యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనవసరంగా ఎప్పుడు మాట్లాడడు.. ఎవరితోను గొడవలు పెట్టుకోడు.. అందుకే టాలీవుడ్ డార్లింగ్ అయ్యాడు ప్రభాస్. అలంటి ఈ హీరోతో బుట్టబొమ్మ పూజా హెగ్డే కి గొడవలు అయ్యాయి అనేది అప్పట్లో సంచలనం సృష్టించిన వార్త. వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్ ఇంకో వారంలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనలలో బిజీగా ఉన్న చిత్ర బృందం సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఇక ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ తో గోడపై పూజా నోరు విప్పింది.
రాధేశ్యామ్ షూటింగ్ అప్పుడు ప్రభాస్ కు, మీకు మధ్య విబేధాలు నడిచాయని, ఆ తరువాత మీ మధ్య మాటలు లేవని వార్తలు గుప్పుమన్నాయి.. దానికి మీ స్పందన ఏంటి అని అడగగా..” ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్.. ఆయనతో కలిసి నటించడం నా అదృష్టం.. ఆయనతో కలిసి పనిచేసిన రోజులన్నీ అద్భుతం.. ఈ పుకార్లలో నిజం లేదు. నిజానికి అతను నాకు మా అమ్మకు కూడా ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని పంపాడు. ఇలాంటి ఆధారాలు లేని వార్తలను ప్రచారం చేయడం ఆపండి” అంటూ చెప్పుకొచ్చింది. పూజ ఈ వ్యాఖ్యతో ఒక్కసారిగా ఊహాగానాలకు తెర పడినట్లయింది. మరి మార్చి 11 న రిలీజ్ కానున్న ఈ సినిమాతో ప్రభాస్, పూజా హిట్ ని అందుకుంటారేమో చూడాలి.