ప్రపంచ వ్యాప్తంగా అందరు ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’రిలీజ్ కి దగ్గరపడుతుంది . రోజురోజుకు జక్కన్న అంచనాలను పెంచేస్తున్నాడు. నిత్యం సినిమాకు సంబందించిన ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులకు ఊపు తెప్పిస్తున్నాడు. ఇప్పటికే ముంబై లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ ఆసక్తి రేపుతోన్న మేకర్స్ .. తాజాగా రామ్- భీమ్ మేకింగ్ వీడియోలను రిలీజ్ చేశారు . ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపిస్తుండగా.. గోండ్రు బొబ్బిలి కొమరం భీమ్ గా జూ. ఎన్టీఆర్ కనిపించనున్నాడు.
ట్రైలర్ లో వీరిద్దరి వీరోచిత పోరాటాలు ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పించాయి. ఈ సినిమా కోసం ఈ స్టార్ హీరోలు ఎంతగా కష్టపడ్డారో ఈ మేకింగ్ వీడియో చూస్తుంటే తెలుస్తోంది. అల్లూరిగా చరణ్ కష్టపడ్డ తీరు, తారక్ భీమ్ లా మారిన విధానం ఆకట్టుకొంటోంది. ఇక సెట్ లో చరణ్ , తారక్ ల సందడి , రాజమౌళి సీన్స్ వివరించడం కనిపించాయి. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి జనవరి 7 న ఈ సినిమా ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.