీత రచయితగా నిలవాలన్న అభిలాష ఉంటుంది. తెలుగు చిత్రసీమలోనూ అలాంటి కోరికతో ఎంతోమంది గీతరచయితలు సాగుతున్నారు. కొందరిని అవార్డులు వరించాయి. కొందరి పాటలు మురిపించినా, జనం రివార్డులతోనే సరిపుచ్చుకోవలసి వచ్చింది. తెలుగు సినిమా రంగంలో పదకొండు సార్లు రాష్ట్రప్రభుత్వ నంది అవార్డులను అందుకున్న ఏకైక గీత రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి చరిత్ర సృష్టించారు. ఆ మాటకొస్తే నంది అవార్డుల్లో ‘హ్యాట్రిక్’ సాధించిన ఏకైక పాటల రచయిత…
తెలుగు చిత్రసీమలో వెలసిన పాటలతోటలో ఎన్నెన్నో తేనెల వానలు కురిశాయి. అన్నీ తెలుగువారికి పరమానందం పంచాయి. ఈ తోటపై ‘సిరివెన్నెల’ కురిపించిన ఘనత మాత్రం సీతారామశాస్త్రిదే అని అందరూ అంగీకరిస్తారు. సీతారామశాస్త్రి పాటల్లోని పదబంధాలకు తెలుగు జనం ఆరంభంలోనే బందీలయిపోయారు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా వందల పాటల్లో సిరివెన్నెల కురుస్తూనే ఉంది. నింగిలోని చంద్రుడు కురిపించే వెన్నెల ప్రపంచానికంతా పరిచయమే, నేలపైని చెంబోలు సీతారాముడు కురిపించే సిరివెన్నెల మాత్రం తెలుగువారికి మాత్రమే సొంతం. ఒకటా రెండా…
అక్కినేని నాగ చైతన్య తో విడాకుల తరువాత సమంత రూటు మార్చింది. ఒకపక్క సినిమాలు, మరో పక్క యాడ్స్ తో బిజీగా మారిపోయింది. ఇక తాజాగా అమ్మడు కవర్ పేజీ కూడా ఎక్కేసింది. ‘ఎల్లే ఇండియా’ మ్యాగజైన్ కవర్ పేజీ లో గ్లామర్ ఫోజ్ లో పిచ్చెక్కిస్తోంది. రెడ్ హాట్ డ్రెస్ వేసుకొని సోఫాలో తాపీగా కూర్చొని మోడల్ లుక్ తో మెరిపించింది. ఇక ఈ కవర్ పేజీని సామ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా కుదిపేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక చిత్ర పరిశ్రమ అయితే కరోనా దెబ్బకు కుదేలయిపోయింది. ఇప్పుడిప్పుడే అన్నింటికి, అందరికి మంచి రోజులు వస్తున్నాయి.. త్యేతర్లు కళకళలాడుతున్నాయి అనుకొనేలోపు కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ బి.1.1.529 మరో సవాల్ విసురుతోంది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని డబ్ల్యూహెచ్వో చెప్తున్న తరుణంలో ఓమిక్రాన్ కేసులు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఇక ఇప్పటికే వాయిదాల మీద వాయిదాల వేస్తూ వస్తున్నా సినిమాలు పరిస్థితి అయితే దారుణమని…
నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్, నాగార్జున తో ‘మన్మధుడు 2’ చిత్రం తీసి భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. ఈ సినిమా తరువాత రాహుల్ డైరెక్టర్ గా మరో కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో తలమునకలవుతున్నట్లు రాహుల్ ఇటీవల తెలిపాడు. ఇకపోతే ఈ సినిమా కోసం అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలని ప్రకటించాడు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. ముఖ్యంగా మహిళలకు మాత్రమే ప్రాధాన్యం అని తెలిపాడు. ” నా తదుపరి…
బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి అల్లరి ఎలా ఉంటుందో అందరికి తెలుసు.. షూటింగ్ లేని సమయంలో, షూటింగ్ గ్యాప్ సమయంలో అమ్మడు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ అభిమానులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది. శ్రీముఖి హిడెన్ ట్యాలెంట్ లో సింగింగ్ ఒకటి. ఇటీవల ఓ షో లో ఆ ట్యాలెంట్ ని కూడా బయటపెట్టి ఔరా అనిపించినా విషయం తెలిసిందే. అయితే తాజాగా తన సింగింగ్ ట్యాలెంట్ తో మెగా బ్రదర్ నాగబాబుకు చుక్కలు చూపెట్టింది ఈ ముద్దుగుమ్మ.…
ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. ఈ చిత్రంతో బూరె బుగ్గల చిన్నదాన్ని టాలీవుడ్ ప్రేక్షకులు తెలుగింటి ఆడపడుచులా మార్చేసుకున్నారు. యంగ్ హీరోల సరసన నటిస్తూ అమ్మడు విజయాలను అందుకుంటూ వస్తుంది. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు ఇటీవల ఈ బొద్దుగుమ్మ చిక్కిపోయి కనిపించినా తెలుగు ప్రేక్షకులు ఒకే అనేసుకున్నారు. తెలుగే కాకుండా అన్ని భాషల్లోనూ తన సత్తా చాటుతున్న ఈ ఢిల్లీ బ్యూటీ నేడు తన 31 వ పుట్టినరోజు…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క ల పెయిర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ రియల్ కపుల్స్ ని గుర్తుచేస్తూ ఉంటుంది. ‘మిర్చి’, ‘బిల్లా’, ‘బాహుబలి’ చిత్రాల్లో వారిద్దరి రొమాన్స్ చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది. ఇక ఈ జంట బయట కూడా ప్రేమికులే అన్న వార్తలు ఇప్పటికి అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. కానీ, మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహ బంధమేననీ స్వీటీ, ప్రభాస్ తేల్చి…