‘ఆచార్య’ మాస్ మసాలా ట్రైలర్ రెడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిరంజీవి, రామ్ చరణ్ తో కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై వస్తున్న ‘ఆచార్య’ సినిమా సమ్మర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ‘శానా కష్టం…’ పాట యు ట్యూబ్ ని షేక్ చేస్తోంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ పాటను చిరంజీవి, రెజీనాపై చిత్రీకరించారు. ఈ పెప్పీ నెంబర్ మాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. ఈ పాటలో చిరు వేసిన స్టెప్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇదిలా ఉంటే ఆలయాల నేపథ్యంలో దేవాదాయశాఖలో అక్రమాలపై ఈ సినిమా రూపొందుతోంది.
ఇక ఈ సినిమా ట్రైలర్ రెడీ అయింది. త్వరలోనే దీనిని విడుదల చేయబోతున్నారు. యు.ఎ.ఇ సెన్సార్ బోర్డ్ సభ్యడు ఉమైర్ సంధు ఈ ట్రైలర్ రీవ్యూని ట్విటర్ లో పోస్ట్ చేశాడు. ట్రైలర్ ఫైనల్ కట్ లాక్ అయిందంటూ చిరంజీవి, రామ్ చరణ్ మళ్ళీ మాస్ మసాలాతో వచ్చారని ట్వీట్ చేశాడు. చిరంజీవి అంటేనే మాస్ మసాలా అని, ట్రైలర్ పూర్తిగా అలాగే ఉంటుందని చెప్పేశాడు ఉమైర్ సంధు. ఈ ‘ఆచార్య’ ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సన్నద్ధం అవుతోంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి వరుసగా సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇటు చరణ్ కూడా శంకర్ సినిమాతో బిజీ కాబోతున్నాడు. మరి వీరిద్దరి కలయికలో అపజయం ఎరగని కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ‘ఆచార్య’ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!