ప్రస్తుతం టాలీవుడ్ లో విభిన్నమైన కథలను తెరకెక్కిస్తున్నారు. హీరోలు సైతం రొట్ట సినిమాలకు సై అనకుండా ప్రయోగాలకు సిద్ధం అంటున్నారు. ఇక ఒకప్పుడు స్టార్ హీరోలు పొలిటికల్ డ్రామా లో నటించడానికి జంకేవాళ్లు. లవ్ స్టోరీస్, యాక్షన్ థ్రిల్లర్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు. కథ నచ్చితే పొలిటికల్ అయినా పర్లేదు అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు పొలిటికల్ కథలతోనే తెరక్కుతున్నాయి. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తన 15వ చిత్రం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఇక ఈ సినిమాలో చరణ్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నాడట.. ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసే చరణ్ వ్యవస్థలో మార్పులకు కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయా నాయకుడిగా టర్న్ తీసుకుంటాడట. ఇక ఈ సినిమాకు మంచి ఇంట్రెస్టింగ్ టైటిల్ ని మేకర్స్ నిర్ణయించారని టాక్ వినిపిస్తోంది. సర్కారు చుట్టూ తిరిగే కథ కాబట్టి ఈ సినిమాకు ‘సర్కారోడు’ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇకపోతే ఇటీవల కాలంలో సర్కారు ను చిత్ర పరిశ్రమ తెగ వాడేస్తుంది. ఇప్పటికే ఇదే టైటిల్ తో కోలీవుడ్ హీరో విజయ్ పొలిటికల్ డ్రామా తెరకెక్కిన విషయం తెల్సిందే.. ఇక సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట లో కూడా కొద్దిగా పొలిటికల్ డ్రామా ఉండనున్నదని టాక్.. ఇక ఇదే పేరుతో ఇప్పుడు చరణ్ కూడా రెడీ అయిపోయాడు. మరి ఈ టైటిల్ వార్తలో నిజమెంత ఉందో తెలియాలి.