పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రానా మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంని త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ రికార్డుల మోత మోగిస్తున్నాయి. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కానుంది అని మేకర్స్ ప్రకటించారు. అయిదు మధ్యలో ఈ సినిమా వాయిదా పడుతోందని ఎన్నో పుకార్లు వచ్చినా వాటన్నింటికి…
ప్రపంచ వ్యాప్తంగా అందరు ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’రిలీజ్ కి దగ్గరపడుతుంది . రోజురోజుకు జక్కన్న అంచనాలను పెంచేస్తున్నాడు. నిత్యం సినిమాకు సంబందించిన ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులకు ఊపు తెప్పిస్తున్నాడు. ఇప్పటికే ముంబై లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ ఆసక్తి రేపుతోన్న మేకర్స్ .. తాజాగా రామ్- భీమ్ మేకింగ్ వీడియోలను రిలీజ్ చేశారు . ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపిస్తుండగా.. గోండ్రు బొబ్బిలి…
‘చిలసౌ’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ రుహాని శర్మ .. మిడిల్ క్లాస్ అమ్మాయిలా ఎంతో పద్దతిగా కనిపించిన ఈ భామ ఆ తరువాత హిట్ చిత్రంలో మోడ్రన్ లుక్ లో మెరిసింది. ఇక ‘డర్టీ హరి’ చిత్రంలో కీలక పాత్ర పోషించి హిట్ అందుకున్న రుహని ఇటీవల విడుదలైన ‘నూటొక్క జిల్లాల అందగాడు’ చిత్రంతో మంచి మార్కులనే కొట్టేసింది. వరుస సినిమా అవకాశాలను అందుకొంటూనే సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్లతో కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది.…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన చిత్ర పుష్ప. ఇటీవల విడుదలైన ఈ చిత్రం రికార్డుల కలెక్షన్లను రాబట్టి విజయవంతంగా కొనసాగుతోంది. ఇక ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఊ అంటావా మావా .. ఊఊ అంటావా మావా అనే పాటే వినిపిస్తోంది. ఈ సాంగ్ గురించి చెప్పగానే సమంత నాకు కరెక్ట్ కాదని…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లైన్ అప్ మాములుగా లేదు. వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయాడు. ఇక ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ ని పూర్తి చేసుకొని శంకర్ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. కొన్ని రోజులు షూటింగ్ మొదలు పెట్టిన శంకర్ కి చరణ్ ఝలక్ ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కారణంగా రెండు నెలలు షూటింగ్ కి గ్యాప్ ఇవ్వాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. దీంతో శంకర్ సినిమా వాయిదా పడింది. ప్రస్తుతం…
టేకాఫ్ లో కాసింత తడబాటు, ఆ పై ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కోలా మాటలతో తిరుగుబాటు- ఇలా ఇప్పటికి ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ నాలుగు ఎపిసోడ్స్ కానిచ్చేశారు. వాటన్నిటి కంటే భిన్నంగా సాగింది ఐదవ ఎపిసోడ్. ఇందులో దర్శకధీర రాజమౌళి గెస్ట్ గా రావడం, ఆయనకు తగ్గ ప్రశ్నలతో బాలయ్య సందడి చేయడం ఎంతగానో ఆకట్టుకుంది. మరో విశేషమేమిటంటే, ఈ ఎపిసోడ్ గంట పాటు ఉండడం! కుటుంబం విలువలు చెబుతూ,…
బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ విజె సన్నీ, అషిమా నార్వేల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సకల గుణాభిరామ’. శ్రీనివాస్ వెలిగొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ని ప్రారంభించారు మేకర్స్. అంతేకాకుండా సన్నీ నిన్ననే బిగ్ బాస్ నుంచి బయటికి రావడంతో తమ హీరోకి ఈ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేసి స్వాగతం పలికారు చిత్ర బృందం. తాజాగా డైరెక్టర్ క్రిష్…
ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’లో ఓ యోగి పాత్రను రెబల్ స్టార్ కృష్ణంరాజు పోషించబోతున్నారన్నది ఎప్పటి నుండో వినిపిస్తున్న మాట. సినిమా షూటింగ్ చివరిలో చిత్రీకరణ జరుపుకుంది ఆయనకు సంబంధించిన సన్నివేశాలే అనే ప్రచారం కూడా జరిగింది. ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న దానిని బట్టి ‘రాధేశ్యామ్’ మూవీ సెన్సార్ కార్యక్రమాలను సైతం ఇప్పటికే పూర్తి చేసుకుందట. కానీ ఆ విషయాన్ని మేకర్స్ మాత్రం అధికారికంగా ప్రకటించడం లేదు. అయితే తాజాగా ఇందులో ప్రభాస్…
సమంత టైటిల్ రోల్ ప్లే చేస్తున్న పాన్ ఇండియా థ్రిల్లర్ మూవీ ‘యశోద’లో పరభాషా నటుల ఎంట్రీ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు వరలక్ష్మీ శరత్ కుమార్ ను ఎంపిక చేసి, ఆమెపై షూటింగ్ కూడా మొదలు పెట్టారు. తాజాగా ఈ మూవీలో ప్రముఖ మలయాళ నటుడు ఉన్ని ముకుందన్… గౌతమ్ పాత్రను చేస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చిత్ర బృందం తెలిపింది. ‘జనతా గ్యారేజ్’తో టాలీవుడ్ బాట పట్టిన…
జీ తెలుగులో ఇప్పటికే 13 సీజన్స్ ను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది ‘స రి గ మ ప’ మ్యూజిక్ రియాలిటీ షో. సింగింగ్ సూపర్ స్టార్స్ ను వెలికితీసే ఈ కార్యక్రమానికి సంబంధి సరికొత్త సీజన్ త్వరలో మొదలు కానుంది. అందుకోసం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ గత కొంతకాలం నుండి ఆడిషన్స్ జరుపుతున్నారు. ఇప్పటికే పలు పట్టణాలు, నగరాల్లో జరిగిన ఆడిషన్స్ లో దాదాపు 2 వేల మంది పాల్గొన్నారు. ఇక హైదరాబాద్లో ఈ నెల…