మురారి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ సోనాలి బింద్రే.. ఈ సినిమాలో మహేష్ సరసన సోనాలి నటన తెలుగు ప్రేక్షకుల మనస్సులో నిత్యం నిలిచే ఉంటుంది. ఇక ఈ సినిమా తరువాత టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించి సోనాలి 2013 లోనే సినిమాలకు గుడ్ బై చెప్పి.. ప్రేమించిన వాడిని వివాహం చేసుకొని సెటిల్ అయ్యింది. ఇక ఆ తరువాత అనుకోని విధంగా ఆమె క్యాన్సర్ బారిన పడి నరకం అనుభవించింది. అయినా…
దేన్నైనా ఆపొచ్చు కానీ.. అభిమానాన్ని ఆపలేరు.. మరి ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని ఆపడం అనేది ఎవరికి సాధ్యంకానీ పని. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంది అనగానే థియేటర్లను ముస్తాబు చేసి, ఫ్లెక్సీలు, కటౌట్ లను ఊరంతా పెట్టి, మొదటి రోజు మొదటి షో కి పూలాభిషేకాలు, పాలాభిషేకాలు అంటూ హడావిడి చేస్తూ అభిమాన హీరో సినిమా విడుదలను పండగలా చేస్తారు. ఇక్కడి వరకు ఓకే.. కానీ అభిమానం హద్దులు దాటి ప్రాణాల మీదకు…
బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ కి సిద్దమవుతుంది. వరుస వాయిదాల తరువాత ఎట్టకేలకు మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం సినీ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ రికార్డులు సృష్టించాయి. ఇక తాజగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ ని మేకర్స్ రిలీజ్…
యమలీల చిత్రంలో నీ జీను ప్యాంటు వేసి బుల్లెమ్మో.. అంటూ టైట్ జీన్స్ లో కుర్రకారును హోరెత్తించిన అందం ఇంద్రజ. ఇక ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకొని తెలుగు, తమిళ్, కన్నడ అని లేకుండా అన్ని భాషల్లోనూ హిట్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే ఒక వ్యాపారవేత్తను పెళ్ళాడి సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇంద్రజ రీ ఎంట్రీ ఇచ్చి బిజీగా మారిపోయింది. స్టార్ హీరోలకు అమ్మగా,…
అక్కినేని అఖిల్ తాజా చిత్రం ‘ఏజెంట్’ విడుదల తేదీ ఖరారైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ చిత్రం ఏమంటే… ఆగస్ట్ 11వ తేదీ ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ విడుదల కాబోతోంది. ఆమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో తొలిసారి అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో అతనో కీలక పాత్ర పోషించాడు. దాంతో ఈ…
ప్రస్తుతం టాలీవుడ్ లో విభిన్నమైన కథలను తెరకెక్కిస్తున్నారు. హీరోలు సైతం రొట్ట సినిమాలకు సై అనకుండా ప్రయోగాలకు సిద్ధం అంటున్నారు. ఇక ఒకప్పుడు స్టార్ హీరోలు పొలిటికల్ డ్రామా లో నటించడానికి జంకేవాళ్లు. లవ్ స్టోరీస్, యాక్షన్ థ్రిల్లర్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు. కథ నచ్చితే పొలిటికల్ అయినా పర్లేదు అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు పొలిటికల్ కథలతోనే తెరక్కుతున్నాయి. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. క్షణం తీరిక లేకుండా కుర్ర హీరోలకు ధీటుగా మూడు సినిమాలను ఒకేసారి కానిచ్చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం చిరు నటిస్తున్న సినిమాల్లో బాబీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఒకటి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక నేడు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సినిమాలోని…
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న చిత్రాల్లో రామారావు ఆన్ డ్యూటీ ఒకటి. నూతన దర్శకుడు శరత్ మందవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ , రజిషా విజయన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం చిత్ర బృందం…
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేయడానికి తెగ కష్టపడుతున్న సంగతి తెల్సిందే. ఇక దీనికునే విభిన్నమైన కథలను ఎంచుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఇక తాజాగా బాలీవుడ్ లో అమ్మడు నటిస్తున్న చిత్రాల్లో ఛత్రివాలి ఒకటి.. ఈ సినిమాలో రకుల్ కండోమ్ టెస్టర్ గా కనిపిస్తుంది. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్‌ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.. మొదటిసారి ఈ పాత్ర చేస్తున్నప్పుడు అందరు ఇలాంటి పాత్ర చేయడానికి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనవసరంగా ఎప్పుడు మాట్లాడడు.. ఎవరితోను గొడవలు పెట్టుకోడు.. అందుకే టాలీవుడ్ డార్లింగ్ అయ్యాడు ప్రభాస్. అలంటి ఈ హీరోతో బుట్టబొమ్మ పూజా హెగ్డే కి గొడవలు అయ్యాయి అనేది అప్పట్లో సంచలనం సృష్టించిన వార్త. వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్ ఇంకో వారంలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనలలో బిజీగా ఉన్న చిత్ర బృందం సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో…